ఆటో,లారీ ఢీ.. ఒకరి దుర్మరణం | Auto lorry accident one person died | Sakshi
Sakshi News home page

ఆటో,లారీ ఢీ.. ఒకరి దుర్మరణం

Aug 31 2013 3:17 AM | Updated on Aug 21 2018 7:53 PM

ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం మండల కేంద్రం శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

 మేళ్లచెరువు, న్యూస్‌లైన్ : ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం మండల కేంద్రం శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మేళ్లచెరువు నుంచి ఐదుగురి ప్రయాణికులతో ఓ ఆటో హుజూర్‌నగర్ వైపు బయలు దేరింది. గ్రామశివారులోకి వెళ్లగానే మేళ్లచెరువు వైపు వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ, ఆటో ఢీ కొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇట్టిమళ్ల శ్రీను (30)కి తీవ్ర గాయాలు కాగా, వి.వెంకటయ్య, ఆర్.వన మ్మ, నేరెళ్ల హుస్సేన్, శ్రీనుబాబు, ఆటో డ్రైవర్ ఒగ్గు విశాఖకు గాయాలయ్యాయి.
 
 స్థానికులు 108, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి క్షతగాత్రులను 108 వాహనంలో హుజూర్‌నగర్ వైద్యశాలకు తరలించారు. వీరిలో తీవ్ర గాయాలపాలైన ఇట్టిమళ్ల శ్రీను మార్గమధ్యలో మృతి చెందాడు. మండలంలోని రామాపురానికి చెందిన ఇతడికి భార్య తులశమ్మ ఉన్నది. కాగా గాయపడిన వారికి  హుజూర్‌నగర్ వైద్య శాలలో చికిత్స నిర్వహిస్తున్నారు. మృతుడి బంధువు పాశం రాములు ఫిర్యాదు మేరకు లారీడ్రైవర్‌పై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సక్రాం తెలిపారు
 

Advertisement
 
Advertisement
Advertisement