
టీడీపీ నేతలు నిమ్మల రామానాయుడు, నక్కా ఆనందబాబు, పంచుమర్తి అనురాధలకు లీగల్ నోటీసులు పంపింది.
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అందుకు తమ కంపెనీకి దురుద్దేశాలు అంటగడుతూ చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలను ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా లిమిటెడ్ డిమాండ్ చేసింది. తమపై చేసిన నిందారోపణలు దురుద్దేశపూరితమని, ఇవి తమ కంపెనీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నందున క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆ సంస్థ స్పష్టంచేసింది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, పంచుమర్తి అనురాధలకు లీగల్ నోటీసులు పంపింది. (చదవండి: మిమ్మల్ని ఫినిష్ చేసే రోజు వస్తుంది)