అనంతపురంలో ఐదు ప్రైవేట్ బస్సులపై కేసు | Case filed against 5 private buses in Anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో ఐదు ప్రైవేట్ బస్సులపై కేసు

Oct 31 2013 9:46 AM | Updated on Jun 1 2018 8:39 PM

మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద దుర్ఘటన అనంతరం ప్రభుత్వం కళ్లు తెరిచింది.

మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద దుర్ఘటన అనంతరం ప్రభుత్వం కళ్లు తెరిచింది. ఆర్టీఏ అధికారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులపై సోదాలు నిర్వహిస్తున్నారు.

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ బస్సుల లైసెన్స్లను అధికారులు పరిశీలించారు. రికార్డులు సరిగా లేని ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, విజయవాడ శివార్లలోనూ తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిలో మూడు బస్సులను అధికారులు సీజ్ చేశారు. విజయవాడలో పర్మిట్లు లేని పలు ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులను జప్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement