ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండలో శుక్రవారం సీపీఎం, సీపీఐ లు బంద్ నిర్వహించాయి.
అనంతపురం: ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండలో శుక్రవారం సీపీఎం, సీపీఐ లు బంద్ నిర్వహించాయి. ఈ మేరకు పట్టణంలో రాకపోకలన్నీ నిలిపి పోయాయి. ఉరవకొండలో కోదండరామిరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. నేడు అతడి మృతదేహాన్ని పోస్టు మార్టం పూర్తి చేశారు. కోదండ రామిరెడ్డి పేరిట ఉన్న రుణాలు మాఫీ చేసేందుకు బ్యాంకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు సిండికేట్ బ్యాంక్ మేనేజర్ శివశంకర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.