ఈ నెల 21న రాయచోటికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రానున్న సందర్భంగా ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
రాయచోటిటౌన్, న్యూస్‌లైన్: ఈ నెల 21న రాయచోటికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రానున్న సందర్భంగా ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శాంతి భద్రలు, సభాప్రాంగణం నిర్మాణాలపై ఆదివారం జిల్లా ఎస్సీ జివివి అశోక్‌కుమార్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో చదును చేస్తున్న పనులను చూశారు. గ్రౌండ్ వెనుకభాగాన ఇప్పటికే నిర్మించిన హెలీప్యాడ్ తో పాటు మదనపల్లె రోడ్డులోని రాజు స్కూల్ సమీపంలో చేపట్టిన పనులను కూడా పర్యవేక్షించారు.
నేరగాళ్లు, దొంగలపై రౌడీషీట్
స్థానిక పోలీస్‌స్టేషన్లో డీఎస్పీ హరినాధబాబు, అర్బన్ సీఐ శ్రీరాములు, రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్, లక్కిరెడ్డిపల్లె సీఐ వినయ్ కుమార్‌రెడ్డిలతో పాటు ఎస్‌ఐలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. నేరగాళ్లపై, దొంగతనాలకు పాల్పడే వారిపై రౌడీషీట్ తెరవాలని చెప్పారు. ఇప్పటివరకు పలు నేరాలకు పాల్పపడిన వారి రికార్డులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతం నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కువగా ఉన్నారని వారి జాబితాను కూడా సిద్ధం చేయాలని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు.