రణ 'అంగన వాడి'! | anganwadi workers protest against government | Sakshi
Sakshi News home page

రణ 'అంగన వాడి'!

Mar 17 2015 12:08 PM | Updated on Aug 20 2018 4:37 PM

రణ 'అంగన వాడి'! - Sakshi

రణ 'అంగన వాడి'!

తాముతలపెట్టిన చలో అసెంబ్లీని విజయవంతం చేసేక్రమంలో పోలీసుల నిర్భంధాన్ని సైతం లెక్కచేయకుండా ముందుకు దూకారు అంగన్ వాడీ కార్యకర్తలు.

హైదరాబాద్:  తాము తలపెట్టిన చలో అసెంబ్లీని విజయవంతం చేసే క్రమంలో పోలీసుల నిర్భంధాన్ని సైతం లెక్కచేయకుండా ముందుకు దూకారు అంగన్ వాడీ కార్యకర్తలు. ప్రభుత్వం తమను అడ్డుకోవడానికి చూస్తున్నా.. వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా రణాంగన యుద్దానికి సిద్ధమైయ్యారు. మంగళవారం  వేలాది మంది కార్యకర్తలు ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచే అంగన్ వాడీలు ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు యత్నించగా అంగన్ వాడీ కార్యకర్తలు వాగ్వావాదానికి దిగారు.

అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ మహిళలందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీకి వచ్చే దారులన్నింటిని పోలీసులు దిగ్భందించారు. దీంతో కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. మరోవైపు జిల్లాలనుంచి హైదరాబాద్ బయలుదేరిన కార్యకర్తల్ని పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు.  వార్షిక బడ్జెట్లో తమకు కేటాయింపులు లేవని నిరసనగా అంగన్వాడీ సిబ్బంది ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరే ఏపీ ప్రభుత్వం కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement