ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
హైదరాబాద్ : ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్కు ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు వ్యయానికి సంబంధించి బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పిస్తారు. సమావేశాల కోసం రాష్ట్ర అసెంబ్లీ నేడు సమావేశం కానుంది. బడ్జెట్ సమర్పణ ముగియగానే బుధవారం నాటికి అసెంబ్లీని వాయిదా వేస్తారు.
బడ్జెట్‌పై అధ్యయనం చేయడానికి మంగళవారం నాడు సభకు సెలవు ప్రక్రించారు. తిరిగి అసెంబ్లీ బుధవారం సమావేశమవుతుంది. 13వ తేదీతో సమావేశాలు ముగుస్తున్నాయి. ఆతర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. ఉదయం పదిన్నర గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మరోవైపు సీఎం కిరణ్ వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రాంత మంత్రులు కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా వారు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించనున్నారు.