సీనియర్‌ను కొట్టి చంపిన జూనియర్లు..
8 వతరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థిని కొట్టి చంపారు..
విశాఖ: నగరంలోని మధురానగర్‌లో దారుణం వెలుగుచూసింది. స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్న చిన్నా అనే విద్యార్థిపై అదే పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నా(15) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
దీంతో రంగంలోకి దిగిన ద్వారక పోలీసులు దాడికి పాల్పడిన ముగ్గురు ఎనిమిదో తరగతి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.