నలుగురు క్రికెట్ బుకీల అరెస్ట్ | Cricket betting: four bookies arrested | Sakshi
Sakshi News home page

నలుగురు క్రికెట్ బుకీల అరెస్ట్

Jun 17 2015 6:28 PM | Updated on Aug 20 2018 4:44 PM

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన నలుగురు క్రికెట్ బుకీలను మంగళవారం రాత్రి వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు.

వైఎస్సార్ జిల్లా : మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన నలుగురు క్రికెట్ బుకీలను మంగళవారం రాత్రి వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.35లక్షల నగదుతోపాటు బెట్టింగ్ స్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. గద్వాల్‌కు చెందిన బొగ్గు శివ, శ్రీధర్, శ్రీనివాసులు ప్రొద్దుటూరుకు వచ్చి తరచూ బెట్టింగ్ నిర్వహించేవారు. మంగళవారం క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి డబ్బులు పంపిణీ చేస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement