
సాక్షి, అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 1,465 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 21,763కి చేరింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 వరకు 23,872 మందికి పరీక్షలు నిర్వహించగా 3,963 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ శనివారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 44,609కి చేరాయి. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 12,84,384కి చేరింది. తాజాగా 52 మంది మృతితో మొత్తం మరణాలు 586కు చేరాయి. యాక్టివ్ కేసులు 22,260 ఉన్నాయి.