వరసకు సోదరి అయినా..! | Brother tries for sexual assault on sister | Sakshi
Sakshi News home page

వరసకు సోదరి అయినా..!

Jul 28 2014 2:24 PM | Updated on Nov 6 2018 4:10 PM

వరసకు సోదరి అయినా..! - Sakshi

వరసకు సోదరి అయినా..!

ఆమె వరసకు సోదరి. అయినా ఆ కామాంధునికి కనిపించలేదు. రెండురోజుల పాటు ఫోన్లో వేధించి, అక్కడితో ఆగకుండా లైంగిక దాడికి యత్నించాడు.

ఆమె వరసకు సోదరి. అయినా ఆ కామాంధునికి కనిపించలేదు. రెండురోజుల పాటు ఫోన్లో వేధించి, అక్కడితో ఆగకుండా లైంగిక దాడికి యత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి కేకలు వేయడంతో పలాయనం చిత్తగించాడు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నయ్యపేటకు గ్రామానికి చెందిన వివాహితను అదే గ్రామానికి చెందిన మజ్జి రమణ రెండు రోజుల నుంచి సెల్‌ఫోన్‌లో వేధిస్తున్నాడు. ఆమె ఫోన్ కట్ చేస్తున్నా మళ్లీ..మళ్లీ ఫోన్ చేస్తూ వేధించసాగాడు. విసిగిపోయిన ఆమె, తన ఫోన్లో అతని వాయిస్‌ను రికార్డుచేసి ఉంచింది. అనంతరం శనివారం రాత్రి 8 గంటల సమయంలో బాధితురాలు.. గ్రామంలోని యూపీ పాఠశాల వద్ద గల బోరు వద్దకు స్నానానికి వెళ్లింది. అప్పటికే అక్కడ వేచి ఉన్న రమణ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.
 
కానీ ఆమె కేకలు వేయడంతో సమీపంలో బాబాయి వరస అయ్యే పొట్నూరు లక్ష్మణ అక్కడకు వెళ్లాడు. రమణను పట్టుకుని గ్రామంలోని రచ్చబండ వద్దకు తీసుకొచ్చాడు. విషయం గ్రామస్తులకు తెలియడంతో లక్ష్మి వర్గీయులు, రమణ వర్గీయులు రచ్చబండ వద్ద ఘర్షణకు దిగారు. దీంతో బాధితురాలు విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. రమణకు రాజకీయ పలుకుబడి ఉందని, అతని నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితురాలు పోలీసులను వేడుకుంది.

వరసకు అన్నయ్య..
తనను వేధించిన రమణ తనకు అన్నయ్య అవుతాడని బాధితురాలు విలపిస్తోంది. అయినా ఇలా ఫోన్లో వేధించి దాడికి పాల్పడ్డాడంటూ వాపోయింది. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన కొందరు తనను కొట్టి గాయపరిచారంటూ మజ్జి రమణ పోలీసులకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు. గాయపడిన అతనిని పోలీసులు శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చారు. కేసు నమోదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement