ధోనీకి అనంత కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ | Anantapuram Court issues warrant against Dhoni | Sakshi
Sakshi News home page

ధోనీకి అనంత కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ

Jun 24 2014 12:41 PM | Updated on Aug 20 2018 4:35 PM

ధోనీకి అనంత కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ - Sakshi

ధోనీకి అనంత కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ

భారత క్రికెట్ కెప్టెన్ ధోనీకి అనంతపురం కోర్టు మంగళవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

అనంతపురం : భారత క్రికెట్ కెప్టెన్ ధోనీకి అనంతపురం కోర్టు మంగళవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బిజినెస్ టుడే మేగజైన్ ముఖచిత్రంపై విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ధోనీ చిత్రాన్ని ముద్రించి, చేతిలో బూటు ఉంచడంపై విశ్వహిందూపరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు యర్రగుంట్ల శ్యాంసుందర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరిలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

హిందువుల మనోభావాలను కించపరిచేలా ఫొటో ముద్రించినందున ధోనీ, చైతన్య కల్బగ్‌లపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన ఎస్‌సి అండ్ యస్‌టి కోర్టు విచారణకు హాజరు కావాలని మూడుసార్లు ధోనీకి సమన్లు పంపినా హాజరు కాకపోవటంతో మంగళవారం న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement