బెజవాడ సాక్షిగా రైతులను బాబు బెదిరించారు | congress leader malladi vishnu takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

బెజవాడ సాక్షిగా రైతులను బాబు బెదిరించారు

Oct 3 2014 8:50 AM | Updated on Oct 1 2018 2:03 PM

బెజవాడ సాక్షిగా రైతులను బాబు బెదిరించారు - Sakshi

బెజవాడ సాక్షిగా రైతులను బాబు బెదిరించారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూ సేకరణ విషయంలో రైతులను సీఎం చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూ సేకరణ విషయంలో రైతులను సీఎం చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఆయన శుక్రవారం సాక్షి హెడ్లైన్ షోలో మాట్లాడుతూ విజయవాడ సాక్షిగా రైతులను బాబు బెదిరించారన్నారు.

 

బెదిరింపులు, భయపెట్టే ధోరణిలో చంద్రబాబు మాట్లాడారని మల్లాది విష్ణు అన్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు స్పందిస్తూ రైతులను వేధించి భూసేకరణ చేయమన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడ పరిసరాల్లో భూసేకరణ తలనొప్పి వ్యవహారమేనన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement