వైశ్యులందరూ మోసానికి గురైయ్యారు | Chandra babu Cheets All Vysya Comunity Kuppam Prasad | Sakshi
Sakshi News home page

వైశ్యులందరూ మోసానికి గురైయ్యారు

Nov 20 2018 3:13 PM | Updated on Nov 20 2018 9:28 PM

Chandra babu Cheets All Vysya Comunity Kuppam Prasad - Sakshi

సాక్షి, కడప: రాష్ట్రంలో ఉన్న వైశ్యులందరినీ సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ వైశ్యులకు కార్పొరేషన్‌ను ఎర్పాటు చేస్తానని ప్రకటించినప్పుడు ఓట్ల కోసం చంద్రబాబునాయుడు వైశ్యులకు ఎన్నో హామీలను ఇచ్చారని కానీ ఎన్నికలు పూర్తియ్యాక వాటిని మర్చిపోయారని విమర్శించారు.

రాష్ట్రంలో ఉన్న వైశ్యులందరిని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రన్న మాల్స్‌ పేరుతో చిన్న వ్యాపారుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. దివంగతనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే వైశ్యులకు మేలు చేశారని అన్నారు. దివంగత నేత హాయాంలోనే నెల్లూరు జిల్లాకు అమరజీవి పొట్టిశ్రీరాములు పేరు పెట్టారని గుర్తు చేశారు. వైశ్యులకు మంచి జరగాలంటే వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రావాలని కుప్పం ప్రసాద్‌ ఆకాంక్షించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement