హుదూద్ తుఫానుకు ఐదుగురు మృతి | Cyclone Hudhud, Five killed in Andhra pradesh | Sakshi
Sakshi News home page

హుదూద్ తుఫానుకు ఐదుగురు మృతి

Oct 13 2014 9:49 AM | Updated on Apr 4 2019 5:24 PM

హుదూద్ తుఫాను ప్రభావంతో అయిదుగురు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

హైదరాబాద్ :  హుదూద్ తుఫాను ప్రభావంతో అయిదుగురు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2.48లక్షల మంది తుఫాను బాధితులుగా వెల్లడించింది. 223 సహాయక శిబిరాల్లోని 1.35లక్షల మందిని పునరావస కేంద్రాలకు తరలించినట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 44 మండలాల్లో 320 గ్రామాలు తుఫాన్ ప్రభావానికి గురయినట్లు తెలిపింది. తుఫాను ప్రభావంతో అయిదుగురు చనిపోగా, 34 పశువులు మృత్యువాత పడ్డాయని, అలాగే 70 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపింది.

కాగా సహాయక చర్యలకు గానూ 691మంది గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే 6 హెలికాప్టర్లతో నిరంతర పర్యవేక్షణ చేయడంతోపాటు 155 వైద్య బృందాలు, 56 పడవలు, 19 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement