చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలోని దళితవాడలో విషాదం చోటుచేసుకుంది.
చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలోని దళితవాడలో విషాదం చోటుచేసుకుంది. సంతానం కలగలేదనే మనస్తాపంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కవి, హేమలత అనే దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల క్రితం వీరికి పాప పుట్టి చనిపోయింది. అప్పటినుంచి సంతానం కోసం కవి, హేమలత మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దలు వీరికి రాజీ కుదిర్చారు. అయితే సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.