‘ఎమ్మెల్యేగా గెలిపించండి’

Chantibabu Requested Voters To Support In Mla Elections - Sakshi

జనసంద్రంగా మారిన జగ్గంపేట  

సాక్షి, జగ్గంపేట: ‘‘ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించండి మీ రుణం తీర్చుకుంటాను’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు అన్నారు. జగ్గంపేటలో మంగళవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. రావులమ్మతల్లి గుడి వద్ద భార్య వేణితో కలిసి పూజలు అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పాదయాత్రకు వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం వేలాది మందిని ఉద్దేశించి చంటిబాబు మాట్లాడారు. ‘‘రెండు సార్లు పోటీ చేశాను.. మరోసారి మీ ముందుకు వస్తున్నాను. నన్ను గెలిపించండి’’ అని కోరారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రానుందని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తామన్నారు.

చంటిబాబుతో పాటు కాకినాడ పార్లమెంట్‌ అభ్యర్థిని వంగా గీతా పాల్గొని ప్రసంగించారు. అత్తులూరి నాగబాబు, బండారు రాజా, ఒమ్మి రఘురామ్, బుర్రి చక్రబాబు, వరుపుల రంగనాయకులు, మండపాక చిన్న, రాయి సాయి, పెద్దాడ రాజబాబు, రావుల రాజా, ఎంపీటీసీ అబ్బు, బూసాల బాబూరావు, సర్వసిద్ధి లక్ష్మణ్, ఇళ్ల అప్పారావు, తులా రాము, చిట్టిమాని సత్యనారాయణ, గండపల్లి మండలానికి చెందిన చలగళ్ల దొరబాబు, ఒబిణ్ణి సత్యనారాయణ, రామకృష్ణ, ఉప్పలపాటి సాయి, అడబాల ఆంజనేయులు, రామకుర్తి మూర్తి, పరిమి వెంకటేశ్వరరావు, పాపారావు చౌదరి, గోకవరం మండలానికి చెందిన సుంకర రమణ, సూరారెడ్డి, వరసాల ప్రసాద్, జనపరెడ్డి సుబ్బారావు, దాసరి రమేష్, సతీష్, రఫీ, అల్లు విజయ్‌కుమార్, తోట రవి, అయ్యన్న, పలికల గంగరాజు, చదలాడ బాబీ, దోమాల గంగాధర్, సూది శ్రీను, పాఠంశెట్టి విశ్వనాథం, గోపి, పాల్గొన్నారు.

చంటిబాబు నామినేషన్‌కు తరలివెళ్లిన కార్యకర్తలు
కిర్లంపూడి: వైఎస్సార్‌ సీపీ జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు నామినేషన్‌ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి జగ్గంపేటకు భారీగా తరలివెళ్లారు. పలు గ్రామాల నుంచి వైఎస్సార్‌ సీపీ నాయకుల ఆధ్వర్యంలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీగా జగ్గంపేట వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల చంటిబాబును అఖండ మెజార్టీతో గెలిపించడమే తమ లక్ష్యమన్నారు. కిర్లంపూడి, ముక్కొలు, గోనేడ, బూరుగుపూడి, గెద్దనాపల్లి, సింహాద్రిపురం, వీరవరం, తామరాడ, తదితర గ్రామాల నుంచి తరలివెళ్లి జ్యోతుల నామినేషన్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో చదలవాడ బాబి, అల్లు విజయకుమార్, విశ్వనాథం చక్రరరావు, దోమాల గంగాధర్, వెంకటజాన్‌బాబు, పెనగంటి రాజేష్, ఎం రాంబాబు, వి.సాంబశివ, డి అప్పలరాజు, ఎస్‌.శివకుమార్, ఎ.గంగబాబు, బి వెంకటరమణ, పి శ్రీను, వై పాము, మల్లేష్, పి రాజుగోపాల్, సూరిబాబు, గోపి, తదితరులు పాల్గొన్నారు. 
చంటిబాబు నామినేషన్‌కు తరలిన జనసందోహం 

గండేపల్లి: జ్యోతుల చంటిబాబు నామినేషన్‌ కార్యక్రమం మంగళవారం నిర్వహించడంతో గండేపల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి జగ్గంపేటకు భారీగా తరలివెళ్లారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలపై భారీగా జగ్గంపేట చేరుకున్నారు. దీంతో జాతీయ రహదారి జనసందోహంగా మారింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top