breaking news
-
‘ముస్లింలు మీటింగ్‌కు టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?’
సాక్షి, కృష్ణాజిల్లా: వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాసిం అబూ ఇంటిపై గత అర్ధరాత్రి టీడీపీ రౌడీలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అబూ ఇంటి అద్దాలను టీడీపీ నేతలు పగలగొట్టారు. పార్టీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న ఆ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని.. అబూ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధ్వంసమైన ఫర్నిచర్‌ను ఆయన పరిశీలించారు. టీడీపీకి చెందిన కొందరు తమ ఇంటి వద్ద భయాందోళన సృష్టిస్తున్నారంటూ పేర్ని నాని వద్ద అబూ తల్లి బేగం ఆవేదన వ్యక్తం చేశారు.అబూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ పేర్ని నాని, వైఎస్సార్సీపీ శ్రేణులు భరోసా ఇచ్చారు. టీడీపీ నేత కడియాల గణేష్, మరికొందరు అర్ధరాత్రుళ్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ అబూ ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ నేత ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గుడివాడ డీఎస్పీకి పేర్ని నాని, వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోకుంటే, ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామంటూ పేర్ని నాని హెచ్చరించారు.గుడివాడలో రౌడీ రాజ్యం: పేర్ని నానివక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేంగా సమావేశం పెట్టడానికి వీల్లేదని అబూని టీడీపీ నేత కడియాల గణేష్ హెచ్చరించాడు. నా ఆదేశాలు ఖాతరు చేయకుండా మీటింగ్ పెడితే నీ అంతుచూస్తానని బెదిరించాడు. గణేష్ హెచ్చరించినా అబూ మీటింగ్‌కు హాజరయ్యారు. ముస్లింలు సమావేశం పెట్టినందుకు ఓ ఎస్ఐ వచ్చి కమ్యూనిటీ హాల్‌కు తాళం వేశారు. పోలీసు యూనిఫామ్ వేసుకుని కొందరు అధికారులు వ్యవస్థలను దిగజారుస్తున్నారు. ఇలాంటి పోలీసులను జిల్లా ఎస్పీ, డిజిపి అదుపులో పెట్టుకోవాలిపదిమంది ముస్లింలు కలిసి మీటింగ్ పెట్టుకోకూడదని ఏమైనా చట్టం ఉందా?. ముస్లింలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?. కమ్యూనిటీ హాల్‌కు తాళం వేయడంతో రోడ్డుమీదే ముస్లింలు మీటింగ్ పెట్టుకున్నారు. గత రాత్రి అబూ ఇంటిపై టీడీపీ రౌడీలు దాడి చేశారు. ఐరన్ రాడ్లతో అబూ ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. అబూను చంపేస్తామని టీడీపీ రౌడీలు బెదిరించారు. గుడివాడలో రౌడీ రాజ్యం నడుస్తోంది.. ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశాం. -
‘టీడీపీ స్వార్థ రాజకీయాలు ముస్లిం సమాజం గమనిస్తోంది’
సాక్షి, కర్నూలు: ‘వక్ఫ్ సవరణ చట్టం-2025’పై సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.హఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం ఆయన కర్నూలు రాయల్ ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టంపై దేశసర్వోన్నత న్యాయస్థానం ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ముస్లిం, మైనార్టీలను అన్యాయం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇప్పటికైనా ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ముస్లిం, మైనార్టీల పక్షాన నిలబడాలని హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. హఫీజ్ ఖన్ ఇంకా ఏం మాట్లాడారంటే..వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరడం మనం చూశాం. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలపడం, వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. ఇది మా ముస్లిం సమాజానికి గొప్ప రిలీఫ్.రాజ్యాంగం మాకు కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్దంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దశలోనూ అడ్డుకుంది. దీనిపై సుప్రీంలో తప్పకుండా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని మేం బలంగా నమ్ముతున్నాం. ఈ కేసులో సీజేఐ లేవనెత్తిన అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల విషయంలో సీజేఐ గారు సొలిసిటర్ జనరల్‌ను అడిగిన ప్రశ్నలే మేం ముందు నుంచి అడిగాం. ప్రభుత్వానికి సుప్రిం ఇచ్చిన నిర్ణీత గడువులో వారు సమాధానం ఇవ్వాలి. మా ముస్లింల తరుపున పోరాడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.టీడీపీ మాత్రం స్వార్ధ రాజకీయాలు చేసి తడిగుడ్డతో మా ముస్లిం, మైనార్టీల గొంతు కోసింది. వీరి స్వార్థ రాజకీయాలు ముస్లిం సమాజం గమనిస్తోంది. కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక్క ఏపీలోనే కాదు దేశంలోని ముస్లింలు అంతా కూడా చంద్రబాబు, నితీష్‌కుమార్‌ల వైపు చూశారు, మా హక్కులు అణగదొక్కుతుంటే మా వైపు నిలవకుండా వీరిద్దరూ మైనార్టీల పక్షాన నిలవకుండా బీజేపీ అజెండాను దేశమంతా అమలుచేయడానికి పూర్తిగా సహకరించారు, ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి, మీపై బాధ్యత ఉంది, మీరు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ముస్లిం, మైనార్టీల పక్షాన నిలబడాలని డిమాండ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా వైఎస్సార్సీపీ ప్రతి అడుగులో కూడా ముస్లిం సోదరుల వెంట నడుస్తుంది, వారి తరపున పోరాడుతుందని హఫీజ్ ఖాన్ చెప్పారు. -
‘చెప్పేవి గొప్ప మాటలు.. చేసేది మాత్రం శూన్యం’
విశాఖ : ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ పెద్దలు చెప్పేవి గొప్ప మాటలని, చేసేది మాత్రం శూన్యమన్నారు బొత్స. ‘రాష్ట్ర ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేదు. పెట్టుబడులో రావాలంటే మేమే అని అంటారు. ప్రభుత్వ ఉద్దేశంలో పరిశ్రమలను ప్రోత్సాహించడం అంటే పొగపెట్టడమే. కడపలో యాష్ కోసం కూటమి నేతల గొడవలు ప్రజలు చూశారు. ఇదొక్కటే కాదు.. కృష్ణపట్నం పోర్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో ఇదే జరిగింది. ఎచ్చెర్ల లిక్కర్ ఫ్యాక్టరీ వద్ద కూడా కూటమి నేతలు డబ్బులు వసూలు చేశారు. జిందాల్ పరిశ్రమపై కేసులు పెట్టి వేదిస్తే ఆ కంపెనీ గుజరాత్ కు వెళ్ళిపోయింది. పరిశ్రమలను ఇబ్బంది పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరిస్థితి ఇలా ఉంటే పరిశ్రమలు ఎలా వస్తాయి. విద్యుత్ చార్జీలు పెంచి ఆ నెపాన్ని వైఎస్సార్ సీపీ నేతలపై నెడుతున్నారు. మిర్చి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఒక్క టన్ను మిర్చి అయినా ప్రభుత్వం కొన్నదా?, రాష్ట్రంలో ఏ రైతుకి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తున్నారు..? , పొగాకు రైతులకు ఏమైనా మేలు చేశారా..? , ఒకవైపు పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి.. మరోవైపు కార్మికులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించడం లేదు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, దౌర్జన్యాలు చేస్తుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని జులుం చేస్తుంది. ఈ ప్రభుత్వ అలసత్వం, నిర్వాకం వలన రాబోయే తరానికి ముప్పు వాటిల్లుతుంది. ఇంత అప్పు గతంలో ఎప్పుడూ లేదు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత అప్పులు లేవు. ఏ శాఖలో కూడా జవాబుదారీ తనం లేదు.ఏ మంత్రి అయినా నా శాఖలో ఇంత కచ్చితత్వం ఉందని ఎవరైనా చెప్పగలరా..? , కొత్త పెన్షన్లు రాష్ట్రంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. పేద పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్ మెంట్ కూడా లేదు. విద్య, వైద్యం రాష్ట్రంలో లేవు. ఏ శాఖలో కూడా నిర్ధిష్టమైన విధానం లేదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఈరోజుకి కూడా అలానే ఉంధి. ప్రభుత్వం అసలు ఆలోచన కూడా చెయ్యడం లేదు. సంవత్సరం సమయం ఇచ్చారు ఈ ప్రభుత్వానికి ఇంకేం కావాలి. ధీటుగా ఎదుర్కోవాలి అని చంద్రబాబు మంత్రులకు చెప్పారు. ఏముందని.. ఏం చేశారని ధీటుగా ఎదుర్కొంటారు. పరిశ్రమలను ఇబ్బంది పెడుతున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. పెండింగ్ అర్జీ దారులకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారు’ అని బొత్స నిలదీశారు. -
చంద్రబాబు అంటేనే దోచుకోవడం: ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో వెలుగులు అనేవే ఉండవని.. ఆయన పేరు వినగానే గుర్రాలతో తొక్కించటం, తుపాకులతో కాల్చడం వంటివి గుర్తొస్తాయంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పది నెలల్లోనే ట్రూఅప్ ఛార్జీల పేరుతో జనాన్ని పీడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన దోచుకుంటుందని ధ్వజమెత్తారు.‘‘సర్దుబాటు ఛార్జీలు, టైం ఆఫ్ ది డే పేరుతో కొత్తరకం దోపిడీ మొదలు పెట్టారు. ప్రతి యూనిట్‌కి రూ.40 పైసలు చొప్పున పెంచి దోచుకుంటున్నారు. రూ. 4 వేల కోట్లు ఈ కొత్త రూపంలో వసూలు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజల మీద భారం లేకుండా చేశారు. చంద్రబాబు వచ్చాక వీర బాదుడు బాదుతున్నారు. కరెంటు వాడుకునేది తక్కువ, బిల్లుల మోత ఎక్కువగా ఉంది. అదనపు ఛార్జీలపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’’ అని అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. -
‘జీవీఎంసీ మేయర్ పీఠంపై కూటమి కుట్రలు’
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం తీర్మానంపై జరిగే ఓటింగ్‌లో పారదర్శకత పాటించాలని వైఎస్సార్సీపీ బృందం కలెక్టర్‌ను కోరింది. కూటమి ప్రలోభాలతో మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. జీవీఎంసీ పరిసరాల్లోకి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో తప్ప ఇతరులకు అనుమతి ఇవొద్దని కలెక్టర్‌ను వైఎస్సార్సీపీ నేతలు కోరారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం ఇచ్చిన నేపథ్యంలో అనేక అనుమానాలు ఉన్నాయని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఓటింగ్ జరిగే సమయంలో మీడియాను అనుమతించాలని కలెక్టర్‌ను కోరాం. ఓటింగ్ రోజు సభ్యులను తప్ప మిగతా వారిని అనుమతించకూడదు. అవిశ్వాసం తీర్మానం వీగిపోడానికి కావాల్సిన బలం మాకు ఉంది’’ అని ఆయన చెప్పారు.‘‘విప్ జారీ చేసేందుకు మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయించారు. రేపు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ విప్ జారీ చేస్తారు. విప్ ప్రకారం మా సభ్యులు నడుచుకోవాలి. విప్‌కు వ్యతిరేకంగా వ్యవహారిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే ఆదినారాయణ అరాచకం.. కలెక్టర్‌ను ఆశ్రయించిన అల్ట్రాటెక్
సాక్షి, వైఎస్సార్: జమ్మలమడుగులో పారిశ్రామికవేత్తలపై కూటమి నేతల అరాచకం మరింత పెరిగింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుల దాదాగిరి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి అరాచకంపై జిల్లా కలెక్టర్‌కు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.వివరాల ప్రకారం.. జమ్మలమడుగులో అన్ని కాంట్రాక్టులు తమకే కావాలంటూ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి కూటమి నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుల దాదాగిరి చేస్తున్నారు. ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రతీ ఒక్క కాంట్రాక్టూ తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో, ఇప్పటికే కాంట్రాక్టు నిర్వహిస్తున్న వారిని బయటకు పంపలేమని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎమ్మెల్యే ఒత్తిడితో కొన్ని కాంట్రాక్టులు ఇచ్చినా ఆదినారాయణరెడ్డి వర్గం శాంతించలేదు. ఫ్యాక్టరీ ముడిసరుకు, సిమెంట్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను అడ్డుకున్నారు.సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సరుకు బయటకు వెళ్లకుండా బస్సులు అడ్డుపెట్టి మరీ అరాచకం సృష్టిస్తున్నారు. దీంతో, ఓ ప్లాంటులో ఉత్పత్తి ఆగిపోగా, మరో ప్లాంటులోనూ ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి అరాచకంపై కంపెనీ యాజమాన్యం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసు భద్రత ఏర్పాటు చేసింది జిల్లా యంత్రాంగం.అయితే, ఫ్యాక్షన్ పోకడలతో పారిశ్రామికవేత్తలను ఆదినారాయణరెడ్డి వేధిస్తున్నారు. మూడు నెలల క్రితం అదానీ పవర్ ప్లాంటుపైకి కూడా ఇదే విధంగాదాడి చేసిన ఆదినారాయణరెడ్డి వర్గం దాడి చేసింది. ఆర్టీపీపీ ఫ్లైయాష్ తరలింపులోనూ అంతా తామే చేయాలని రగడ సృష్టించింది. అప్పట్లో జేసీ వర్గంతో తలపడ్డ ఆదినారాయణరెడ్డి వర్గం.. జేసీ వాహనాలను అడ్డగించిన విషయం తెలిసిందే. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో జిల్లాకు పరిశ్రమలు రాకుండా పోతాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కూటమిలో ట్విస్ట్.. జనసేన కారణంగా టీడీపీ కీలక నేతల రాజీనామా
సాక్షి, తూర్పు గోదావరి: ఏపీలో కూటమి పార్టీ మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, తాజాగా మంత్రి కందుల దుర్గేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ కీలక నేత కొమ్మిన వెంకటేశ్వర రావు రాజీనామా చేశారు. దీంతో, కూటమి పార్టీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. నిడదవోలులో ఎన్డీయే కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కందుల దుర్గేష్ తీరుపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పట్టణ అధ్యక్ష పదవికి కొమ్మిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు జనసేన విధానాలతో విసుగు చెందినట్టు చెప్పుకొచ్చారు. మంత్రి కందుల దుర్గేష్ వ్యవహారంపై వేలివెన్నులో కార్యకర్తల సమావేశంలో టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక, నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకోవడంతో అంతర్యుద్ధం మొదలైనట్టు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.మరోవైపు.. తనకు గుర్తింపు దక్కడం లేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను జనసేనలో చేర్చుకోవడంలో ఎలాంటి సమాచారం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, అన్నా క్యాంటీన్ ప్రారంభానికి కూడా ఆహ్వానం అందలేదని అసహనం ప్రదర్శించారు. అధిష్టానం స్పందించకుంటే మరిన్ని రాజీనామాలు ఉంటాయని శేషారావు హెచ్చరించారు. -
తిరుపతిలో గోవులన్నీ రిలయన్స్, జీ స్క్వేర్ నుంచి వచ్చాయి: భూమన
గోశాలకు భూమన అప్డేట్స్.. భూమన కామెంట్స్..మమ్మల్ని ఇంట్లోనే నిర్బంధించి కూటమి నేతలను అనుమతించారు.గోశాల సందర్శనకు రావాలని టీడీపీ నేతలే ఛాలెంజ్ విసిరారు.ఛాలెంజ్ విసిరిన వారే నన్ను గోశాలకు రాకుండా అడ్డుకున్నారు.నన్ను ఉదయం నుంచి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.మా పార్టీ నేతలను కూడా ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేశారు.ఉదయం నుంచి నేను కూడా వెయిట్ చేస్తున్నా అని వారికి చెప్పాను.నాకు సవాల్ విసిరిన పల్లా శ్రీనివాస్ తోకముడిచి గోశాల రాలేదు.ఛాలెంజ్ స్వీకరించి భయపడిపోయామని చిత్రీకరించే ప్రయత్నం చేశారు.టీడీపీ ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేసి గోశాలకు రమ్మన్నారు.నేను మరోసారి గోశాలకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.మమ్మల్ని బయటకు రానివ్వకపోగా తోసేశారు.కూటమి నేతల కుట్ర మీడియా సాక్షిగా బట్టబయలైంది.టీటీడీని ప్రక్షాళన చేస్తామన్న కూటమి సర్కార్ హామీ ఏమైంది?.170 గోవులు ఎందుకు మృత్యువాతపడ్డాయి.2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 176 ఆవులు మరణించాయని అధికారులే చెబుతున్నారు.గోవుల మృతిపై ఈవో, చైర్మన్, ఎమ్మెల్యే వ్యాఖ్యలకు పొంతన లేదు.గోశాలకు వెళ్ళేందుకు అనుమతి నిరాకరించారుగోశాలకు వెళ్ళకుండా అడ్డగించారుజిల్లా ఎస్పీ అధికారితో కూడా అబద్ధాలు మాట్లాడిస్తున్నారుగోశాలకు ఐదు మందిని అనుమతిస్తే ఎప్పుడూ అయినా మేము వెళ్లేందుకు సిద్ధం,గోశాలకు రేపు అయిన, ఎల్లుండి అయినా వచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాంగత ఏప్రిల్ నెల నుంచి ఏడాది మార్చి వరకూ 191 ఆవులు చనిపోయాయి అని గోశాల మేనేజర్ అధికారికంగా ఇచ్చారుప్రక్షాళన చేస్తామని చెప్పిన చంద్రబాబు ఈ పది నెలలు చేసిన ప్రక్షాళన ఇదేనామీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ నెల నుంచి మార్చి నెలవరకు 170 ఆవులు చనిపోయాయి అని అధికారికంగా ప్రకటించారు550 గోవులను రాజస్థాన్, పంజాబ్ నుంచి కొనుగోలు చేశారుటీవీ9 అధినేత రామేశ్వర రావు, రిలయన్స్ సంస్థ, జీ స్క్వేర్ సంస్థ ప్రతినిధులు దాతలుగా 550 ఆవులు కొనుగోలు చేసిటీటీడీ గోశాలకు గోవులు విరాళంగా ఇచ్చారుఇవన్నీ మా ప్రభుత్వ పాలనలో ఈవో జవహర్ రెడ్డి పాలనలో చేశాం, ఇది మా గొప్పతనంబైలోన మెథడ్ ద్వారా పెరుగును చిలకడం ద్వారా వెన్నను వెలికి తీసే పద్ధతి ప్రవేశ పెట్టాం, నవనీత సేవ ప్రవేశ పెట్టాంమీ పాలనలో ఆచారాలకు భిన్నంగా అరాచకాలు జరుగుతున్నాయితిరుమలలో శివ అనే డ్రైవర్ ను హత్య చేశారు70 ఏళ్ల తర్వాత తిరుమలలో హత్య జరిగింది,చెప్పులు వేసుకుని మహాద్వారం వద్ద పట్టుబడ్డారుగోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి అక్రమాలకు పాల్పడినప్పుడు మీ పాలనలో 8 నెలలు ఎందుకు కొనసాగించారుతొక్కిసలాట ఘటన లో ఎందుకు సస్పెండ్ చేశారుగోశాలలో గోవుల మరణాలను వాస్తవాలు పక్కదారి పట్టిస్తున్నారుమీ ఎల్లో మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారుదైవం కోసం జైలుకు వెళ్తాం, ప్రాణాలు అయినా అర్పిస్తాంసీఎం చంద్రబాబు నాయుడు ఒక్క ఆవు చనిపోలేదు అని ప్రకటన చేశారుపుట్టుకతోనే వృద్ధ ఆవులు అంటున్నారు టీటీడీ చైర్మన్మా పాలనలో రెండేళ్ల వయస్సు ఉన్న 550 గోవులు సాహివాల్ దాతలు సహాయంతో తీసుకు వచ్చాము,చంద్రబాబు పాలనలో స్పందన, ఉలుకు పలుకు లేదు, గృహ నిర్భందంహిందూ సమాజం అంతా ఈ వాస్తవాలు గ్రహించాలిఈ మూడు నెలల్లో తిరుమల వేదికగా ఎన్నో అరాచకాలు జరిగాయిఅజ్ఞానం తలకు ఎక్కిన వాళ్ళు సమాధానం చెప్తున్నారు,ఎవరి అజ్ఞానం వారి సొంత ఆస్తిస్వామి వారి అనుగ్రహం ఉంది కాబట్టే నేను మూడు సార్లు టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నా.గర్భంతో ఉన్న సాహివాల్ ఆవు రైలు ఢీకొని మృతి చెందితే దాన్ని కప్పి పుచ్చేదుంకు ప్రయత్నం చేశారుచనిపోయిన ఆవు చెవుకు ఉన్న ట్యాగ్ కోసేశారు, వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత గోశాల ఆవు అని అంగీకరించారుస్వామి ఊరేగింపులో పాల్గొనే వృషభం కూడా చనిపోయింది, తిరుమల లో పూజలు అందుకునే ఆవు కూడా చనిపోయిందిఫొటోలు మార్పింగ్ కాదు.. ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామాగోశాలకు మరోసారి రమ్మని పిలిచి తోకముడిచిన టీడీపీభూమనకు ఫోన్ చేసి గోశాలకు రావాలన్న టీడీపీ ఎమ్మెల్యేలు.భూమనకు పులివర్తి నాని, సుధీర్‌రెడ్డి, శ్రీనివాసులు ఫోన్.ఇటు ఫోన్లో రమ్మని.. అటు అడ్డుకోవడానికి పోలీసులను పంపిన ఎమ్మెల్యేలు.మీడియా ముందు డ్రామాలడి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు.టీడీపీ నేతలకు జవాబు చెప్పడానికి మళ్లీ బయలుదేరిన భూమన.ఇంటి దగ్గరే భూమనను నిర్బంధించిన పోలీసులు.గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి.వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తిని లాక్కుపోయిన పోలీసులుగోశాల గేటు వద్ద అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.మీడియా సాక్షిగా బట్టబయలైన టీడీపీ ఎమ్మెల్యేల బండారం.అభినయ్ రెడ్డి కామెంట్స్..సవాల్ స్వీకరిస్తే అడ్డుకోవడమేంటి?.కూటమి నేతలు భూమనకు ఫోన్ చేసి రమ్మంటారు.అక్కడ పోలీసులు అడ్డుకుంటారు.. ఇదేనా పద్దతి.ఎస్కార్ట్‌తో భూమనను గోశాల వద్దకు తీసుకురావాలి. తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత..ఎంపీ గుర్తుమూర్తి కామెంట్స్..గోశాలకు రాకుండా భూమనను అడ్డుకున్నారు.వేరే దారిలో నేను గోశాలకు వచ్చాను.నిజాన్ని నిరూపించడానికి మేము సిద్ధం. ఉద్రిక్తత..కూటమి నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారు.ఒకవైపు.. పోలీసులతో నిర్బంధించిన కూటమి నేతలుమరోవైపు భూమనకు ఫోన్లు చేస్తున్న కూటమి నేతలు.గోశాలకు రావాలంటూ భూమనకు కూటమి నేతల ఫోన్లు.గోశాలకు బయలుదేరిన భూమనను అడ్డుకున్న పోలీసులు.గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్లాకు భూమన ఫోన్ కాల్..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు భూమన ఫోన్‌మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్‌కు ిసిద్ధమన్న భూమనగోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను సిద్ధం.మీరు ఎక్కుడున్నారని పల్లాను ప్రశ్నించిన భూమనఈ క్రమంలో భూమన కాల్ కట్ చేసిన పల్లా. మాజీ మంత్రి ఆర్కే రోజా కామెంట్స్..టీడీపీ నేతల సవాల్‌కు భూమన సిద్ధమయ్యారుగోశాల వద్దకు అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా?.సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్?.కూటమి ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.కొండపై డ్రైవర్‌ను కొట్టి చంపితే విజిలెన్స్ ఏం చేస్తోంది?.శ్రీవారి ఆలయంపై డ్రోన్లు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు?.క్యూలైన్లో తొక్కిసలాటపై ఒక్క అరెస్ట్ జరిగిందా?.సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్ కల్యాణ్?.భూమన కామెంట్స్..టీడీపీ నేత చాలెంజ్‌పైనే నేను స్పందించాను.గోశాలకు రావాలని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ పిలిచారు.పోలీసు బలగాలతో నిర్బంధించడం దారుణం.గోవుల మృతిపై కూటమి నేతలు తలోమాట మాట్లాడుతున్నారు.గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని భయం పట్టుకుంది.నన్ను రమ్మన్న వాళ్లే ఇలా నిర్బంధించడం ఎంత వరకు కరెక్ట్?.టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతిస్తే ఏం ఉపయోగం?. తిరుపతి..👉గోశాలకు బయలుదేరిన భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి, వైఎస్సార్సీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు 👉పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి👉పద్మావతి పురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి👉తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు.👉భూమన అభినయ రెడ్డి కామెంట్స్..భూమన ఒక్కరైనా గోశాలకు వెళ్తారు.తిరుమల శ్రీవారి ప్రతిష్టను కాపాడాలి.కూటమి సర్కార్ సవాల్‌ను మేము స్వీకరిస్తే ఎందుకు అనుమతించడం లేదు?.👉కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా తిరుపతి నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద తిరుచానూరు పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. భూమనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హౌస్ అరెస్ట్ చేశారు.👉వివరాల ప్రకారం.. తిరుపతి నగరంలో ఉద్రిక్తత నెలకొంది. గోశాల గోవుల మృతిపై కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని భూమనకు టీడీపీ సవాల్ చేసింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని వ్యాఖ్యానించింది. దీంతో, టీడీపీ ఛాలెంజ్‌ను భూమన కరుణాకర్‌రెడ్డి స్వీకరించారు. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. ఈ క్రమంలో భూమనతో పాటు, తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.👉మరోవైపు.. భూమన హౌస్ అరెస్ట్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు మాట్లాడారు. ఈ క్రమంలో భూమన కరుణాకరరెడ్డి రెడ్డి ఒక్కరినే గోశాలకు అనుమతిస్తామని హుకుం జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్ళాలని సూచించారు. 👉ఇదిలా ఉండగా.. అంతకుముందు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు అని భూమన మండిపడ్డారు.👉కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటిళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్ హోటల్ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు. -
ముస్లింలకు చంద్రబాబు ద్రోహం: సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా, ఏప్రిల్ 11: బీజేపీ ఇచ్చే కొద్దిపాటి అధికారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు మనసు చంపుకొన్నారని.. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు పలికారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు వక్ఫ్ బిల్లుకు మద్దతు పలికిన బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌పైనా మమత నిప్పులు చెరిగారు. వీరిద్దరూ ముస్లింలకు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. కోల్‌కతాలో బుధవారం ముస్లిం పెద్దల సమావేశంలో మమతా మాట్లాడారు. ఎన్డీఏ కూటమికి కీలక మద్దతుదారులైన చంద్రబాబు, నీతీశ్ కారణంగానే వక్ఫ్ బిల్లు పార్లమెంటులో గట్టెక్కిందని అన్నారు. ఇప్పుడు మాత్రం వారిద్దరూ నోరు మెదపకుండా కూర్చుకున్నారని మండిపడ్డారు. బీజేపీకి పార్లమెంటులో సొంతంగా మెజారిటీ లేకున్నా ఇలాంటివన్నీ చేస్తోందన్నారు. ముస్లింలను అధికారం కోసం వాడుకున్నారని ఆరోపించారు. నమ్మి ఓట్లు వేసినవారి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. వక్ఫ్ చట్టాన్ని సవరించాలంటే రాజ్యాంగాన్ని సవరించాలని, కానీ, అదేమీ లేకుండా సాధారణ మెజారిటీతో పార్లమెంటులో ఆమోదం పొందిందని మమతా పేర్కొన్నారు.వక్ఫ్ చట్టం సవరణకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
‘రేపు గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్‌ను స్వీకరించిన భూమన
సాక్షి, తిరుపతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు ఎస్వీ గోశాల వద్దకు వస్తున్నా, అక్కడ కలుద్దాం’’ అంటూ భూమన ప్రతిసవాల్ విసిరారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. రేపు రండి.. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు’’ అని భూమన మండిపడ్డారు.కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్ హోటల్ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు. -
గంటాతో కూటమికి తలనొప్పులు.. పిలిచి మరీ క్లాస్ పీకిన అధిష్టానం
రాష్ట్రంలో తెలుగుదేశం..కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా మంత్రిగా హోదా నిలబెట్టుకునే స్థాయి నాయకుడైన గంటా శ్రీనివాస్‌కు ఇప్పుడు వట్టి ఎమ్మెల్యేగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. గతంలో మంత్రి హోదాలో కలెక్టర్లు.పెద్ద పెద్ద అధికారులతో హడావుడి చేసే గంటా ఇప్పుడు భీమిలి వరకే పరిమితం అవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే తన ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడూ అత్యుత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ ఓవర్ యాక్షన్‌ని ప్రభుత్వం..పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన చర్యలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో చీవాట్లు పెడుతూ.. కాస్త హద్దుల్లో ఉండాలని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.విజయవాడలో మంగళవారం జరిగిన ఓ ముఖ్య సమావేశానికి విశాఖ నుంచి బయల్దేరిన గంటా నేరుగా విజయవాడ వెళ్లాల్సి ఉండగా సదరు విమానం ఆయన్ను ముందుగా హైదరాబాద్ తీసుకెళ్లి..అక్కణ్ణుంచి విజయవాడ డ్రాప్ చేసింది.. ఎందుకూ అంటే విశాఖ నుంచి బెజవాడకు డైరెక్ట్ విమాన సర్వీస్ లేదు.. రద్దు చేశారని తెలిసింది. దీంతో ఉదయం వెళ్లాల్సిన గంటా మధ్యాహ్నానికి విజయవాడ చేరుకున్నారు.దీంతో ఆయన ‘ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు మీద టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని లేనిపక్షంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మన వారే కదా ఆయనకు చెబితే సరిపోయేది కానీ ఇలా ట్విటర్‌లోకి ఎక్కి రచ్చ చేయాలా అని చీవాట్లు పెట్టింది. సీనియర్ ఎమ్మెల్యే అయినా ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఎలా అని అడిగింది.ఇదిలా ఉండగా.. వతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని గంటా వియ్యంకుడు, పురపాలక మంత్రి నారాయణ ప్రకటన చేసిన తరుణంలోనే రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానమే లేదంటూ గంటా శ్రీనివాసరావు ట్విట్టర్లో సెటైర్ వేశారు. అధికార పార్టీ నాయకుడివైన నువ్వు ప్రభుత్వం పరువు తీయడం ఏమిటని అధిష్టానం ప్రశ్నించింది.వాస్తవానికి గంటా శ్రీనివాస్ గతంలో కూడా ప్రభుత్వానికి ఋషికొండ భవనాల తలుపులు తెరిచి హడావుడి చేశారు. ఫోటోలు విడుదల చేశారు. ఆ సందర్భంలో కూడా ఆయనకు పార్టీ నుంచి అక్షింతలు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్.. ప్రభుత్వంలో నంబర్ టూ అయిన లోకేష్..ఇంకా మంత్రులు ఉండగా కేవలం ఒక ఎమ్మెల్యే అయిన మీరు రుషికొండ భవనాలను చూడడానికి ఎందుకు వెళ్ళారు..మీకు అంత అత్యుత్సాహం ఎందుకు అని అప్పట్లోనే టిడిపి పెద్దలు ప్రశ్నించారు. ఇక ఇప్పుడు కూడా ఈ ట్వీట్ దెబ్బతో చీవాట్లు పడ్డాయి. మొత్తానికి గంటాకు ఈ టర్మ్ బాలేనట్లుంది.::సిమ్మాదిరప్పన్న -
వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేకే మత ముద్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయటంలేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. దీన్ని కప్పిపుచ్చుకోవటానికి వైఎస్ జగన్‌పై మతం ముద్ర వేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.‘‘పాదయాత్రకు ముందు, తర్వాత జగన్ తిరుమల వెళ్లారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి నేతలు మత ముద్ర వేస్తున్నారు. వైఎస్ జగన్‌పై నిలువెల్లా విషం చిమ్ముతున్నారు. గత టీడీపీ పాలనలో కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు చేయించారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను కూల్చారు. వాటిని జగన్ సీఎం అయ్యాక తిరిగి నిర్మించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక కాశీనాయన క్షేత్రంలో కొన్ని సత్రాలు, గోశాలను కూల్చారు’’ అని మల్లాది విష్ణు గుర్తు చేశారు.‘‘తిరుమలలో ఎగ్ బిర్యానీ, మద్యం దొరికింది. తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు. ఇలా వరుస సంఘటనలు జరిగాయి. హోంమంత్రి అనిత ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడారు. హోంమంత్రిలాగా తప్పుడు మాటలు మాట్లాడేవారినే క్రిమినల్స్ అంటారు, విజయకీలాద్రి మీద ఆలయాలు కట్టేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కానీ జగన్ పర్మిషన్ ఇచ్చి ఆలయాల నిర్మాణాలకు సహకరించారు. పీఠాల నిర్మాణాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు వాటిని లాగేసుకున్నారు. కేవలం జగన్ మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడారు. చంద్రబాబు హయాంలోనే హిందూ ధర్మంపైన దాడులు జరుగుతున్నాయి. వక్ఫ్ చట్టాన్ని ఆమోదించి చంద్రబాబు ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారు’’ అని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆదోని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్సీపీ
సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోని మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్సీపీ నెగించుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ శాంత వంటెద్దు పోకడలకు వ్యతిరేకిస్తూ, వార్డుల అభివృద్ధిలో సహకరించడం లేదంటూ చైర్మన్‌పై వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరారు.కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ భరద్వాజ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ శాంతకు వ్యతిరేకంగా 35 కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36 మంది ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్సీపీ నెగ్గించుకుంది. కాగా, ‘‘వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తామని ఆశ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినా రూ.10 పని కూడా చేయలేదన్నారు. వార్డుల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీలో చేరడం వల్ల చీవాట్లు తప్ప ఏమీ ఒరగలేదు.’’ అని 11, 12 వార్డుల కౌన్సిలర్ వాసీం అన్నారు. నిన్న ఆయన మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సమక్షంలో తిరిగి వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే.ఆయన నిన్న(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానన్నారు. సాయిప్రసాద్‌రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. వార్డులో పెద్దల మాటలను గౌరవించి, జరిగిన పొరపాటు తెలుసుకొని తిరిగి సాయన్న సమక్షంలో పార్టీలోకి వచ్చానన్నారు. 2029లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. -
వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు బాబు స్వస్తి పలకాలి: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీ కూటమి సర్కార్ కుట్రలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో విశాఖ మేయర్‌పై పెట్టిన అవిశ్వాసం విగిపోతుందని చెప్పారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు విప్ జారీచేస్తున్నాము. 19వ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని విప్ జారీ చేస్తాము. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు సరిపడ బలం మాకు ఉంది. వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకాలి.మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ..‘మహిళల మీద గౌరవంతో వైఎస్ జగన్.. నాకు మేయర్‌గా వకాశం కల్పించారు. బీసీ జనరల్ అయిన సరే యాదవ మహిళకు మేయర్‌గా అవకాశం ఇచ్చారు. యాదవులకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. యాదవుల కోరిక మేరకు భవన నిర్మాణం కోసం 50 సెంట్లు స్థలాన్ని కేటాయించారు. కీలకమైన పదవులు యాదవులకు కట్టబెట్టారు. కుట్ర కుతంత్రాలతో యాదవ వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించేయాలని చూడడం ఎంతవరకు సమంజసం. యాదవుల కన్నీరు మంచిది కాదంటూ గతంలో ఎమ్మెల్యే వంశీ చెప్పారు. ఇప్పుడు యాదవుల కన్నీరు వంశీకి కనిపించలేదా?. సోదర సమానులైన పల్లా శ్రీనివాస్, వంశీ అవిశ్వాసాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మేయర్‌పై అవిశ్వాసం వీగిపోతుంది. అవిశ్వాసం విగిపోయేందుకు కావల్సినంత బలం మాకు ఉంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు 58 మందికి విప్ జారీచేస్తున్నాము’ అని తెలిపారు. -
చిల్లర వేషాల గణేశా.. మక్కెలిరగ తంతా మల్లేశా!
‘గణపతి.. నేను మల్లేష్‌ను.. గ్రూపులో ఎగ్జిట్ ఎందుకు కొట్టావు.. నువ్వు ఎవడవు.. తీయడానికి....పోస్టులు పెడితే తీసేస్తావా... ఏ ఫొటోలు పెట్టాను.. ఎంపీ, మంత్రి, దాసునాయుడు ఫొటోలు పెట్టాను.. అంతమాత్రాన తీసేస్తావా? పార్టీ గ్రూపులో ఎలా తీస్తావ్. నన్ను తీయడానికి నువ్వెవడివి. పార్టీ కోసం పనిచేశాను. నీలా చిల్లర పనులు చేయిలేదు. టిఫిన్ కొట్టోళ్లు, చిల్లర వ్యాపారులు కడుపు కొట్టలేదు. – నరసన్నపేటకు చెందిన టీడీపీ నాయకుడు మల్లేష్ వాయిస్ ఇది..‘నేను అడ్మిన్‌ని గ్రూపులో ఫొటోలు ఇన్నేసి ఫొటోలు పెడితే ఎలా. అందుకే తీసేశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తంతాను.. ఎవడితో చెప్పుకొంటావో చెప్పుకో.. ఎమ్మెల్యే అవసరం లేనప్పుడు ఎమ్మెల్యే గ్రూపులో నీకు ఉంచం రా.. ఒరే మల్లేసు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నరసన్న పేట వస్తే తంతా ను. పాతే స్తాను. బోకరువు నువ్వు.. ఎమ్మెల్యే గ్రూపులో నీకు ఉంచనురా.. ఏమి పీక్కోంటావో పీక్కో..నీకు అంత సీను లేదు. నువ్వు పార్టీకి అవసరం లేదు. నువ్వు అడగడానికి ఎవడివి. నరసన్నపేట రా.. రెండు కాళ్లు పట్టుకొని క్రిందకి తొక్కెస్తా.. బచ్చా గాడవు, నాఇష్టం.. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పిచ్చి వేషాలు వేయకు.. నరసన్నపేట రా తంతాను. ఎవడు అడుగుతాడు చూస్తాను..’ – నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రైవేటు పీఏ గణపతి సంభాషణ ఇదిసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పీఏ గణపతి, స్థానిక టీడీపీ నాయకుడు మల్లేష్‌ల మధ్య వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు నోటికొచ్చినట్టు మాట్లాడుకున్నారు. పచ్చిబూతులు తిట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రెచ్చిపోయారు. వారి ‘వ్యవహారాలను’ వారే బయట పెట్టుకున్నారు. ఇందులో బగ్గు రమణమూర్తి ప్రైవేటు పీఏ గణపతి ఒక అడుగు ముందుకేసి పాతేస్తాను.. తంతాను...అంటూ దర్పాన్ని చూపించగా, టిఫిన్ కొట్టులపై బ్రోకర్ పని చేశావ్. చిన్నోళ్ల కడుపుకొట్టడం... డబ్బులిచ్చినోళ్లకే పనులు చేశావు. నువ్వు చేసేదేంటి? అంటూ టీడీపీ నాయకుడు మల్లేష్ చెలరేగిపోయారు. ఈ ఇద్దరి ఫోన్ సంభాషణ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో చిచ్చు రేపింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
అపరాధ భావం.. అతకని కథలతో బాబు కాలక్షేపం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో వింత ప్రకటన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా.. మిగిలిన అన్ని విషయాలపై అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో ఆయన డాక్టర్ అవుతున్నాడు.. మాస్టర్ అవతారం ఎత్తుతున్నాడు.. రోజూ ఏదో ఒక విషయం ఎత్తుకోవడం.. దానిపై మీడియాతోనో లేకపోతే ఇంకొకరితోనో.. గంటల తరబడి మాట్లాడటం! ఇదీ తంతు! ఈ ధోరణి గతంలోనూ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అది మితి మీరిపోతోంది.హామీలు అమలు చేయలేక ప్రజల్లో పలచన అవుతున్నాన్న అపరాధ భావమో.. ఇతరాంశాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టి తప్పించాలనో ఇలా చేస్తుండవచ్చు. అయితే, ఈ క్రమంలో ఆయన సమతుల్యత తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒక ఉదాహరణ చూద్దాం..‘పీ-4 కార్యక్రమంలో ఎంత మంది మంత్రులు పాల్గొంటున్నారు? ఎన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు’ అని ఈమధ్య ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు. అంతే ఆయనకు ఉన్నట్టుండి కోపం ముంచుకొచ్చింది. ‘కుక్క కరిస్తే, పిల్లి అరిస్తే సీఎం ఏం చేస్తాడు? విలేకరిగా నీకు బాధ్యత లేదా? సచివాలయంలో కూర్చున్నావంటే సొసైటీ నీకు ఆ స్థాయిని కల్పించిందని మర్చిపోవద్దు. మంత్రులను అడుగుతున్నావు.. ప్రెస్‌లో ఎంతమంది దత్తత తీసుకున్నారు? అన్నీ నేనే చూడాలన్న ఆలోచన ధోరణి మారాలి’ అంటూ చిర్రుబుర్రులాడారు.విలేకరి అడిగిన ప్రశ్నకు ఈయన గారి సమాధానానికి అస్సలు పొంతన లేకపోవడాన్ని కాసేపు పక్కనబెడదాం. వాస్తవానికి తాను అనుకుంటున్న పీ-4 కార్యక్రమం గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఇదో మంచి అవకాశం. మంత్రులు, తన పార్టీ నేతలను ఆ విధమైన సేవాభావం వైపు మళ్లించేందుకు ఓ సందేశం ఇచ్చి ఉండవచ్చు. అలాకాకుండా ఆ ప్రశ్న వేసిన విలేకరినే మందలించడం ఆయన పరిస్థితిని తెలియజేస్తోంది! పైగా ఇలా అసందర్భంగా మాట్లాడితే సీఎం స్థాయి నేత బ్యాలెన్స్ కోల్పోయినట్లు అనుకోరా?. చివరికి ప్రెస్ వారు దత్తత తీసుకోవాలని చెబుతున్నారంటేనే ఆ పీ-4 కార్యక్రమంలో చక్కదనం ఏంటో అర్థమవుతుంది.చంద్రబాబు గతంలో కూడా ఇలాంటి గిమ్మిక్కులు చేసేవారు. కాకపోతే ఈసారి అవి శృతి మించాయనిపిస్తుంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మీడియా అంతా అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడుతుండాలి. అబద్దాలు పోగు చేసి రాయాలి. లేకుంటే ప్రభుత్వానికి భయపడుతున్నారని ఆయనే మీడియా సమావేశాలలో వ్యాఖ్యానిస్తుంటారు. తాను ముఖ్యమంత్రి అయితే మాత్రం అంతా అదరహో అని ఊదరగొట్టాలి. టీడీపీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇదే పనిలో ఉంటాయి. అయినా ఇంకెవరైనా ప్రశ్నిస్తే ఆయనకు అసహనం వచ్చేస్తుందన్న మాట. ఇంకో విషయం చూద్దాం.ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఫీజుల చెల్లింపును డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. దాని గురించి మీడియాలో కథనాలు వస్తే చంద్రబాబు ఆ అంశంపై మాట్లాడకుండా పీపీపీ విధానంలో ఆస్పత్రులు అంటూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారట. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కల్పిస్తామని పౌరులందరికీ డిజిటల్ హెల్త్ కార్డు, అన్ని మండలాలలో జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీల అమలుపై ప్రజెంటేషన్ ఇచ్చి.. ఆ తరువాత కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన ‘ఇంటింటికి డాక్టర్’ కార్యక్రమాన్ని కొనసాగించి ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. కానీ, జగన్‌కు పేరు వస్తుందన్న భయంతో ఆ పథకాన్ని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు సరైన వైద్యమే అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.ఈ విమర్శలకు ప్రతిగా ఆయన చెబుతున్నది ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలోను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారట. అవి కూడా ప్రభుత్వ, ప్రైవేట్ పద్ధతిలో.. ఈ రకమైన ఆసుపత్రులకు నష్టాలొస్తే ప్రభుత్వం పదేళ్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ ఇస్తుందట. ఆరోగ్యశ్రీ రోగుల్లో యాభై శాతం మందికి ఇక్కడకు పంపిస్తారట. హాస్పిటల్ లేని నియోజకవర్గాలలో వంద నుంచి 300 పడకలతో ఈ తరహా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తారట. ఎక్కడో ఒకటి, అర తప్ప, ఇవన్నీ ఎప్పటికి వస్తాయి?. ప్రజలకు ఎప్పటికి ఉపయోగపడేను? అదేమని అడిగితే.. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటు చేస్తామంటారు. అది ఎప్పటికి రెడీ అవుతుందో తెలియదు. పది వ్యాధులకు ఒకరు చొప్పున డాక్టర్లను సలహాదారులుగా నియమిస్తారట. ఇదేమిటో తెలియదు.ఇంకోపక్క.. ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని వాటికి ఆక్సిజన్ ఇవ్వాలని, కాని డబ్బులు లేవంటున్నారని చంద్రబాబే చెబుతారు. మరి ఆయన చెప్పేవాటన్నిటికీ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? అమరావతిలో ఖర్చు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదల, మధ్య తరగతి వారి ఆరోగ్యం కన్నా, భారీ భవంతులు కట్టడం ప్రయోజనకరమని ఆయన భావిస్తున్నారా? ఇలా అడిగితే ఆయన ఊరుకోరు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, వ్యాధులు అంటూ ఆయనే ప్రజెంటేషన్ ఇస్తారు. విరుగుడు మాత్రం ప్రైవేటు మంత్రం అని పరోక్షంగా చెబుతూంటారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదలుకుంటారు. జగన్ తెచ్చిన వైద్య కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగిస్తారట.చంద్రబాబు మరో సలహా ఇచ్చారు. ప్రజలు ఏమేమి తినాలో ఆయన చెబుతున్నారు. అన్ని ప్రభుత్వమే చేయలేదని, వ్యాధులు రాకుండా ఆహార అలవాట్లు మార్చుకోవాలని, జీవన శైలి మార్చుకోవాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. జంక్ ఫుడ్స్ వదలిపెట్టి, మిల్లెట్స్ వాడాలని సూచిస్తున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు 600 గ్రాముల ఉప్పు, రెండు లీటర్ల నూనె, మూడు కిలోల పంచదారే వాడాలని అన్నారు. ఏదో పెద్ద తరహాలో చెబితే అదో రకం. కాని ఆయన మద్యం తాగమని చెబుతూ ఎన్నికల ప్రచారం చేశారే! తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చామని గొప్పగా అసెంబ్లీలో చెప్పారే. మరి ఆ మద్యం బాటిళ్లపై హానికరం అని ఉంటుంది కదా! ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు. ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుందన్న సంగతి అందరికి తెలుసు. దాని గురించి మాట్లాడిన సీఎంకు మద్యం తీసుకుంటే లివర్ పాడవుతుందని తెలియదా?. ఇక్కడే చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది.యధా ప్రకారం జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలు చెప్పి, జగన్ టైమ్‌లో అలా జరిగింది.. ఇలా జరిగిందని చెప్పి మభ్య పెడితే ప్రజలకు ఒరిగేదేమిటి? కొసమెరుపు ఏమిటంటే మీరు చెబుతున్నవాటిన్నటికి డబ్బు కావాలి కదా? ఎక్కడ నుంచి వస్తాయని అడిగితే, చాలా విషయాలలో డబ్బు కంటే సంకల్పం, పాజిటివ్ దృక్పథం ముఖ్యమని సెలవిచ్చారు. అంటే గాలిలో మేడలు కడుతున్నట్టు అనిపించదా?. కాకపోతే చంద్రబాబు ఉపన్యాసాలు ఈనాడు వంటి టీడీపీ మీడియా ‘ఆరోగ్య భాగ్యం’ అంటూ శీర్షికలు పెట్టి బాజా వాయించడానికి మాత్రం బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు
సాక్షి తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్‌కు హెలికాప్టర్లు ఇవ్వనీయకుండా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలకు దిగారు.వివరాల ప్రకారం.. ఇటీవల వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం బహిర్గతమైన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ రాప్తాడులో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న వెంటనే.. ప్రజలందరూ హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. తమ అభిమాన నేతలను కలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నది. దీంతో, వైఎస్ జగన్‌ను వదిలేసి హెలికాప్టర్ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి సర్కార్ కొత్త కుట్రలకు తెరలేపింది. ఈ ఘటనపై విచారణ పేరుతో పైలట్లకు నోటీసులు జారీ చేసింది. దీంతో, వైఎస్ జగన్‌కి హెలికాఫ్టర్లను ఇవ్వనీయకుండా చేసేందుకే ప్రభుత్వ పెద్దల కుట్రలు చేస్తోందని వైఎస్సార్సీపీ ఆరోపించింది.మరోవైపు.. హెలికాప్టర్ ఘటనపై మరుసటి రోజే హోంమంత్రి అనిత డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కొనసాగింపుగా హెలికాఫ్టర్ సంస్థలకు ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ఈ ఘటనపై ఇప్పటికే సంస్థలు డీజీసీఏకు నివేదిక అందించారు. అయితే, నివేదిక ఇచ్చినా పోలీసుల విచారణ పేరుతో పైలట్, కో-పైలట్‌ను ప్రభుత్వం వేధింపులకు గురిచేయడం గమనార్హం. నేడు విచారణకు హాజరుకానున్న పైలెట్, కో పైలెట్ వైఎస్ జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న ఘటనలో విచారణకు హాజరుకావాలని హెలికాప్టర్ నిర్వహణ సంస్థ, పైలెట్, కో–పైలెట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు బుధవారం విచారణకు హాజరుకానున్నారు. చెన్నేకొత్తపల్లిలోని రామగిరి పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. అక్కడ ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం’
తాడేపల్లి : ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరద్ధమన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్లో మాట్లాడిన పేర్నినాని.. ‘ టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పార్లమెంటులో పాస్ అయ్యేదా?, మరి వారిద్దరూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే మోదీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదు. చంద్రబాబు బొమ్మను దేశ వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు. ముస్లింల ఆందోళనల్లో సిగ్గు లేకుండా టీడీపీ పాల్గొంటోంది.లింకు డాక్యుమెంట్లు బయటపెడితే నోరుమూశారు..వక్ఫ్ స్థలాల్లో సాక్షి ఆఫీసులు ఉన్నాయంటూ మొదట ఆరోపణలు చేశారు. సాక్షి స్థలాల లింకు డాక్యుమెంట్లు బయట పెట్టడంతో నోరు మూసుకున్నారు. తర్వాత వైఎస్సార్సీపీ విప్ జారీ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. విప్ కాగితాలు బయట పెట్టగానే మళ్ళీ నోరు మూసుకున్నారు. హిందూ మత సంస్థలు, ఆలయాల్లో అన్యమతస్తులను తొలగిస్తున్నాం. చివరికి షాపులు ఉన్నా ఖాలీ చేయిస్తున్నాం. దేవాదాయ శాఖలో హిందూయేతరులను అధికారులను పెట్టటం లేదు. మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా పెడతారు?, అలా చేయటం కరెక్టేనా?, ముస్లింలు నమాజు చేసుకునే మసీదుల ఆలన పాలనాకు ముస్లిమేతరులను పెట్టటం సబబేనా? , ముస్లింల హక్కులను కాలరాయటం కరెక్టుకాదు.మా పార్టీలాగే మీరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగలరా?చంద్రబాబు, లోకేష్ లకు ఖలేజా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయగలరా?, మా పార్టీలాగే మీరు కూడా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయలగరా?, దిక్కుమాలిన, దౌర్భాగ్య రాజకీయాలు మానుకోవాలి. పన్నుల వసూళ్లలో రెండు శాతం మాత్రమే వృద్ది ఉన్నప్పుడు జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ టూ ప్లేస్‌కి ఎలా వచ్చింది?, అంటే ఇంకా లక్షల కోట్ల అప్పులు చేయటానికి రెడీ అయ్యారని అర్థం అవుతోంది. చంద్రబాబు దళిత వ్యతిరేకి. అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపించటం దుర్మార్గం. 2018 కు ముందు మా పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది జరుగుతోందని మేము గతంలోనే చెప్పాం. అధికారం ఉంటే చంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తారో లెక్కలేదు. రాజధానిలో ఇంకా 44 వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తేలుతుంది. తన స్వార్ధం కోసం తప్ప చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడు’ అని ధ్వజమెత్తారు. -
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ‘‘రాజధాని కోసం రైతుల నుంచి దాదాపు 34 వేల ఎకరాలు తీసుకున్నారు. అంతకు ముందే వాగులు, కొండలు, రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58 వేల ఎకరాల విస్తీర్ణం ఉంది. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమే. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు అదనంగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు. రాజధాని కోసం 31 వేల కోట్లు అప్పుచేశారు.. ఇంకా 69 వేల కోట్లు అవసరమంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.‘‘రెండు కళ్ల సిద్ధాంతంతో పరోక్షంగా ఉమ్మడి ఏపీ విభజనకు దోహదపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హమీని ఎగ్గొట్టేసింది. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయడం లేదు. ప్రజలకు ఉపయోగపడేవి వదిలేసి అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు అంటారేంటి చంద్రబాబు. హైపర్ లూప్ అనే రైలు అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే లేదు. ఏపీలో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ చేయమని చెప్పడం చంద్రబాబు అనాలోచిత.. తొందరపాటు చర్య. పెద్ద పెద్ద ధనవంతులకు, కార్పొరేట్లను బాగుచేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.‘‘గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పేదలను గాలికి వదిలేశారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు మేలు జరిగేలా పనిచేస్తున్నారు. మీ నిర్ణయాల వల్ల ప్రజలు, రైతులు, విద్యార్ధులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 58 వేల ఎకరాలుంటే మళ్లీ 44 వేల ఎకరాలు తీసుకోవడం దేనికి. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారా చంద్రబాబు. పొలం ఉన్న రైతు అమ్ముకోలేడా... రైతు తరపున మీరు అమ్ముతారా?. ప్రభుత్వం ఉన్నది.. రియల్ ఎస్టేట్ వాళ్లను బాగుచేయడానికా?. 40 అంతస్తుల బిల్డింగ్లు ప్రజలకు ఒరిగేదేంటి. ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు.. మంచి పరిపాలన. ప్రజలకు మేలు చేయకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు?’’ అంటూ శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు.‘‘ఏపీలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులు సరిపోవా.. మళ్లీ కొత్తవి పెట్టడం దేనికి?. అమరావతిలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఎవరడిగారు.. ఎవడికి కావాలి. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు కావాలని ఎవరడిగారు. శ్రీకాకుళంలో నాలుగైదు ఎకరాలున్న వాళ్లు కూడా బెజవాడలో తాపీ పనులు చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలో కావాల్సింది ఎయిర్ పోర్టు కాదు.. పంటలకు సాగునీరు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోతుంటే నీకు కనిపించడం లేదా?. చంద్రబాబు ఆలోచనలో ఇప్పటికైనా మార్పు రావాలని నేను కోరుతున్నా. పి4 గురించి తర్వాత ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి చంద్రబాబు. కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకు 14 వేలు ఇస్తామన్నారు.. ఏమైపోయింది ఆ హామీ?. మెట్రోరైళ్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదు చంద్రబాబూ’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.చంద్రబాబు పి4 స్కీంపై సెటైర్లు చంద్రబాబు పి4 స్కీంపై వడ్డే శోభనాద్రీశ్వరరావు సెటైర్లు వేశారు. పి4 విధానం అంటున్నారు మంచిదే. డబ్బున్నవాళ్లు పేదలకు సాయం చేయడం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. రాష్ట్రంలోనే అతిపెద్దవైన మూడు విద్యాసంస్థలు మీ నాయకులవే. మీకు చేతనైతే నారాయణ, భాష్యం విద్యాసంస్థల్లో పది శాతం పేద విద్యార్ధులకు సీట్లు ఇప్పించండి. పేదల కోసం హెరిటేజ్ నుంచి మీరేమీ ఇవ్వరా? మీ హెరిటేజ్ నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్లైనా ఇవ్వొచ్చు కదా?పేదల కోసం హెరిటేజ్ కూడా మేలు చేస్తుందని ప్రజలకు తెలియజేయండి. మీరు చేస్తే మిమ్మల్ని చూసి మరికొంతమంది సాయం చేసేందుకు ముందుకు వస్తారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు. -
టీడీపీ కార్యకర్తలు నా భార్యని కాలితో తన్నారు: మాజీ ఎంపీ నందిగం సురేష్
తాడేపల్లి,సాక్షి: సీఎం చంద్రబాబు పర్యటనలు సినిమా షూటింగులను తలపిస్తున్నాయని మాజీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు జనాల్లో తిరిగే పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దళితుల మేలు కోరి అనేక పథకాలను అమలు చేశారు. కానీ చంద్రబాబు రౌడీరాజ్యం కొనసాగిస్తున్నారు. పథకాలు అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాజధానిలో వరద వస్తే మునిగే ఐనవోలు ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు చూశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజధాని వరద ప్రాంతం నుండి విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.దళితులు,అంబేద్కర్ మీద వైఎస్ జగన్‌కు ఉన్న ప్రేమ అది. చంద్రబాబుకు అధికారం రాగానే మా కుటుంబంపై దాడి చేశారు. టీడీపి కార్యకర్తలు నా భార్యని కాలితో తన్నారు. త్వరలోనే ఆ వీడియోలు బయటపెడతా. ఇదేనా చంద్రబాబూ దళితుల మీద మీకు ఉన్న ప్రేమ? దళితుల మీద కక్షసాధిస్తూ పైకి కపట ప్రేమను చూపించొద్దు. చంద్రబాబు పర్యటనలు సినిమా షూటింగులను తలపిస్తున్నాయి. దళితుల గురించి చంద్రబాబు, పవన్, లోకేష్ బహిరంగంగా విమర్శలు చేశారు. ఇలాంటి వారికి దళితులే సరైన గుణపాఠం చెప్తారు’అని స్పష్టం చేశారు. -
చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారు: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారని.. వారి జీవితాలను చిన్నాభిన్నం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధపాతాళానికి దళితులను తొక్కేశారని.. వారికి సంబంధించిన ఏ పథకమూ అమలు కావటం లేదంటూ నిలదీశారు.‘‘అంబేద్కర్ అందరివాడే, కానీ చంద్రబాబు కొందరివాడు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటి వరకు ఎందుకు సందర్శించలేదు?. సామాజిక న్యాయ మహాశిల్పం దగ్గర ఉన్న వైఎస్ జగన్ పేరును ఎందుకు తొలగించారు?. దళితులకు ఏ పథకం అందించకుండా వారి ఇళ్లకు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నారు?...బ్లాక్ క్యాట్ కమాండోల సెక్యూరిటీ లేకుండా దళితుల ఇళ్లకు వెళ్లగలరా?. దళితుల ఇళ్లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న చంద్రబాబు వైఖరిని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దళితులను కించపరిచేలా ఒక మంత్రి మాట్లాడితే చంద్రబాబు అతన్ని ఎందుకు డిస్మిస్ చేయలేదు?’ అంటూ టీజేఆర్ ప్రశ్నలు గుప్పించారు.‘‘రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత లోపిస్తుందంటూ కోర్టులో కేసు వేశారు. దళితులను తొలగించి అక్కడ చంద్రబాబు ఎలా ప్యాలెస్ కట్టుకుంటున్నారు?. దళితుల మీద నిజమైన ప్రేమ ఉంటే వారిని చట్టసభలకు పంపించటానికి ఎందుకంత వివక్ష చూపుతున్నారు?. అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదు. చంద్రబాబుని దళితవాడల్లోకి రాకుండా అడ్డుకుంటాం’’ అని టీజేఆర్ హెచ్చరించారు. -
ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి: నారాయణ స్వామి
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జీడి నెల్లూరు మండలం వరత్తూరు పంచాయతీలో వైఎస్సార్సీపీ కార్యకర్త శంకర్‌రెడ్డికి చెందిన మామిడి తోటను ధ్వంసం చేశారు. టేకు చెట్లను కూడా టీడీపీ నేతలు నరికివేశారు. మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి.. రైతు శంకర్‌రెడ్డిను పరామర్శించారు.అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్నడు ఇలాంటి సంఘటనలు జరగలేదని.. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రైతులకు రక్షణ లేకుండా పోయింది. ఇదేనా చంద్రబాబు ప్రక్షాళన, సంపద సృష్టి అంటూ మాజీ నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మామిడి తోట, టేకు చెట్లను నరికివేసి నాలుగు రోజులైంది. ఇప్పటివరకు రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. 1970 పట్టా, పాసు పుస్తకాలు శంకర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చింది. పచ్చని చెట్లు నరికిన కుటుంబాలు బాగు పడింది లేదు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన పట్టించుకోలేదు. సమాధానం చెప్పలేదు. పాల సముద్రం మండలంలో ఇసుక, మట్టి, గ్రానైట్ సరిహద్దులో ఉన్న తమిళనాడుకు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు. సీఎం చంద్రబాబు గంగాధర నెల్లూరు పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులకు ఎలాంటి లబ్ధి చేకూర్చవద్దని బహిరంగ సభలో చెప్పారు.’’ అంటూ నారాయణ స్వామి గుర్తు చేశారు. -
చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్: సీపీఐ రామకృష్ణ
సాక్షి, అనంతపురం: వక్ఫ్ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడం దుర్మార్గమంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వక్ఫ్ బిల్లులో సవరణలు చేయకుండానే ఎందుకు మద్దతు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. వక్ఫ్ బిల్లు దేశంలో లౌకిక వాదాన్ని దెబ్బతీసేలా ఉంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ఏం పని?’’ అంటూ రామకృష్ణ ప్రశ్నించారు.‘‘హిందూ ధార్మిక సంస్థల్లో ముస్లింలకు చోటిస్తారా?. ముస్లిం, క్రైస్తవ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసింది. చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్. తిరుపతిలో గోవుల మరణాలపై సమగ్ర విచారణ చేయాలి’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.‘‘భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలపై పాజిటివ్‌గా స్పందించాలి. సీఎం చంద్రబాబు, ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ప్రతి విషయం వైఎస్ జగన్‌కు ఆపాదించడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ వైఖరి మార్చుకోవాలి’’ అని రామకృష్ణ హితవు పలికారు. -
వాస్తవానికి అతకని పచ్చరాతలు!
‘వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానం.. మొదటి స్థానంలో తమిళనాడు! తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం పైపైకి..’ ఇది తెలుగుదేశం పత్రిక ఈనాడులో పతాక శీర్షికన వచ్చిన కథనం. ఈ కథనాల ప్రకారం వృద్ధిరేటులో ఏపీ రెండో స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది! అంటే తెలంగాణ బాగా వెనుకబడి ఉన్నట్లే కదా? ఆ వెనుకబాటు గురించి తెలంగాణలోనూ ప్రచురించాలి కదా? వారి టీవీలలో ప్రసారం చేయాలి కదా!.కానీ, తెలంగాణ ఎడిషన్లలో ఈనాడు, తదితర ఎల్లో మీడియా పత్రికలు అసలు ఆ కథనాలే ఇవ్వలేదు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవాలా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారా? లేక ఎల్లో మీడియా వ్యాపార ప్రయోజనాలు తెలంగాణలో అధికంగా ఉన్నాయి కనుక ఆ తరహా వార్తలు ఇచ్చి ప్రభుత్వానికి అసంతృప్తి కలిగించరాదని? లేక అసలు ఈ వృద్ధి రేటు లెక్కలన్నీ కాకి లెక్కలని తెలుసు కనుకనా?. ఏపీలో తాము భజన చేస్తున్న చంద్రబాబు సర్కారుకు మేలు చేయాలనా? అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇంకో కారణం కూడా ఉండవచ్చు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది. దానిని కప్పిపుచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఏపీలో బాగా పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ,ఇతర వ్యాపారాలను హైప్ చేయడానికి కూడా ఇది ఒక మార్గం కావచ్చు.జగన్ టైమ్‌లో కేంద్రం ఏపీకి ఏదైనా మంచి ర్యాంకు ఇస్తే ఒక్క ముక్క రాయకపోగా, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం బ్యానర్ కథనాలు వండివార్చి ప్రజలను మోసం చేస్తోంది. వాస్తవంగా వృద్ధి రేటు ఆ స్థాయిలో ఉండి ఉంటే ఎవరూ తప్పుపట్టరు. కానీ, క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి స్టోరీలు ఇచ్చినా జనం నమ్ముతారా? ఈ కథనాలు రావడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై కామెంట్ చేస్తూ రాష్ట్రంలో అభివృద్ది జరిగిపోతోందని సంబరపడిపోవడం చూడడానికి బాగానే అనిపించవచ్చు. నిజానికి ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేవే. కేవలం ముందస్తు అంచనాలు. ఏ స్వతంత్ర సంస్థ వీటిని ధృవీకరించలేదు. ఈ లెక్కలను అనేక ఇతర రాష్ట్రాలు ఇంకా కేంద్రానికి పంపలేదు కూడా. నిజంగా ఎల్లో మీడియా వార్తలు చదివితే ఈ పది నెలల కాలంలో ఏపీ ఇంతగా అభివృద్ధి చెందిందా? అన్న డౌటు రావచ్చు.తలసరి ఆదాయం పెరిగిపోతే ప్రజలు తమకు స్కీములు ఏవీ ఇవ్వక పోవడంపై ఎందుకు గగ్గోలు పెడుతున్నారు?. దానికి వీరెవ్వరూ సమాధానం ఇవ్వరు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఒకవేళ డబ్బులు ఉన్నా ఖజానా ఖాళీగా ఉందని అసత్యాలు చెబుతున్నారా?. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా తనకు సూపర్ సిక్స్ హామీల అమలు కష్టంగా ఉందని అంటున్నారు. ఎన్నికలకు ముందు అప్పులు చేయబోనని, సంపద సృష్టిస్తానని ఊదరగొట్టిన బాబు ఇప్పుడేమో రికార్డు స్థాయిలో అప్పులు చేశారు. ఒక ఏడాదిలో అమరావతి అప్పులతో సహా సుమారు రూ.1.5 లక్షల కోట్లు చేస్తుండడం దేశంలో మరే రాష్ట్రంలో జరిగి ఉండదు. అయినా వృద్ధిరేటు అధికంగా ఉందంటే ఎలా నమ్మాలి?.ఇక్కడ మరో కోణం చూద్దాం. మొదటి పది నెలల్లో ప్రభుత్వం ఆశించిన ఆదాయంలో 33 శాతం తగ్గుదల ఉంది. మూలధన వ్యయంలో 48 శాతం తగ్గుదల నమోదైంది. అయినా వృద్ధిరేటు మాత్రం 2023-24లో 6.19 శాతం ఉంటే, 2024-25లో 8.21 శాతంగా ఉందని గణాంకాలు తయారు చేశారు. తలసరి ఆదాయం వృద్ధిలోనూ పైపైకి వెళ్లిందని రాశారు. అయితే ఏ రకంగా, ఏ కారణం వల్ల ప్రజల ఆదాయం పెరిగిందన్న వివరణ మాత్రం వీరివ్వరు. ఆదాయం నిజంగా పెరిగి ఉంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోళ్లు, ఆస్తుల లావాదేవీలపై ఖర్చు చేస్తారు. చిత్రంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం అంతకుముందు సంవత్సరంలో పోల్చితే రూ.800 కోట్లు తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. అలాగే వాణిజ్య పన్నులు కూడా ఆశించిన రీతిలో వసూలు కావడం లేదు. అయితే ఒక మద్యంలో మాత్రం ఆదాయం వస్తుండ వచ్చు. ప్రజలను తాగుబోతులుగా మార్చడం ద్వారా వృద్ధి రేటు వచ్చిందని ప్రభుత్వం చెప్పదలిస్తే మనం ఏమీ చెప్పలేం. కానీ, వృద్ధి రేటు ద్వారా పేద ప్రజల ఆర్థిక స్థితి గతులు మెరుగుపడాలి. వారి జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకోసం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ స్కీములు ఉపయోగపడతాయి.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు అన్ని సంక్షేమ హామీలు అమలు అయ్యాయి. అందువల్ల అప్పట్లో తలసరి ఆదాయం పెరగడం, పేదరికం తగ్గుముఖం పట్టడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ మోతాదు వెయ్యి రూపాయలు పెంచడం మినహా సూపర్ సిక్స్, ఇతర హమీలేవీ అమలు చేయలేదు. అయినా తలసరి ఆదాయం పెరిగిందటున్నారు. రియల్ ఎస్టేట్ ఊపందుకుందని కథనాలు ఇస్తున్నారు. అమరావతితో సహా రాష్ట్రంలో ఏ నగరం, పట్టణంలోనూ భూముల విలువలు పెరగలేదు. కొనుగోళ్లు, అమ్మకాలు పెద్దగా జరగడం లేదని చాలామంది చెబుతున్నారు.కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం మొదలైన పట్టణాలలో ధరలు సగానికి సగం పడిపోయాయి. పోనీ అమరావతిలో వేల కోట్లు వ్యయం చేస్తున్నందున అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందా అంటే చెప్పుకోదగిన స్థాయిలో లేవని అంటున్నారు. ప్రభుత్వం అచ్చంగా అమరావతిలోనే రియల్ ఎస్టేట్ పెరగాలని భావిస్తున్నందున విశాఖతో సహా ఇతర నగరాలలో పరిస్థితి దారుణంగా తయారైందని వార్తలు సూచిస్తున్నాయి. రైతులు గిట్టుబాట ధరలు లేక అల్లాడుతున్నారు. అక్వా రైతులకు ట్రంప్ దెబ్బ తగిలింది. ఏ రంగం చూసినా ఆశాజనకంగా పరిస్థితులు కనిపించడం లేదు. జీఎస్డీపీ, వృద్ధి రేటు, తలసరి ఆదాయం వంటి వాటిపై ఇచ్చిన లెక్కలు చూసి ఏపీ ప్రజలు ఆనందపడతారా?. వాస్తవంగా వారి జీవితాలు ఎంత భారంగా గడుస్తున్నాయో వారికి తెలియదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హిందూపురంలో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న(సోమవారం) ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు బేడీలు వేసి నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఇవాళ వైఎస్సార్సీపీ నేత వేణరెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.ధర్మవరం నియోజకవర్గంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలుమరో వైపు, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ జగన్ ఫోటోను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్న బాబ్జన్పై దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలు కాడంతో కదిరి ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో ఘటన జరిగింది. ఫోన్లో దూషించిన టీడీపీ నేతలు.. అనంతరం దాడి చేశారు.