పద్మావతి వర్సిటీలో బయోమెట్రిక్ విధానం | biometric system in padmavati mahila visvavidyalayam | Sakshi
Sakshi News home page

పద్మావతి వర్సిటీలో బయోమెట్రిక్ విధానం

Aug 21 2015 9:35 AM | Updated on Sep 3 2017 7:52 AM

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానాన్ని వీసీ రత్నకుమారి గురువారం ప్రారంభించారు.

యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానాన్ని వీసీ రత్నకుమారి గురువారం ప్రారంభించారు. ర్యాగింగ్ కారణంగా నాగార్జున విశ్వవిద్యాలయంలో రుషితేశ్వరి ఆత్మహత్యతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు మహిళా వర్సిటీ అధికారులు ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేయడమేగాక విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఐడెంటిటీ కార్డులు మంజూరు చేశారు.

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు వసతి గృహంలోకి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు వేలిముద్రల ద్వారా హాజరు నమోదు చేసుకోవాలన్నారు. సర్వర్ రిమోట్ ద్వారా దీన్ని అనుసంధానం చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మి, వార్డెన్ పి.వాణి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement