12న కేంద్ర కార్యాలయాల దిగ్బంధనం: చంద్రశేఖర్‌రెడ్డి


వైఎస్ఆర్‌ జిల్లా: రాష్ట్ర విభజనపై నిరసనగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై తమ నిర్ణయాన్ని సీడబ్య్లూసీ సమావేశంలో తీర్మానం చేసినా నాటినుంచి దాదాపు 10రోజులుగా సమైక్యంధ్ర రగలిపోతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్‌ జిల్లాలో సమైక్య జేవేసీ సమావేశమైంది. ఈ సమావేశంలో తమ ఉద్యమ కార్యాచరణపై నిర్ణయాన్ని ప్రకటించినట్టు జేఏసీ నాయకులు గౌరవ అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.


 


కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన కేంద్ర కార్యాలయాల దిగ్బంధనం చేయనున్నట్టు చెప్పారు. 16వ తేదీన నియోజకవర్గాల కేంద్రాల్లో రహదారుల దిగ్బంధం చేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా 18న కూడా కడప, రాజంపేటలలో రైల్‌రోకో, జైలు భరో వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో  అందరూ  పాల్గొని జయప్రదం చేయాలని సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top