జన్మభూమికి కొత్త పాటలు సిద్ధం! | CM Chandrababu Restarts Janmabhoomi Programme in AP at October 02 | Sakshi
Sakshi News home page

జన్మభూమికి కొత్త పాటలు సిద్ధం!

Sep 30 2014 8:44 AM | Updated on Aug 18 2018 6:18 PM

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమానికి మరోసారి శ్రీకారం చుట్టనుంది.

హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమానికి మరోసారి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమం కోసం సరికొత్తగా నాలుగు పాటలను టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. ఆ పాటలను ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరాం రచించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. గతంలో జన్మభూమి టైటిల్ సాంగ్ను వందేమాతం శ్రీనివాస్ అందించిన సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జన్మభూమి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున్న నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ మరోసారి అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'జన్మభూమి - మన ఊరు' పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. తమ సొంత గ్రామానికి, ప్రజలకు తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించిన ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement