శ్రీవారి ఆలయంలో కదిలే పైకప్పులు

Advanced Retractable Roof's for tirumala temple - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల ఆలయంలో అంతర్జాతీయ స్టేడియాల్లో వాడే అధునాతన రీట్రాక్టబుల్‌రూఫ్‌(కదిలే పైకప్పు)లు నిర్మించనున్నారు. ఆలయంలోని కొన్ని ముఖ్యమైన మండపాల్లో రాతి, సున్నంతో నిర్మించిన పైకప్పులు మాత్రమే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో పైకప్పులే లేవు. దీని వల్ల భక్తులు అసౌక ర్యానికి గురవుతున్నారు. దీన్ని గుర్తించిన టీటీడీ అధికారులు ఆయా కాలాల్లో అందుబా టులో ఉన్న రేకులు, ప్లాస్టిక్‌ గాల్‌ వాల్యూమ్‌ షీట్లు, ఇతర ఫైబర్‌ షీట్లతో తాత్కాలిక పైకప్పులు నిర్మిస్తున్నారు. ఇవి ఫలితాలు ఇవ్వ ట్లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అంతర్జాతీయ స్థాయిలో..  
రీట్రాక్టబుల్‌ రూఫ్‌లు అంటే కదిలే పైకప్పులు. అంతర్జాతీయ స్థాయి స్టేడియంలలో ఇలాంటి పైకప్పులు నిర్మిస్తారు. వీటిని అవసరానికి తగ్గట్టుగా వాడుకోవచ్చు. ఆకాశం కనిపించేలా పైకప్పును పక్కకు జరపటం, ఎండ, వర్షం వస్తే మూసివేయటం క్షణాల్లో చేసుకోవచ్చు.  

దాతల సహకారంతో నిర్మాణం..
ధ్వజస్తంభం మండపం నుంచి కల్యాణోత్సవం మండపం వరకు 15 మీటర్ల పొడవు, ఆరు మీటర్ల వెడల్పు కలిగిన రీట్రాక్టబుల్‌ రూఫ్‌ను నిర్మించాలని టీటీడీ ఇప్పటికే నిర్ణయించింది. సుమారు రూ.50 లక్షలు ఖర్చు అయ్యే ఈ వ్యయాన్ని భరించేందుకు బెంగళూరుకు చెందిన ఓ దాత ముందుకొచ్చారు. అలాంటి పైకప్పులు తయారు చేసే జర్మనీకి చెందిన ఓ సంస్థకు పనుల బాధ్యతను టీటీడీ అప్పగిం చింది. కొత్త పైకప్పు త్వరలోనే ఆలయానికి చేరుకోనుంది. ఇది విజయవంతం అయితే  మహాద్వారం నుండి ధ్వజస్తంభం వరకు, తిరిగి ఆనంద నిలయం ప్రాకారం ఉత్తర, పడమర, దక్షిణ దిశల్లోనూ నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే  సంబంధిత నిపుణుల బృందం సర్వే చేసి సంతృప్తి వ్యక్తం చేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top