సీలేరు నుంచి అదనపు జలాలు | Additional water from Seeley | Sakshi
Sakshi News home page

సీలేరు నుంచి అదనపు జలాలు

Mar 6 2015 2:38 AM | Updated on Sep 2 2017 10:21 PM

ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో పంట కోసం విశాఖ జిల్లా సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ డొంకరాయి జలాశయం మీదుగా శుక్రవారం ...

సీలేరు :  ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో పంట కోసం విశాఖ జిల్లా సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ డొంకరాయి జలాశయం మీదుగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి అదనంగా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని జెన్‌కో అధికారులు విడుదల చేయనున్నారు. విద్యుత్ ఉత్పాదన నిమిత్తం సీలేరు కాంప్లెక్స్ నుంచి గురువారం వరకు వెయ్యి క్యూసెక్కుల నీటిని ఇచ్చేలా నీటి పారుదల శాఖ అధికారులు విద్యుత్‌శాఖ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

అయితే పొలాలకు మరింత నీరు అవసరం కావడంతో తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి మెయిన్ డ్యాం నుంచి ఇప్పటివరకు ఇస్తున్న నీటితోపాటు మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని వారం రోజులపాటు విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement