బీసీలకు వెన్నుదన్నుగా సీఎం వైఎస్ జగన్ | Chelluboina Venu Gopala Krishna Says Thanks To CM YS Jagan Over BC Ministry - Sakshi
Sakshi News home page

‘బీసీలకు వెన్నుదన్నుగా సీఎం జగన్’

Jul 23 2020 12:34 PM | Updated on Jul 23 2020 7:07 PM

Chelluboina Venu Gopala Krishna Says Thanks To CM YS Jagan Over BC Ministry - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖను తనకు ఇవ్వటం ఎంతో సంతోషం ఉందని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు బీసీలందరికీ సేవ చేసే అవకాశం దక్కిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని ప్రాధాన్యత బీసీలకు సీఎం జగన్ ఇస్తున్నారని గుర్తుచేశారు. బీసీలకు ఏడాదిలోనే రూ. 22 వేల కోట్ల సంక్షేమ పధకాలిచ్చారని తెలిపారు. బీసీలకు రాజకీయ గుర్తింపునిచ్చింది సీఎం జగన్ ఒక్కరే అన్నారు. (మంత్రులుగా చెల్లుబోయిన, సీదిరి)

త్వరలో 52 కార్పొరేషన్లతో బీసీలకు గొప్ప మేలు జరగబోతోందని మంత్రి పేర్కొన్నారు. బీసీలకు నామినేటెడ్ పదవుల్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. బీసీలకు సీఎం జగన్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారని తెలిపారు. బీసీలను చంద్రబాబు మోసం చేస్తే సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జనాభాకు తగ్గట్టుగా బీసీలకు పధకాలు ఇస్తున్న ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. ఇక బుధవారం శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బీసీ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement