నేతల్లో చీలిక | Collector differing views on Target | Sakshi
Sakshi News home page

నేతల్లో చీలిక

Jan 22 2016 1:04 AM | Updated on Mar 21 2019 7:27 PM

జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌ను టార్గెట్ చేసే విషయంలో టీడీపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలొచ్చాయి. నేతల మధ్య దాదాపు చీలిక వచ్చేసింది.

 కలెక్టర్‌ను టార్గెట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు
  రహస్య సమావేశానికి దూరమైన కొందరు నేతలు
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌ను టార్గెట్ చేసే విషయంలో టీడీపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలొచ్చాయి. నేతల మధ్య దాదాపు చీలిక వచ్చేసింది. అనుకూలంగా పనిచేసినప్పుడు మంచిగా, సానుకూలంగా ఉండనప్పుడు చెడుగా చూడటం సరికాదనే అభిప్రాయానికి కొందరు వచ్చారు. దీంతో కలెక్టర్ లక్ష్యంగా నిర్వహించిన రహస్య సమావేశానికి పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు దూరమయ్యారు.  జిల్లా కీలక నేతొకరు ఈ గ్రూపునకు నాయకత్వం వహించినట్టు తెలిసింది.
 
 ఇది మామూలే
 అధికారులపై రోడ్డెక్కడంం, టార్గెట్ చేసే విధం గా పావులు కదపడం,ఆ తర్వాత  దారికి తెచ్చుకోవడం షరా మామూలే అన్న అభిప్రాయంతో టీడీపీకి చెందిన కొందరు నేతలు ఉన్నారు. ఇదే రకంగా గత పంచాయతీ కార్యదర్శుల బదిలీ లు, అంగన్‌వాడీ నియామకాల సమయంలో వ్యవహరించారని చివరికొచ్చేసరికి అనుకున్నట్టుగా పనిచేయించుకున్నారని బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల బదిలీల సమయంలో కూడా కొందరు నేతలు తమకు అనుకూలంగా వ్యవహరించలేదని రచ్చకెక్కారు. ఒక అధికారి  కార్యాలయానికి, ఇంటికి వెళ్లి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి తమ పనులు కానిచ్చేసుకున్నారు. అంగన్‌వాడీ నియామకాల్లోనూ ఇదే జరిగింది. షిప్ట్ ఆపరేటర్ల పోస్టుల సిఫార్సులను పట్టించుకోలేదని, పోస్టుల నియామకాల్లో కనీసం విలువ ఇవ్వడం లేదని కొంద రు నేతలు విమర్శలకు దిగారు. ఏకంగా మంత్రి వద్దకెళ్లి మొరపెట్టుకున్నారు. ఈ క్రమంలో అంగన్‌వాడీ నియామకాలకు ఒక్క రోజు ముందు సీన్ తారుమారైంది. ఎమ్మెల్యేలు తమ లెటర్ హెడ్‌పై ఇచ్చిన పేర్లనే ఖరారు చేశారు.
 
 వ్యతిరేకించిన సగం మంది నేతలు
 రహస్య సమావేశానికి హాజరు కావాలని జిల్లాలోని టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలందరికీ సమాచారం వెళ్లింది. కానీ, 50మందికి పైగా ఉన్న వారిలో హాజరైన వారు 25లోపే ఉన్నారు. దీనికంతటికీ కొందరు నేతల ద్వంద్వ నీతే కారణమని, వారి కోసం మనమెందుకు చెడ్డ అయిపోవాలనే ఆలోచనకొచ్చినట్టు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement