నూతన రాజధాని అమరావతి నుంచి రాయలసీమ జిల్లాలకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి భవిష్యత్ అవసరాల పేరుతో భారీగా భూ సమీకరణ లేదా భూ సేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది.
సమీకరణ లేదా సేకరణకు ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, అమరావతి: నూతన రాజధాని అమరావతి నుంచి రాయలసీమ జిల్లాలకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి భవిష్యత్ అవసరాల పేరుతో భారీగా భూ సమీకరణ లేదా భూ సేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ప్రస్తుతం నాలుగు, ఆరు లేన్ల రహదారి నిర్మించాలని నిర్ణరుుంచారు. భవిష్యత్‌లో 8 లేన్ల నిర్మాణం చేపట్టే ఆలోచనలో భాగంగా ఏకంగా 26,890.64 ఎకరాల భూమిని ఇప్పుడే సమీకరించడం లేదా సేకరించనున్నారు.
అమరావతి నుంచి అనంతపురం, కర్నూలు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌వే కోసం భూమి సేకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నిర్మాణానికి అవసరమైన భూమిని కొనుగోలు చేయడానికి లేదా భూ సేకరణ ద్వారా తీసుకోవడానికి వీలుగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో ఒక్కో భూ సేకరణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇందులో అటవీ భూమి కూడా ఉన్నందున తగిన అనుమతులు పొందేందుకు వీలుగా మరో విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.