నేడు ఏపీ బడ్జెట్‌ | AP budget today | Sakshi
Sakshi News home page

నేడు ఏపీ బడ్జెట్‌

Mar 8 2018 1:28 AM | Updated on Jul 12 2019 6:01 PM

సాక్షి, అమరావతి: భారీ రెవెన్యూ వ్యయంతో కూడిన బడ్జెట్‌ను ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తం రూ.1,96,800 కోట్ల వ్యయంతో 2018–19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

రెవెన్యూ వ్యయం రూ.1,63,660 కోట్లు, కేపిటల్‌ వ్యయం కింద రూ.33,160 కోట్లను ప్రతిపాదించనున్నారు. 14వ ఆర్థిక సంఘం అంచనా మేరకు ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తిని రూ.8,70,330 కోట్లు గా పేర్కొన్నారు. రూ.30,000 కోట్ల మేర అప్పులు చేయనున్నారు. ఏపీ సొంత పన్నులు ద్వారా రూ.70 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రతిపాదించారు.

Advertisement
 
Advertisement
Advertisement