ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని ప్రకాశం జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అన్నారు.
ప్రకాశం: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని ప్రకాశం జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అన్నారు. శనివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. జూలై 3న జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రకాశం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈనెల 30న ఓటర్లకు పోలింగ్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వికలాంగులు, నిరక్షరాస్యులు తమ వెంట సహాయకులను తెచ్చుకునే వెసులుబాటు కల్పించామని.. అందుకోసం ముందుగా ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలని ఆమె చెప్పారు.
జిల్లాలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలి పెట్టబోమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. క్యాంపు రాజకీయాలు చేయటం ఎన్నికల చట్టప్రకారం నేరమని.. క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీకాంత్ రాజకీయ పార్టీలను హెచ్చరించారు.