గుండెపోటుతో ‘ఆశ’ వర్కర్‌ మృతి

Aasha Worker Died With Heart Stroke - Sakshi

తూర్పుగోదావరి, వేండ్ర (పెదపూడి): విధి నిర్వహణలో శిక్షణ పొందుతూ ఆశ వర్కర్‌గా పని చేస్తున్న పలివెల చిట్టెమ్మ(50) గుండెపోటుతో మృతి చెందిందని సంపర ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ  వేండ్ర గ్రామానికి చెందిన పలివెల చిట్టమ్మ ఈనెల 20 సామర్లకోటలోని టీటీడీసీ సెంటర్‌కు శిక్షణ నిమిత్తం వెళ్లిందని, గురువారం అర్ధరాత్రి సమయంలో ఆమెకు అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో వెంటన్‌ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయిందన్నారు. 

ఆశ వర్కర్‌ను ప్రభుత్వం ఆదుకోవాలి
సామర్లకోట టీటీడీసీలో శిక్షణ పొందుతూ మృతి చెందిన ఆశ వర్కర్‌ పలివెల చిట్టెమ్మను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, మండల సీఐటీయూ నాయకురాలు ఎం.రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామంలో చిట్టెమ్మ భౌతికకాయాన్ని వారు సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యురాలైన కోడలకు ఆశ వర్కర్‌ ఉద్యోగం ఇవ్వాలని, ఆశవర్కర్‌కు చంద్రన్న బీమా పథకం  వర్తింపజేయాలన్నారు. అలాగే తగిన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మండల ఆశవర్కర్ల నాయకురాలు రెడ్డి వెంకటలక్ష్మి, సంపర పీహెచ్‌సీ నాయకురాలు సుందరపల్లి మణిరత్నం, డీ.రత్నం, కె.పద్మవతి, సీహెచ్‌ మంగయమ్మ, జి.ఈశ్వరి తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top