అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన జిల్లావాసులందరూ క్షేమంగా ఉన్నారని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్‌చందర్
చిత్తూరు (కలెక్టరేట్): అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన జిల్లావాసులందరూ క్షేమంగా ఉన్నారని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్‌చందర్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక డీఆర్‌వో కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు.
యాత్రకు వెళ్లినవారి బంధువుల వివరాల కోసం హెల్ఫ్‌లైన్ నెం. 08572 240500కు ఫోన్‌చేసి వారి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహాయంతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. అందరినీ క్షేమంగా తీసుకువస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.