ఏ బస్సు ఎక్కడుందో... ఎవరికెరుక! | APSRTC Live Track App Not Wrking Properly | Sakshi
Sakshi News home page

ఏ బస్సు ఎక్కడుందో... ఎవరికెరుక!

Dec 25 2019 1:18 PM | Updated on Dec 25 2019 1:18 PM

APSRTC Live Track App Not Wrking Properly - Sakshi

ఆర్టీసీ బస్సు లైవ్‌ట్రాక్‌ సర్వర్‌ పనిచేయని వైనం

ఉలవపాడు: కాలం మారింది.. ఇప్పుడు ప్రపంచం అంతా సెల్‌ఫోన్‌తోనే అంతా నడుస్తోంది. ఇలాంటి కాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసిన లైవ్‌ట్రాక్‌ అప్లికేషన్‌ ఏర్పాటు చేసింది. ఈ అప్లికేషన్‌ను అందరూ తప్పకుండా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. ప్రతి బస్‌స్టేషన్‌లో ఆర్టీసీకి సంబంధించిన వలంటీర్లు కూర్చునిఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉన్న వారందరితో ఈ అప్లికేషన్‌ డౌన్‌ లోడ్‌ చేయించి పేర్లు, నంబర్లు రాసుకుని మరీ వెళ్లారు. ఇలా ఎక్కువ మందికి కి ఈ యాప్‌ను ఎక్కించి ఉపయోగంలోనికి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రయాణికులు అందరూ ఏ బస్సు ఎక్కడ ఉందో అని తెలుసుకోవడానికి ఈ అప్లికేషన్‌పైనే ఆధార పడుతున్నారు. తమ బస్సు ఎక్కడ ఉందో పరిశీలించుకుని ఆ సమయానికి బయలు దేరేవారు. తీరా అందరూ బాగా అలవాటయ్యాక ఈ యాప్‌ పనిచేయకుండా మొరాయిస్తోంది. గత 20 రోజులుగా అప్లికేషన్‌ ఓపెన్‌ చేయగానే సర్వీస్‌ తాత్కాలికంగా పని చేయడం లేదు. అసౌకర్యానికి చింతిస్తున్నాం అనే సందేశమే కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ప్రయాణికులకు ఏ బస్సు ఎక్కడ ఉందో అర్థం కాక ప్రయాణాల సమయంలో అవస్థలు పడుతున్నారు.

అప్‌డేట్‌ చేస్తే అసలుకే ఎసరొచ్చింది..
లైవ్‌ ట్రాక్‌ అప్లికేషన్‌ ద్వారా దగ్గర లో ఉన్న బస్‌స్టాప్‌ వివరాలు, బస్‌ నంబరుతో ఎక్కడ ఉందో తెలుసుకునే విధానం, రిజర్వేషన్‌ నంబరుతో బస్సు ఎక్కడ ఉందో చూసే విధానం, రెండు గ్రామాల మధ్య నడిచే సర్వీసులు వాటి సమయం తదితర వివరాలు లభించేవి. ఇవి కాక ఫిర్యాదులకు సంబం«ధించి నంబర్లు ఉండేవి. గత నెలలో ఈ యాప్‌ను అప్‌డేట్‌ చేయాలి అని వచ్చింది. పాత యాప్‌ ఓపెన్‌ చేసే అప్‌డేట్‌ అని వచ్చింది. అప్‌డేట్‌ అయిన తరువాత అసలే పని చేయకుండా పోయింది. గత 20 రోజులుగా ఈ యాప్‌ ద్వారా సేవలు లభించడం లేదు.

ప్రయాణికుల ఇబ్బందులు..
ఈ అప్లికేషన్‌ పనిచేయని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్‌లో పైన సర్వర్‌ పని చేయడం లేదు అని చూపడం, బస్సు నంబర్‌ ఎంటర్‌ చేస్తే.. తప్పులు తడకగా వివరాలు చూపడం సర్వసాధారణంగా మారింది. రెండు గ్రామాల మధ్య సర్వీసు అసలు పని చేయడం లేదు. రిజర్వేషన్‌ ఆధారిత విచారణ కూడా పని చేయడం లేదు. కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేసిన సమయంలో సర్వర్‌ పనిచేయడం లేదు. బాగు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎప్పటిలోపు యాప్‌ అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ సమస్యను త్వరిత గతిన పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement