బిట్‌శాట్ నోటిఫికేషన్ జారీ | BITSAT notification announced | Sakshi
Sakshi News home page

బిట్‌శాట్ నోటిఫికేషన్ జారీ

Jan 10 2014 4:23 AM | Updated on Sep 2 2017 2:26 AM

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్ పిలానీ)లో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీలో చేరేందుకు బిట్‌శాట్-2014 నోటిఫికేషన్ జారీ అయింది

సాక్షి, హైదరాబాద్: బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్ పిలానీ)లో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీలో చేరేందుకు బిట్‌శాట్-2014 నోటిఫికేషన్ జారీ అయింది. బీఈ, బీ ఫార్మసీ, ఎమ్మెస్సీ (టెక్నాలజీ) కోర్సుల్లో చేరేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్ వీఎస్ రావు తెలిపారు.
 
 ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష మే 14 నుంచి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా 35 కేంద్రాల్లో ఉంటుందని.. రాష్ట్రంలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 15లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించారు. మొత్తం 2,100 సీట్ల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement