 
													సాక్షి, విజయవాడ: గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ సత్వరం స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీని ఆయన బుధవారం ఆదేశించారు. మరోవైపు జిల్లా ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అలాగే డీజీపీ ఆదేశాలతో గుంటూరు ఐజీ.... మాచర్లకు బయల్దేరారు.
ఎవరు దాడి చేశారో తెలియదు...
కాగా మాచర్ల ఘటనలో ఎవరు దాడి చేశారో తెలియదని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. ఎవరు...ఎవరిపై దాడి చేశారో విచారణలో తెలుస‍్తుందన్నారు. మాచర్లలో ప్రజలను రెచ్చగొట్టేందుకే బోండా ఉమ, బుద్ధా వెంకన్న అక్కడకు వెళ్లారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఏదో ఒక అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో టీడీపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
