అటవీ అధికారుల హత్య కేసులో...348 మందిని అరె స్ట్ చేశాం | babu garjana yanduku? | Sakshi
Sakshi News home page

అటవీ అధికారుల హత్య కేసులో...348 మందిని అరె స్ట్ చేశాం

Dec 27 2013 4:18 AM | Updated on Oct 4 2018 6:03 PM

తిరుమల అడవిలో ఈ నెల 15వ తేదీన ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో హత్యకు గురైన అటవీ అధికారుల కేసులో ఇప్పటి వరకు 348 మందిని అరెస్ట్ చేశామని...

=అధికారులను కొట్టి చంపిన 9 మందిని కూడా..
 =ఫారెస్ట్ సిబ్బందికి ఫైరింగ్‌లో శిక్షణ
 = ఒక్కో ఫారెస్ట్ డివిజన్‌కు ఒక ఏఅర్ ప్లాటున్
 =అర్బన్ ఎస్పీ ఎస్వీ.రాజశేఖరబాబు

 
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: తిరుమల అడవిలో ఈ నెల 15వ తేదీన ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో హత్యకు గురైన అటవీ అధికారుల కేసులో ఇప్పటి వరకు 348 మందిని అరెస్ట్ చేశామని అర్బన్ ఎస్పీ ఎస్వీ.రాజశేఖరబాబు తెలిపారు. అటవీ అధికారులను ఆయుధాలతో కొట్టి చంపిన మరో 9 మంది స్మగ్లర్లను కూడా అరె స్ట్ చేశామని చెప్పారు. గురువారం తన కార్యాలయంలో ఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిం చారు. అటవీ అధికారుల హత్యలు జరిగిన 24 గం టలలోపే నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టడంతోపాటు స్మగ్లిం గ్‌ను తుదముట్టించేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఫారెస్ట్ అధికారుల హత్యపై దర్యాప్తు ము మ్మరం చేశామని, ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటివరకు 348 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.
 
24 మంది స్మగ్లర్లు, 51 మంది మేస్త్రీలు..
 
24 మంది స్మగ్లర్లు, ఎర్రచందనం దుంగలను నరికే కూ లీలను సరఫరా చేసే 51 మంది మేస్త్రీల పేర్లను అర్బన్ ఎస్పీ విడుదల చేశారు. స్మగ్లర్లలో ఎక్కువమంది కర్ణాటకలోని కటిగ న హళ్లి, బెంగళూరు, హోస్‌కోట్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. కూలీలను సరఫరా చేసే మేస్త్రీలు తమిళనాడులోని తిరుణ్ణామలై, సేలం, వేలూ రు జిల్లాలకు చెందినవారున్నారు. మనరాష్ర్టంలోని వైఎస్‌ఆర్ జిల్లా రైల్వేకోడూరుకు చెందిన శీనప్ప(45), చిత్తూరు జిల్లా పలమనేరు నూనెపల్లెకు చెందిన నాగరాజు(42), అంబరుసుపల్లెకు చెందిన రెడ్డెప్ప ఉన్నా రు. వీరి సమాచారం తెలిస్తే వెంటనే అర్బన్ ఎస్పీ కా ర్యాలయానికి తెలియజేయాలని ఎస్పీ కోరారు.

అరెస్టై న వారిలో 19 మందిని పోలీస్ కస్టడికి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. చెన్నై ఓడరేవు నుంచి మలేషియా,  చైనా, సింగపూర్, దుబాయ్‌లకు ఎర్రచందనం రవాణా జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. విదేశాలకు ఎర్రచందనం ఎలా ఎగుమతి చేస్తున్నారనేదిశగా విచారణ చేపడుతున్నామని, అందుకోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని తెలిపారు. వేలూరు, తిరువణ్ణామలై ఎస్పీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఇప్పటికే స్మగ్లర్ ప్రభు అక్కడి పోలీసులకు సరెండర్ అయ్యాడన్నారు.
 
ఫారెస్ట్ సిబ్బందికి ఫైరింగ్‌లో శిక్షణ
 
250 మంది పారెస్ట్ అధికారులు, సిబ్బందికి నాలుగైదు రోజుల్లో ఫైరింగ్‌లో శిక్షణ ప్రారంభించనున్నామని ఎస్పీ తెలిపారు. ఒక్కో ఫారెస్ట్ డివిజన్‌కు 21 మందితో కూడిన ఒక ప్లాటున్ ఆర్ముడ్ రిజర్వును ఇచ్చామన్నారు. అలాగే ఒక ఏపీఎస్‌పీ ప్లాటున్‌ను అప్పగించామని తెలిపారు. చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లా పోలీసులు, ఫారెస్ట్ అధికారులతో సమన్వయం చేసుకుని నిరంతరం కూంబింగ్ చేస్తున్నామన్నారు. ఎర్రచందనం దుంగలను నరకడం తగ్గుముఖం పట్టిందన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్‌పోస్టులను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement