ఏటీఎం గార్డే.. దొంగ.. | Sakshi
Sakshi News home page

ఏటీఎం గార్డే.. దొంగ..

Published Tue, Feb 16 2016 3:23 PM

ATM Guard Become Thief

వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఎస్‌బీఐ ఏటీఎం దగ్గర బంగారు నగల చోరీకి పాల్పడింది... అక్కడ విధులు నిర్వహిస్తున్న గార్డేనని తేలింది. ఎస్‌బీఐ స్థానిక శాఖ వద్ద గార్డ్‌గా పనిచేస్తున్న శ్రీరాములు సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బ్యాంకు ఏటీఎం దగ్గరకు వెళ్లాడు.

వాహనాన్ని నిలిపి లోపలికి వెళ్లి నగదు డ్రా చేసుకుని వచ్చాడు. ఏటీఎం బయట గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథ్... ద్విచక్ర వాహనంలో ఉంచిన 30 తులాల బంగారు ఆభరణాల బ్యాగును కొట్టేశాడు. నగల బ్యాగు కనిపించకపోవడంతో కంగారుపడ్డ శ్రీరాములు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడింది సెక్యూరిటీ గార్డ్ విశ్వనాథ్‌గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement