గుప్తనిధుల కోసం.. బాలుడి దారుణహత్య | Boy murdered for treasures at nellore district | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం.. బాలుడి దారుణహత్య

Mar 29 2015 6:12 PM | Updated on Jul 12 2019 3:29 PM

మూఢ నమ్మకాల పేరిట ఓ పసిబాలుడు బలి అయ్యాడు.

నెల్లూరు: మూఢ నమ్మకాల పేరిట ఓ పసిబాలుడిని బలి చేశారు. ఈ ఘటన నెల్లూరు రూరల్ మండలం నరిసింహకొండలో ఆదివారం వెలుగుచూసింది. గుప్తనిధుల కోసం బాలుడిని దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే గుప్తనిధుల కోసమే బాలుడిని బలి ఇచ్చారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం బాలుడు అదృశ్యమైనట్టు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement