ఇంద్రకీలాద్రిపై సీఐ నీలిచిత్రాల వీక్షణం | CI prasad caught watching porn film in vijayawada durga temlple | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై సీఐ నీలిచిత్రాల వీక్షణం

Oct 1 2014 10:01 AM | Updated on Oct 9 2018 6:34 PM

ఇంద్రకీలాద్రిపై సీఐ నీలిచిత్రాల వీక్షణం - Sakshi

ఇంద్రకీలాద్రిపై సీఐ నీలిచిత్రాల వీక్షణం

ప్రముఖ పుణ్యక్షేత్రం బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఓ సీఐ నిర్వాకం విమర్శలకు దారి తీసింది.

విజయవాడ : ప్రముఖ పుణ్యక్షేత్రం బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఓ సీఐ  అపచారానికి పాల్పడ్డాడు. దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్న సీఐ వర ప్రసాద్ సెల్ఫోన్లో బూతు చిత్రాలు చూస్తూ మీడియాకు దొరికిపోయాడు. ఓవైపు భక్తులు క్యూ లైన్లలోఅమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తుంటే...మరోవైపు సీఐ మాత్రం విధులు పక్కనపెట్టి దర్జాగా కుర్చీలో కూర్చొని బూతు పురాణాన్ని వీక్షించటం గమనార్హం. 

పక్క జిల్లా నుంచి డిప్యూటేషన్ మీద దేవీ నవరాత్రులు సందర్భంగా బందోబస్తు నిమిత్తం అతడు దుర్గగుడికి వచ్చాడు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన సీఐపై విమర్శలు వెల్లువెత్తాయి. సీఐపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారులు కూడా ఈ ఘటనను సీరియస్ గా పరిగణిస్తున్నారు. సీఐపై చర్య తీసుకోవాలని పోలీసులను కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై విజయవాడ సీపీ సమగ్ర విచారణకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement