కానిస్టేబుల్‌పై దాడి; కఠిన చర్యలు తప్పవు

Attack On Constable In Guntur Strict Action To Be Taken Says SP - Sakshi

సాక్షి, గుంటూరు: ధర్నాలు, రాస్తారోకోలు జరిగే సమయంలో సాధారణంగా డ్రోన్లతో విజువల్స్ తీస్తామని  గుంటూరు రూరల్‌ ఎస్పీ విజయారావు తెలిపారు. రెండు రోజుల క్రితం మందడంలో కూడా అలానే విజువల్స్ తీయించామని పేర్కొన్నారు. కానీ, డ్రోన్‌ ఆపరేట్‌ చేస్తున్న స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌పై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని చెప్పారు. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

(చదవండి : మాపై తప్పుడు ప్రచారం చేస్తూ వార్తలు రాస్తున్నారు: డీఎస్పీ)

డ్రోన్ ఆపరేటర్ పై దాడి, ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న ఘటన, తుళ్లూరు డీఎస్పీపై దురుసుగా వ్యవహరించిన ఘటనల్లో కేసులు నమోదు చేశామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు చాలా సహనం పాటిస్తున్నారని ఎస్పీ విజయారావు ‍చెప్పారు. కొంతమంది అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని, ప్రజలను రెచ్చగొట్టే వారిని గుర్తించామని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మీడియా కూడా తప్పుడు వార్తలు రాస్తోందని విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top