ధ్వంసమైన తీరం | Damage off the coast | Sakshi
Sakshi News home page

ధ్వంసమైన తీరం

Oct 14 2014 1:48 AM | Updated on Apr 3 2019 5:26 PM

ధ్వంసమైన తీరం - Sakshi

ధ్వంసమైన తీరం

హుదూద్ తుపాను విశాఖ తీరప్రాంతాన్ని కుదిపేసింది. మత్స్యకారుల జీవనాన్ని అతాలకుతలం చేసింది.

విశాఖపట్నం: హుదూద్ తుపాను విశాఖ తీరప్రాంతాన్ని కుదిపేసింది. మత్స్యకారుల జీవనాన్ని అతాలకుతలం చేసింది. బలమైన గాలులకు ఇళ్లు కూలిపోయాయి. బోట్లు ధ్వంసమయ్యూరుు. ఆదివారం ఉదయం నుంచి తినడానికి తిండిలేక, ఉండడానికి నీడలేక మత్స్యకారులు నిరాశ్రయులయ్యారు. దాదాపు 8 వేల కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. విశాఖ తీరానికి ఆనుకునే పెదజాలారిపేట ఉంది. ఇక్కడ సముద్రానికి 30 అడుగుల దూరంలో మత్స్యకారులు పాకలు వేసుకుని జీవిస్తున్నారు. ఎంత బీభత్సం జరిగినా తీరం వదిలి వెళ్లరు. చావైనా, బ్రతుకైనా గంగమ్మ తల్లి వద్దేనంటారు. ఇప్పటివరకు వచ్చిన తుపాన్లకు ఎదురొడ్డి నిలబడిన వీరు.. హుదూద్ ధాటికి నిలవలేకపోయూరు.

మనుషులకు ప్రాణపాయం తప్పిందనేగాని.. వారి జీవనం మాత్రం అస్తవ్యస్తమైపోయింది. బలమైన గాలులకు గుడిసెలు, వాటిలోని వస్తువులు ఎగిరిపోయాయి. ఒడ్డున లంగర్లు వేసిన బోట్లు ధ్వంసమయ్యూరుు. బోట్ల ఇంజన్లు దెబ్బతిన్నారుు. వలలు గాలిలో కొట్టుకుపోయూరుు. తినడానికి తిండి లేని పరిస్థితి దాపురించింది. గుక్కెడు నీరు కూడా కరువైంది. సర్వం కోల్పోరుు నిరాశ్రయులయ్యూరు. బోటు రూ.2 లక్షలు, ఇంజన్ రూ.లక్ష, వలకు రూ.30 వేలు నుంచి రూ.50 వేలు వరకు ఖర్చవుతుందని మత్స్యకారులు చెప్పారు. జాలారిపేటలో దాదాపు 400 బోట్లు ఉన్నారుు. అన్నీ దె బ్బ తినడంతో రూ.కోట్లల్లో నష్టం వాటిల్లింది. బోట్ల నష్టం పక్కన పెడితే మత్స్యకారులకు తినడానికి తిండి లేకుండా పోరుుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement