మరో తెలుగు తేజం: రూ.80.6 లక్షల జీతం! | Another Telugu Candidate: Rs .80.6 lakhs salary! | Sakshi
Sakshi News home page

మరో తెలుగు తేజం: రూ.80.6 లక్షల జీతం!

Dec 3 2014 10:41 PM | Updated on Sep 2 2017 5:34 PM

వెంకట సిద్ధార్థ

వెంకట సిద్ధార్థ

గుంటూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ సంస్థలో భారీ వేతనంతో కొలువును దక్కించుకున్నాడు.

 పత్తిపాడు: గుంటూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ సంస్థలో భారీ వేతనంతో కొలువును దక్కించుకున్నాడు. ప్రత్తిపాడు మండలం గనికపూడికి చెందిన అంచా అయ్యేశ్వరరావు, ప్రమీల దంపతుల కుమారుడు వెంకట సిద్ధార్థ గౌహతిలోని ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే కళాశాలలో మైక్రోసాఫ్ట్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సిద్ధార్థ్ ఎంపికయ్యాడు.

 అమెరికాలోని రెడ్‌మౌంట్‌లో మైక్రోసాఫ్ట్  ప్రధాన కార్యాలయంలో పనిచేసేందుకు ఏడాదికి 1.30 లక్షల డాలర్లు (రూ. 80.60 లక్షలు) ఆఫర్ చేసినట్లు అయ్యేశ్వరరావు బంధువు అంచా రవిబాబు వెల్లడించారు. ఐఐటీ కంప్యూటర్ సైన్స్‌లో టాపర్ అయిన సిద్ధార్థ ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివాడు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement