శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలో సోమవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలో సోమవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు... టెక్కిలి నుంచి ఇచ్చాపురం వెళ్తున్నబస్సు నర్సాపురం జంక్షన్ వద్ద ఆగింది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్తానికులు స్పందించి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్తానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
(టెక్కలి)