అమరనాథ్‌రెడ్డి ఆమరణ దీక్ష భగ్నం | amarnath reddy fast disrupted | Sakshi
Sakshi News home page

అమరనాథ్‌రెడ్డి ఆమరణ దీక్ష భగ్నం

Aug 20 2013 8:15 PM | Updated on May 29 2018 4:06 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా రాజంపేట ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

వైఎస్సార్‌జిల్లా: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజంపేట ఎమ్మెల్యే  అమరనాథ్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.  అమరనాథ్‌రెడ్డికి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన దీక్షను భగ్నం చేసి బలవంతంగా  రాజంపేటఆస్పత్రికి తరలించారు. ఆయనకు షుగర్ లెవిల్స్ భారీగా పడిపోయి, బీపీ పెరిగిపోవడంతో దీక్షను భగ్నం చేశారు. కాగా, ఆస్పత్రిలో కూడా దీక్షను కొనసాగిస్తానని అమర్నాథ్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కడపలో ఆమర్నాథ్ రెడ్డి దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

 

ఈ రోజు రాష్ట్రం అగ్నిగుండంగా మారడానికి కారణం సోనియా గాంధీయేనని కారణంటూ ఆయన ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న ఆలోచనతోనే విభజనకు సోనియా మొగ్గు చూపారని ఆయన దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement