చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు.
మదనపల్లె : చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మంగళవారం ఉదయం రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లారు. వివరాలు... ఎస్‌బీఐ కాలనీకి చెందిన కవిత(25) ఉదయం దుకాణం తెరిచేందుకు ఇంటి నుంచి వెళుతుండగా పల్సర్ బైక్‌లో వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను అడ్డగించి మెడలోఉన్న 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.