పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది.
హైదరాబాద్: పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది. 11 టీఎంసీల నీటి నిల్వను 7 టీఎంసీలకు తగ్గించేందుకు అంగీకరించింది. నీటి నిల్వ కారణంగా నల్లగొండ జిల్లాలో ముంపునకు గురవుతున్న నాలుగు గ్రామాలకు రూ. 20 కోట్ల బకాయిలు చెల్లించేందుకు కూడా ఒప్పుకుంది.
ఈ నిధులను నల్లగొండ జిల్లా కలెక్టర్ కు ఇచ్చి బాధితులను ఆదుకునేందుకు రెండు ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన ఒప్పందాల మేరకు పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వను తగ్గించాలని రెండు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కారు లేఖ రాసిన సంగతి తెలిసిందే.