వారు అసమర్థులా.. వీరు సమర్థులా | bv raghavulu fires on cm chandrababu | Sakshi
Sakshi News home page

వారు అసమర్థులా.. వీరు సమర్థులా

Apr 2 2017 11:43 AM | Updated on Jul 28 2018 3:39 PM

వారు అసమర్థులా.. వీరు సమర్థులా - Sakshi

వారు అసమర్థులా.. వీరు సమర్థులా

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణపై సీపీఎం నేత బీవీ రాఘవులు స్పందించారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణపై సీపీఎం నేత బీవీ రాఘవులు స్పందించారు. లోకేష్‌ కోసమే మంత్రి వర్గ విస్తరణ చేపట్టారని ఆయన విమర్శించారు.

'మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మంత్రి పదవి పోయిన వారు అసమర్థులా.. లేక కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారు సమర్థులా' అని రాఘవులు ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు అన్యాయం అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చేసింది న్యాయమా అని రాఘువులు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు నేతలకు మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement