
కలకడ : లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్న 55 మంది కూలీలు, ఇద్దరు లారీ డ్రైవర్లను కలకడ తహసీల్దార్ చిన్నయ్య, ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. కలకడ సమీపంలోని జిల్లా సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టా రు. తమిళనాడు తిరువూరు నుంచి వస్తున్న లారీని పరిశీలించారు. అందులో 55 మంది కూలీలు ఉన్నట్టు గుర్తించారు. లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్లు నారాయణ్‌సింగ్‌యాదవ్, ఉమేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి ని స్థానిక ఆదర్శ పాఠశాలకు తరలించారు.