కొలువుదీరిన కొత్త మంత్రివర్గం

AP Cabinet Ministers List 2019 LIVE Updates - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రిమండలి కొలువుదీరింది. మంత్రులుగా ఎన్నికైన 25మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ నరసింహన్‌ శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సచివాలయంలో సీఎం చాంబర్‌ పక్కన ఉన్న కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. మంత్రుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం కోసం.. ఇక్కడ సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేశారు. మంత్రులతో గవర్నర్‌ పదవీ స్వీకార ప్రమాణం ఈవిధంగా ఉంది..

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్‌ (పోలినాటి వెలమ-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ధర్మాన కృష్ణదాస్‌ అనే నేను అంటూ.. తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. బొత్స సత్యనారాయణ అనే నేను అంటూ.. తెలుగుభాషలో ఆయన దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

విజయనగరం జిల్లాకు చెందిన పాముల పుష్పశ్రీవాణి (ఎస్టీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పాముల పుష్పశ్రీవాణి అనే నేను అంటూ.. తెలుగుభాషలో ఆమె దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

విశాఖపట్నం జిల్లాకు చెందిన ముత్యంశెట్టి శ్రీనివాసరావు (కాపు) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ముత్యంశెట్టి శ్రీనివాసరావు.. అవంతి శ్రీనివాస్‌ అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కురసాల కన్నబాబు (కాపు) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కురసాల కన్నబాబు అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ (శెట్టిబలిజ-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. సుభాష్‌ చంద్రబోస్‌ పిల్లి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పినిపె విశ్వరూప్‌ (ఎస్సీ-మాల)  మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. విశ్వరూప్‌ పినిపె అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (కాపు) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కాళీకృష్ణ శ్రీనివాస్‌ ఆళ్ల అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు (క్షత్రియ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. 

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తానేటి వనిత (ఎస్సీ-మాదిగ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.  వనిత తానేటి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు.

కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి శ్రీ వెంకటేశ్వర్‌రావు (కమ్మ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కొడాలి శ్రీ వెంకటేశ్వర్‌రావు నాని అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

కృష్ణా జిల్లాకు చెందిన  పేర్ని నాని (కాపు) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పేర్ని వెంకటరామయ్య నాని అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

కృష్ణా జిల్లాకు చెందిన వెలంపల్లి శ్రీనివాస్‌ (వైశ్య) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.  వెల్లంపల్లి శ్రీనివాస్‌ అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

గుంటూరు జిల్లాకు చెందిన మేకతోటి సుచరిత (ఎస్సీ-మాల)  మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. మేకతోటి సుచరిత అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు.

గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణారావు (మత్స్యకారుడు-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. మోపిదేవి వెంకటరమణారావు అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి (రెడ్డి) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌ (ఎస్సీ-మాదిగ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్‌ అనే నేను అంటూ ఆంగ్లభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

పీఎస్సార్‌ నెల్లూరు జిల్లాకు చెందిన పాలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ (యాదవ-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాలుబోయిన అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

పీఎస్సార్‌ నెల్లూరు జిల్లాకు మేకపాటి గౌతమ్‌రెడ్డి (రెడ్డి) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి అనే నేను అంటూ ఆంగ్లభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రెడ్డి) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

చిత్తూరు జిల్లాకు చెందిన కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ-మాల) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కళత్తూరు నారాయణస్వామి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

కర్నూలు జిల్లాకు చెందిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (రెడ్డి) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.  బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరామ్‌ (బోయ-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. గుమ్మనూరు జయరామ్‌ అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

వైఎస్సార్‌ జిల్లాకు చెందిన షేక్‌ బేపారి అంజాద్‌ బాషా (ముస్లిం-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఎస్‌బీ అంజాద్‌ అనే నేను అంటూ తెలుగుభాషలో అల్లాసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

అనంతపురం జిల్లాకు చెందిన మాలగుండ్ల శంకరనారాయణ (కురుబ-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. మాలగుండ్ల శంకరనారాయణ అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

మంత్రుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం.. జాతీయగీతాలాపనతో ముగిసింది. అనంతరం కొత్త మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. అంతకుముందు పదవీ స్వీకార ప్రమాణం చేసిన వెంటనే మంత్రులు వరుసగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, గవర్నర్‌ నరసింహన్‌ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. 

ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్‌ నరసింహన్‌, సీఎం జగన్‌
సచివాలయంలో సీఎం చాంబర్‌ పక్కన ఉన్న కాన్ఫరెన్స్‌ హాల్‌లో పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రాంగణానికి సీఎం జగన్‌, గవర్నర్‌ నరసింహన్‌ చేరుకున్నారు. మంత్రుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం కోసం.. ఇక్కడ సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేశారు. 


ప్రొటెం స్పీకర్‌గా శంబంగి ప్రమాణ స్వీకారం..
ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు చేత గవర్నర్‌ నరసింహన్‌ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్‌ హాల్లో ఉదయం 11.15 గంటలకు శంబంగి ప్రోటెం స్పీకర్‌గా ప్రమాణం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు. మరికాసేపట్లో 25మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా గవర్నర్‌ పదవీ స్వీకార ప్రమాణం చేయించనున్నారు. 

మన పాలన దేశానికి ఆదర్శం కావాలి: సీఎం జగన్‌
సచివాలయంలో ఉదయం 10 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు అన్ని శాఖల ముఖ్య అధికారులు, ప్రిన్స్‌పల్‌ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారని, మీరు (అధికారులు) పూర్తిగా సహకరిస్తే ప్రజల- ప్రభుత్వ కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. అధికారులపై తనకు పూర్తి విశ్వాసముందని తెలిపారు. తమ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించడానికి తాను దృఢసంకల్పంతో ఉన్నట్టు స్పష్టం చేశారు. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వానికి నిధులు ఆదా చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు తమకు ఉన్న పూర్తి అవగాహనతో సహకరించాలని కోరారు. అనవసర వ్యయాన్ని తగ్గించాలన్నారు. మంచి పనితీరు ప్రదర్శించే అధికారులను సన్మాన సత్కారాలతో గౌరవిస్తానని తెలిపారు. మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ‘రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసినప్పుడు స్పష్టంగా ఇదే విషయం చెప్పాను. ప్రభుత్వం చేసే పనులను మీ ముందు పెడతాం. జ్యూడిషియల్‌ కమిషన్ ఏర్పాటుచేసి.. మీరు న్యాయమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరాను. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.  ‘రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసినప్పుడు స్పష్టంగా ఇదే విషయం చెప్పాను. మా ప్రభుత్వం చేసే పనులను మీ ముందు పెడతాం. జ్యూడిషియల్‌ కమిషన్ ఏర్పాటుచేసి.. మీరు న్యాయమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరాను. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 
 
ఈ సమావేశంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులైన అధికారుల సమాహారం ఉందని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి అధికారులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనేక సవాళ్ళను సైతం ఎదుర్కొని మంచి పనితీరును ప్రదర్శించే ప్రతిభ ఇక్కడి అధికార యంత్రాంగానికి ఉందని, ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప సామర్థ్యం ఉన్న అధికారులున్నారని ఆయన తెలిపారు. 


సచివాలయంలో సీఎం హోదాలో తొలిసారి..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం సచివాలయానికి చేరుకున్నారు. సీఎం  హోదాలో తొలిసారి ఆయన సచివాలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. వేదపండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి.. ఉదయం 8.39 గంటలకు తన ఛాంబర్‌లో సీఎం అడుగుపెట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన తన చాంబర్‌లోని కుర్చీపై ఆసీనులయ్యారు.

మూడు ఫైళ్లపై సీఎం జగన్‌ సంతకాలు
సచివాలయంలోకి అడుగుపెట్టి.. ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించిన అనంతరం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆశావర్కర్ల జీతాలను రూ. మూడు వేల నుంచి రూ. 10వేలకు పెంచుతూ.. తొలి సంతకం చేశారు. అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్ట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ ఫైల్‌పై సీఎం జగన్‌ మూడో సంతకం చేశారు. 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్‌, ధనుంజయరెడ్డి, ఇతర అధికారులు, వేదపండితులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నందిగం సురేశ్‌, ఆదిమూలపు సురేశ్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ధర్మాన కృష్ణదాస్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు సీఎం వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు.

తాడేపల్లి నుంచి సచివాలయానికి..
అంతకుముందు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన సెక్రటేరియట్‌కు చేరుకున్నారు. సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులోని సీఎం కార్యాలయంలోకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తొలిసారి ప్రవేశించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘంతో ఆయన సమావేశం కానున్నారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్‌ హాల్లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చినఅప్పలనాయుడు చేత 11.15 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా హాజరవుతారు.
-సాక్షి, అమరావతి

(సీఎం వైఎస్‌ జగన్‌ షెడ్యూల్‌ ఇలా...

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top