breaking news
-
విచారణకు శైలజా కిరణ్ సహకరించలేదు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించడంలేదని, అయినప్పటికీ తాము చట్టానికి లోబడే విచారణ జరుపుతున్నామని సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ స్పష్టం చేశారు. ఈనాడు, ఈటీవీ మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే సీఐడీ విచారణపై నిరాధార ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆయన బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఐజీ సీహెచ్ శ్రీకాంత్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము శైలజ కిరణ్‌ను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని, .ఆమె పట్ల పూర్తి మర్యాదతో వ్యవహరించామని చెప్పారు. ఆమె భోజనం, టీ, మందుల కోసం అవసరమైన ప్రతిసారీ అవకాశం కల్పించామన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్టు కచ్చితమైన ఆధారాలు లభించాయని రవికుమార్ స్పష్టం చేశారు. విచారణ కోసం మంగళవారం శైలజ కిరణ్ నివాసానికి వెళ్లినప్పుడు తమ సిబ్బందిలోని 10 మందిని అనుమతించకుండా అభ్యంతరం తెలిపారన్నారు. ఆర్థిక అక్రమాలను సంబంధించి ఆధారాలపై ప్రశ్నించాల్సిన సాంకేతిక అధికారులను అడ్డుకునేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది ప్రయత్నించారని తెలిపారు. తాము చట్టం పరిధిలోనే విచారిస్తున్నప్పటికీ శైలజ కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకుండా పదే పదే ఆటంకాలు కల్పించేందుకు యత్నించారని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీగా పూర్తి సమాచారాన్ని ఆమె వద్ద ఉంచుకోలేదని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని తెలిపారు. ఎండీ వద్ద పూర్తి సమాచారం ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా నిధుల మళ్లింపుపై వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆమె పదే పదే ప్రయత్నించారన్నారు. విచారించిన ప్రతిసారీ ఏదో సాకుతో తప్పించుకోవాలన్నదే ఆమె ఉద్దేశంగా ఉందన్నారు. శైలజ కిరణ్ పదే పదే ఆటంకాలు కల్పిస్తుండటంతో తాము అడగాల్సిన ప్రశ్నల్లో 25 శాతం కూడా అడగలేకపోయామని వివరించారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేసి ఆమెను విచారిస్తామని తెలిపారు. ఈ కేసులో రామోజీరావును కూడా మరోసారి విచారిస్తామని చెప్పారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధులు రూ.793.50 కోట్లను ఆటాచ్ చేసేందుకు న్యాయస్థానంలో త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. -
గంజాయి, అక్రమ మద్యంపై సెబ్ దాడులు
సాక్షి, అమరావతి: ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయితోపాటు డ్రగ్స్ విక్రయాలు, అక్రమ మద్యం విక్రయాలు, సారా తయారీపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. మే నెలలోనే 169 గంజాయి కేసులు నమోదు చేసి 710 మందిని అరెస్టు చేసింది. 7,222.16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు 92 వాహనాలను జప్తుచేసింది. మూడు మాదకద్రవ్యాల కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసింది. 3,100 పెంటజోయిస్ ఇంజక్షన్ సీసాలు, 4.23 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకుంది. 2,115 సారా కేసుల్లో 13,828 లీటర్ల సారా, 1,198.5 కిలోల ఊట బెల్లాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు 1,274 మందిని అరెస్టు చేసింది. 896 అక్రమ మద్యం కేసులు నమోదు చేసి 588 మందిని అరెస్టు చేయడంతోపాటు 1,664.94 లీటర్ల అక్రమ మద్యం, 144.6 లీటర్ల బీరును స్వాధీనం చేసుకుని, 21 వాహనాలను జప్తుచేసింది. 40 లీటర్ల అక్రమ కల్లును కూడా స్వాధీనం చేసుకుంది. 30 ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసుల్లో 161 మందిని అరెస్టు చేయడంతోపాటు 264 ఎర్రచందనం దుంగలను, 25 వాహనాలను జప్తుచేసింది. మే నెలలో గంజాయి కేసుల్లో 30 మందిపై, సారా కేసుల్లో ఎనిమిది మందిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు సెబ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: IAS vs IPS: ఐపీఎస్ రూపకు ముందస్తు బెయిల్ -
తెల్లారితే చెల్లి పెళ్లి.. ఇళ్లంతా హడావుడి.. అంతలో
మొగల్తూరు: తెల్లారితే చెల్లి పెళ్లి. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. స్నేహితులతో సరదాగా బీచ్‌కు వచ్చిన యువకుడు, అతని స్నేహితుడు నీటిలో మునిగి మృత్యువాత పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వజ్జిపోతు సత్యనారాయణ కుటుంబం హైదరాబాద్‌లోని దిండిగల్‌లో స్థిరపడింది. వారి కుమార్తె వజ్జిపోతు ఆశాజ్యోతికి ఇటీవల వివాహం నిశ్చయించగా, తమ సొంత ఊరైన పాలకొల్లులోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా కలిసి పాలకొల్లు వచ్చారు. బుధవారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కుమార్తె అన్న వజ్జిపోతు రాజేష్ (22), నిజాంపేటకు చెందిన అతని స్నేహితుడు బండారు వినయ్ (16) మరో తొమ్మిది మంది స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పేరుపాలెం బీచ్‌కి వచ్చారు. స్నానానికి దిగిన రాజేష్, వినయ్ నీటిలో గల్లంతవడంతో అతని స్నేహితులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సహాయంతో వారి కోసం గాలింపు చేపట్టగా, రాజేష్ మృతదేహం లభించింది. కొన ఊపిరితో ఉన్న వినయ్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుమార్తె పెళ్లి వేళ కుమారుడు శాశ్వతంగా దూరమవడంతో అతని తల్లిదండ్రులు సత్యనారాయణ, నాగవేణి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు
తమ చందాదారుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశారో తెలియదు! బ్రాంచీలు, ప్రధాన కార్యాలయంలో ఉన్న నిధులెన్నో తెలియదు! మిగిలిన నిధులను ఎక్కడికి మళ్లించారో కూడా తెలియదు! కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం గురించి ఏమాత్రం తెలియదు! అసలు నాకేమీ తెలియదు.. తెలియదు.. తెలియదు!! –సీఐడీ విచారణలో మార్గదర్శి ఎండీ శైలజ తీరు ఇదీ సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–2గా ఉన్న సంస్థ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు మంగళవారం హైదరాబాద్‌లో మరోసారి విచారించారు. సీఐడీ ఎస్పీలు అమిత్ బర్దర్, హర్షవర్థన్‌రాజు, విచారణ అధికారి రవికుమార్‌తోపాటు 30 మందితో కూడిన సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి ఉదయం 10 గంటలకు చేరుకోగా దాదాపు అరగంటపాటు గేటు తాళం తీయలేదు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీఐడీ విచారణ కొనసాగింది. ‘మీరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ కదా? మీ పేరిటే చెక్ పవర్ కూడా ఉంది. నిధుల మళ్లింపుపై ఆధారాలు ఇవిగో..! మరి వీటిపై ఏమంటారు..?’ అని సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించడంతో ‘నాకు ఆరోగ్యం బాగా లేదు! నేను సమాధానాలు చెప్పలేకపోతున్నా.. ఇబ్బంది పెట్టొద్దు..’ అంటూ శైలజా కిరణ్ తప్పించుకునేందుకు యత్నించారు. విచారణకు సహకరించకుండా.. తనకు ఆరోగ్యం బాగా లేదని, విదేశాల నుంచి రావడంతో జ్వరం వచ్చిందంటూ శైలజా కిరణ్ విచారణకు సహకరించకుండా చాలాసేపు జాప్యం చేశారు. విచారణ మొదలైన కొద్దిసేపటికే జ్వరంగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయంటూ వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్ కొన్ని మాత్రలు సూచించి విచారణ కొనసాగించవచ్చని చెప్పారు. సీఐడీ అధికారులు మళ్లీ విచారణ చేపట్టిన కొద్దిసేపటికే మరోసారి తనకు ఆరోగ్యం సహకరించడం లేదని శైలజా కిరణ్ పేర్కొన్నారు. విచారణను అర్ధాంతరంగా ముగించేందుకు ప్రయత్నించగా సీఐడీ అధికారులు పూర్తి సహనం వహిస్తూ విచారణను కొనసాగించారు. మళ్లించాం... ఎక్కడికో తెలియదు! మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను ఎక్కడికి మళ్లించారనే విషయాన్ని తెలుసుకోవడంపై సీఐడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. బ్రాంచీల కార్యాలయాల్లోని రికార్డుల ప్రకారం రూ.వేల కోట్లు చందాదారుల నుంచి వసూలు చేసినట్లు తేలింది. బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన రూ.793.50 కోట్లను అటాచ్ చేసేందుకు సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చందాదారుల నుంచి భారీగా వసూలు చేసిన మిగతా నిధులను ఎక్కడికి మళ్లించారన్నది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. రికార్డుల్లో సరైన వివరాలు లేకుండా ఆడిటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు. సీఐడీ అధికారులు అదే విషయంపై శైలజా కిరణ్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏపీలోని 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా వసూలు చేసిన చందా నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టామని పేర్కొనట్లు సమాచారం. నిర్దిష్టంగా ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు. దీనిపై సీఐడీ అధికారులు ఎంత ప్రశ్నించినా తనకేమీ తెలియదని శైలజా కిరణ్ చెప్పడం గమనార్హం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ చందాదారులకు చిట్టీల మొత్తాన్ని ఎందుకు చెల్లించలేకపోతోందని సీఐడీ అధికారులు శైలజా కిరణ్‌ను ప్రశ్నించగా సూటిగా సమాధానం ఇవ్వలేదు. చందాదారుల సొమ్ము భద్రంగా ఉందంటూ తప్పించుకునే యత్నం చేశారు. అదే నిజమైతే చిట్టీల మొత్తం ఎందుకు చెల్లించలేకపోతున్నారని సీఐడీ అధికారులు ప్రశ్నించగా ఆమె స్పందించలేదు. మరోసారి విచారణ విచారణకు శైలజా కిరణ్ సహకరించకపోవడంతో ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేయాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఆమెకు అనుకూలంగా ఉన్న రోజే విచారించాలని భావిస్తున్నారు. ఈమేరకు త్వరలో మరోసారి నోటీసులు జారీ చేయనున్నారు. ఆ తరువాత రామోజీరావును కూడా మరోసారి విచారించాలని సీఐడీ భావిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించి... నిధులు కొల్లగొట్టి! మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ద్వారా చెరుకూరి రామోజీరావు, శైలజ భారీగా ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో ఆధారాలతో సహా వెల్లడైంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించి ఆర్థిక అక్రమాలను నిర్ధారించారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను సంబంధిత బ్రాంచీ కార్యాలయాలున్న నగరాలు/పట్టణాల్లోని జాతీయ బ్యాంకుల్లోనే జమ చేయాలి. అందుకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ రూ.వేల కోట్లను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి మళ్లించింది. చిట్‌ఫండ్స్ సంస్థలు తమ నిధులను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మాత్రం తమ చందాదారుల నిధులను అత్యంత మార్కెట్ రిస్క్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లోకి మళ్లించింది. తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో పెట్టుబడిగా పెట్టింది. చిట్‌ఫండ్స్ సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ చందాదారుల చిట్టీల మొత్తాన్ని పూర్తిగా వారికి ఇవ్వకుండా రశీదులిస్తూ 4 – 5 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అంటే అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తోంది. పెద్ద ఎత్తున నల్లధననాన్ని తమ సంస్థ ముసుగులో చలామణిలోకి తెస్తున్నట్లు కూడా సీఐడీ గుర్తించింది. గత డిసెంబర్ నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొత్త చిట్టీలు వేయడం లేదు. ఇప్పటికే దాదాపు రూ.400 కోట్ల టర్నోవర్ నిలిచిపోయింది. చందాదారుల సొమ్మును గుర్తుతెలియని సంస్థల్లో పెట్టుబడిగా పెట్టింది. ఆ నిధులు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు. దీంతో చందాదారులకు చిట్టీల మొత్తం చెల్లించలేకపోతోంది. -
పూజల పేరుతో దొంగస్వామి మోసం.. మహిళకు మాయమాటలు చెప్పి
సాక్షి,గుంటూరు: ఇంట్లో దేవుడి ఫొటోలు కాలిపోవటంతో ఓ మహిళ దొంగస్వామిని ఆశ్రయించింది. ఈ క్రమంలో మహిళకు మాయమాటలు చెప్పిన దొంగస్వామి ఆమె వద్ద రూ.13 లక్షలు వసూలు చేశాడు. కొన్ని రోజులు తర్వాత తాను మోసపోయినట్టు మహిళ ఆలస్యంగా గుర్తించింది. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో దొంగస్వామి అనుచరుల నుంచి అట్రాసిటీ కేసు పెడుతామంటూ మహిళకు బెదిరింపులు మొదలయ్యాయి. బాధిత మహిళ గుంటూరు పోలీసులను ఆశ్రయించింది. చదవండి: ఓ మహిళా చిరుద్యోగి.. 20 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసి -
ఈతకు వెళ్లి నలుగురు మృత్యువాత
మానవపాడు/కర్నూలు: కృష్ణానదిలో సరదాగా ఈత కోసం వెళ్లిన వారు.. ప్రమాదవశాత్తు మునిగిపోయి మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడబోయి మరొకరు చివరికి నలుగురు మృతిచెందిన విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు శివారు మంగంపేటలో చోటుచేసుకుంది. కోదండాపురం ఎస్ఐ వెంకటస్వామి, స్థానికుల కథనం ప్రకారం.. ఇటిక్యాల మండలంలోని వల్లూరుకు చెందిన అన్నదమ్ములు ఇస్మాయిల్, ఇబ్రహింలు బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలు నగరంలోని వీకర్‌సెక్షన్ కాలనీకి వెళ్లి స్థిరపడ్డారు. వేసవిసెలవుల కావడంతో కుటుంబసభ్యులతో కలిసి మానవపాడు మండలంలోని బోరవెల్లిలో బంధువుల ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఈత కోసం మేనత్త కుమారుడైన ఇమాంతో కలిసి ఇస్మాయిల్ కుమారులు సమీర్(18), రియాన్(14), ఇబ్రహిం కూతుళ్లు ఆఫ్రిన్(17), నవసీన్ (13)తో పాటు మరో ఐదుగురు కలిసి ఆటోలో మంగంపేట శివారులో కృష్ణానదికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలో లోతు గమనించకుండా ముందుకు వెళ్లడంతో రియాన్ మునిగిపోగా.. ఆఫ్రిన్, నవసీన్ కాపాడటానికి వెళ్లగా.. ముగ్గురికీ ఈత రాకపోవడంతో గల్లంతయ్యారు. వెంటనే వీరిని కాపాడేందుకు వెళ్లిన సమీర్ సైతం నీటిలో మునిగిపోయాడు. నలుగురు గల్లంతవడంతో ఇమాం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మత్స్యకారుల సహాయంతో మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. విగతా జీవులుగా పడి ఉన్న పిల్లలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
అమ్మానాన్న క్షమించండి!
కర్నూలు: ‘‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. మీరు చెప్పిన మాట విననందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నా గురించి బాధ పడకండి.. తమ్ముడు, చెల్లి గురించి ఆలోచించండి.. ధైర్యంగా ఉండండి.. నా చావుకు కారణం వినోద్ అలియాస్ ప్రవీణ్‌కుమార్, అతని తల్లిదండ్రులు లక్ష్మీదేవి, బక్కన్న, బావ శోభన్, బాబాయి మధుబాబు, మరో ఐదుగురు మేనత్తలు’’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్నూలు పీవీ నరసింహారావు నగర్‌కు చెందిన మధు, శేఖమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. మధు..బి.క్యాంప్‌లోని దిన్నెదేవరపాడుకు వెళ్లే రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంటీన్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తన కుమార్తె పద్మావతిని బీకామ్ కంప్యూటర్స్ చదివించారు. ఈ యువతి కర్నూలులోని ఓ షోరూమ్‌లో పనిచేస్తుండగా నందికొట్కూరు మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌తో ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొంతకాలానికి వినోద్‌కుమార్ అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమకు బదిలీపై వెళ్లాడు. ఇద్దరూ కలసి వివాహం చేసుకోవాలనుకున్నారు. మార్చి 9వ తేదీన వీరికి నిశి్చతార్థం జరిగింది. జూన్ 10వ తేదీన పెళ్లి వేడుకలు జరిపించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించి పత్రికలు కూడా పంచుకున్నారు. అయితే పద్మావతి వయసు తనకంటే పెద్దదని తర్వాత తెలుసుకుని జూపాడుబంగ్లా పీఎస్‌లో వినోద్ కుమార్ ఫిర్యాదు చేసి మే 29వ తేదీన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో పద్మావతి కుటుంబ సభ్యులు కూడా దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు కుటుంబాలను కౌన్సెలింగ్‌కు రావలసిందిగా పోలీసులు సూచించగా సోమవారం తెల్లవారుజామున పద్మావతి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు కనుక్కొని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక కొద్దిసేపటికే పద్మావతి మృతిచెందింది. నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.2 వేల నోట్ల మార్పిడి పేరిట టోకరా
సాక్షి,దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ నగరంలో రూ.2 వేల నోట్ల మార్పిడి పేరిట రూ.60 లక్షలతో ఉడాయించిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. విశాఖకు చెందిన ధర్మరాజు అనే వ్యక్తి రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువైన రూ.2 వేల నోట్లు ఇస్తామంటూ తనకు తెలిసిన వారిని నమ్మించాడు. విషయం తెలుసుకున్న భీమిలికి చెందిన ఎం.రామారావు అనే వ్యక్తి తన స్నేహితుల ద్వారా విజయవాడ నుంచి రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు తెప్పించారు. వాటిని భీమిలికి చెందిన కొయ్య అప్పలరెడ్డి సహాయంతో శనివారం సాయంత్రం గొల్లలపాలెం ఎస్బీఐ బ్యాంక్ వద్దకు వెళ్లి.. అప్పటికే అక్కడకు చేరుకున్న ధర్మరాజు, అతని స్నేహితులు కాకినాడకు చెందిన ఎండీ అహ్మద్, సునీల్ అలియాస్ చిన్నాను కలిశారు. నగదు మారుస్తామని చెప్పిన ధర్మరాజు, అతని స్నేహితులు అహ్మద్, సునీల్ కలిసి రామారావు నుంచి రూ.60 లక్షలు తీసుకుని మోటార్ సైకిల్‌పై ఉడాయించారు. వారి కోసం వెతికినా కనిపించకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి రామారావు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు గంట వ్యవధిలోనే ధర్మరాజుతో పాటు అతని గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకుని రూ.60 లక్షలు రికవరీ చేశారు. ఈ గ్యాంగ్ వెనుక ఉన్న సూత్రధారులెవరు, ఎంతమందిని మోసం చేశారనే విషయాలపై పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇదే తరహాలో రాజమండ్రిలో కూడా ఒక కేసు నమోదైనట్టు తెలుస్తోంది. చదవండి: Tanguturi Prakasam Pantulu: పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం.. పూలకు బదులు పండ్లు తెస్తే తినేవాడినంటూ -
ఒంగోలు: బ్యాంకులో కాల్పుల కలకలం.. సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య
సాక్షి ప్రకాశం: ఒంగోలులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోర్టు సెంటర్లోని యూనియన్ బ్యాంక్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఎం. వెంకటేశ్వర్లు(35) తుపాకీతో తనను తానే కాల్చుకుని మృతిచెందాడు. దీంతో, ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. యూనియన్ బ్యాంక్‌లో వెంకటేశ్వర్లు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అయితే, సోమవారం విధుల్లో ఉండగా.. బ్యాంక్‌లోని రూమ్‌లోకి వెళ్లి గన్‌తో తనను తానే కాల్చుకున్నాడు. ఈ క్రమంలో పెద్ద శబ్ధం రావడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే వెళ్లి చూడగా వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడిఉన్నాడు. దీంతో, బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇక, చీమకుర్తికి చెందిన వెంకటేశ్వర్లు కొంతకాలంగా యూనియన్ బ్యాంకులో సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్నాడు. వెంకటేశ్వర్లు కుటుంబం ఒంగోలు రామ్‌నగర్‌లోని 8వ లైన్లో నివాసం ఉంటోంది. ఏడేళ్ల క్రితం ఉమామహేశ్వరితో వెంకటేశ్వర్లకు వివాహం జరిగింది. వీరికి సంతానం లేనట్టు తెలుస్తోంది. కాగా, వెంకటేశ్వర్ల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: విషాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు మృతి.. కారణం ఇదే.. -
రెండు నిమిషాల్లో ఇంటికి చేరేలోపే ఘోరం
అన్నమయ్య : మదనపల్లె నుంచి పీలేరుకు 50 కిలోమీటర్లుపైగా క్షేమంగా పయనించి... రెండు నిమిషాలు ఆగితే ఇంటికి చేరుతారనగా.. ఇంతలోనే కర్ణాటక ఆర్టీసీ బస్సు రూపంలో ఆ ఇద్దరినీ మృత్యువు కబళించింది. పీలేరు పట్టణం కొండారెడ్డిసర్కిల్ వద్ద టాటాఏఎస్ – కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇర్షాద్, విజయకుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ► పీలేరు పట్టణంలోని సరోజినీదేవి వీధికి చెందిన ఇర్షాద్ (27)కు భార్య రోషిణి తోపాటు కుమారుడు అమాన్, కుమార్తె ఫిదా ఉన్నారు. టాటాఏస్ వాహనం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇర్షాద్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు, మున్నీరుగా విలపించారు. రోషిణిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ► పీలేరు పట్టణం ఇందిరమ్మకాలనీకి చెందిన విజయకుమార్ (50) టాటాఏస్కు కూలీగా వెళుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య చిట్టెమ్మ, కుమారుడు శివనాగరాజు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న విజయకుమార్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
అన్నమయ్య: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పీలేరులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. వివరాల ప్రకారం.. పీలేరులోని ఎంజేఆర్ కాలేజీ వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, తుఫాన్ వాహనం నంద్యాల నుంచి తిరువన్నమలైకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది కూడా చదవండి: ‘జయలక్ష్మి’ ఆస్తుల సీజ్‌కు రంగం సిద్ధం -
ఇంటిముందు మృతదేహం, డబ్బు, లేఖ
పుల్లలచెరువు/యర్రగొండపాలెం: ఒక యువకుడి మృతదేహాన్ని కొందరు వ్యక్తులు కారులో తీసుకొచ్చి అతడి ఇంటిముందు పడేసి వెళ్లిన సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో సంచలనం కలిగించింది. మృతదేహంతోపాటు రూ.35 వేలు, క్షమాపణ లేఖ ఉంచి వెళ్లారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. మృతుడు ఉప్పు శ్రీను (35) భవన నిర్మాణ పనుల్లో కూలీగా చేస్తుంటాడు. పనుల కోసం ముఠావాళ్లతో చెన్నై, తెలంగాణ, ఇతర దూర ప్రాంతాలకు వెళుతుంటాడు. 10 రోజుల కిందట పనులకు చెన్నై వెళ్లాడు. అతడికి నయంకాని వ్యాధి ఉన్నట్లు గుర్తించిన భార్య పిల్లలను తీసుకుని రెండేళ్ల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కొందరు వ్యక్తులు తెల్లటి కారులో శ్రీను మృతదేహాన్ని తీసుకొచ్చి అతడి ఇంటిముందు పడేసి వెళ్లారు. మట్టి ఖర్చులకు రూ.35 వేలు, క్షమాపణ లేఖ అక్కడ ఉంచి వెళ్లారు. ఆ లేఖలో ‘అమ్మా.. పనిచేసే ప్రదేశంలో అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈ క్రమంలో మీ అబ్బాయి చనిపోయాడు. మాకు దెబ్బలు తగిలాయి. తల్లి శోకం తీర్చలేనిదని మాకు తెలుసు. కానీ ఏమీచేయలేక పోయాం. మీ అబ్బాయి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.35 వేలు ఇస్తున్నాం. అమ్మా క్షమించండి..’ అని రాసి ఉంది. ఈ లేఖను బట్టి భవన నిర్మాణ పనులు జరిగే సమయంలో తోటి కూలీలతోపాటు శ్రీను కిందపడి ఉంటాడని, ఈ నేపథ్యంలో అతను చనిపోగా మరికొందరికి దెబ్బలు తగిలి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని అప్పజెప్పే తరుణంలో గ్రామస్తులు తమపై దాడిచేసే అవకాశం ఉందని, పోలీసు కేసులు అవుతాయనే భయంతో ఇంటిముందు పడేసి వెళ్లి ఉండవచ్చని అనుకుంటున్నారు. మృతుడి ఇంట్లో దొరికిన మందులు, పరీక్షల రిపోర్టును బట్టి అతనికి నయంకాని వ్యాధి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సీఐ కె.మారుతీకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ వై.శ్రీహరి దర్యాప్తు చేస్తున్నారు. -
కొవ్వూరులో దారుణం.. సిలిండర్‌తో అత్తమామలపై అల్లుడి దాడి
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అత్తమామలపై అల్లుడు విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఐదు కేజీల గ్యాస్ బండతో అత్తమామలను చితకబాదాడు. దీంతో మామ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. తీవ్ర గాయాల పాలైన అత్తను స్థానికుల సహాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న కొవ్వురు డీఎస్పీ వీఎస్ వర్మ, సీఐ వైవీ రమణ..సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అల్లుడి దాడిలో మృతిచెందిన మామను రాయంకుల శ్రీరాకృష్ణగా, గాయాలైన అత్త బేబీ(61)గా గుర్తించారు. అల్లుడిని దొమ్మేరుకు చెందిన నందిగం గోపి(42)గా తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: విధి అంటే ఇదేనేమో.. స్వగ్రామానికి వస్తూ అనంతలోకాలకు.. -
రెండు నెలల కిందటే వివాహం.. మృత్యువు దారి కాచి మరీ వరుడిని మింగేసింది...
ఆ నవ వధువు కలలన్నీ ఛిద్రమైపోయాయి. ఆ కుటుంబంలోని ఆనందమంతా ఆవిరైపోయింది. చదువు, ఉద్యోగం, వివాహం అంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన ఆ యువకుడి జీవితం అక్కడితోనే ముగిసిపోయింది. కొల్లవానిపేట రైల్వేగేటు వద్ద కాపు కాచిన మృత్యుదేవత నవ వరుడిని తనతో తీసుకెళ్లిపోయింది. రెండు నెలల కిందటే వివాహం చేసుకున్న ఆ యువకుడి మృతితో కుటుంబం తల్లడిల్లిపోయింది. నరసన్నపేట: చక్కగా చదువుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. మరో ఉద్యోగినితో వివాహం జరిగింది. ఇక జీవితమంతా హాయిగా కలిసి బతక వచ్చని ఆశ పడిన ఆ వధూవరులపై విధి పగబట్టింది. మృత్యువు దారి కాచి మరీ వరుడిని మింగేసింది. నరసన్నపేట మండలం కామేశ్వరిపేటలో సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మట్ట సోమేశ్వరరావు (28) కొల్లవానిపేట రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం 10.20 గంటల సమయంలో యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదు నిమిషాల్లో కామేశ్వరిపేట చేరుకుంటాడనగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని బలగకు చెందిన మట్ట శ్యామలరావు కుమారుడు సోమేశ్వరరావు చక్కగా చదువుకున్నాడు. సచివాలయంలో ఇంజినీరింగ్ సహాయకుడిగా ఉద్యోగం వచ్చింది. మంచి సంబంధం రావడంతో రెండు నెలల కిందటే వివాహం చేశారు. ఆమె కూడా రణస్థలం మండలంలోని సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ లాగానే సోమేశ్వరరావు బుధవారం తన బండిపై కామేశ్వరిపేటలోని సచివాలయానికి బయల్దేరాడు. దారిలో కొల్లవానిపేట వద్ద గేటు వేశారు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు సోమేశ్వరరావు ప్రాణాలు తీశాయి. గేటు లేవడంతోనే.. సరిగ్గా ఉదయం 10.16కు కొల్లవానిపేట గేటు వేసి ఉంది. రెండు వైపులా వాహనాలు నిలిచి ఉన్నాయి. ఆమదాలవలస నుంచి తిలారు వైపునకు గూడ్స్ ట్రైన్ వెళ్లింది. ఆ రైలు వెళ్లగానే గేటు లేచింది. దీంతో కొల్లవానిపేట నుంచి ఒక కారు, ఆటో గేటు లోపలికి వచ్చాయి. సోమేశ్వరరావు కూడా తన బండితో ముందుకు కదిలాడు. అంతే.. అదే ట్రాక్‌పై ఊహించని వేగంతో వచ్చిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సోమేశ్వరరావును అమాంతం ఢీకొట్టింది. ఆ ధాటికి అతడి శరీరం తునాతునకలైంది. రైలు పట్టాలన్నీ రక్తంతో తడిచిపోయాయి. క్యారేజీ, హెల్మెట్ ఇలా ఆ యన వస్తువులన్నీ చాలాదూరం ఎగిరిపడ్డాయి. అయితే తమ కళ్ల ముందే ప్రమాదం జరగడంతో గే టు వద్ద ఉన్న వాహనదారులు నిశ్చేష్టులైపోయారు. రెప్పపాటులో తాము ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రత్యక్ష సాక్షులు వేళాల రమేష్, ఆర్.రామకృష్ణ, పుల్లట వెంకటరమణ తెలిపారు. ఆటోలో పది మంది, కారులో నలుగురు ఉన్నారని, వెంట్రుక వాసిలో వీరు ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పారు. కన్నీరుమున్నీరు.. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇలా దుర్మరణం పాలవ్వడంతో మృతుని తల్లిదండ్రులు శ్యామలరావు, సరస్వతిలు కన్నీరుమున్నీరయ్యారు. అతని సోదరి గౌతమి కూడా తల్లడిల్లిపోయింది. సోమేశ్వరరావు భార్య జయశ్రీ వేదన చూసి అంతా కన్నీరుపెట్టుకున్నారు. నన్ను వదిలి వెళ్లిపోయావా అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. కేసు నమోదు.. ఈ ప్రమాదంలో సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని ఆమదాలవలస రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆమదాలవలస స్టేషన్ మాస్టర్ రాజశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి ఏ ఎస్ఐ చిట్టిబాబు, హెచ్‌సీ మధుసూదనరావు వచ్చా రు. రైల్వేగేట్‌మెన్ మధుపర్ మిశ్రో నుంచి వివరణ తీసుకున్నామని, ప్రమాదవశాత్తు జరిగినట్లు కేసు నమోదు చేశామన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ సోమేశ్వరరావు మృతిపై నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ, ఎంపీడీఓ మదుసూదనరావు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు మోహనరావు, ఉదయ భాస్కర్, పంచాయ తీ కార్యదర్శుల సంఘం మండల విభాగం అధ్యక్షు డు ముకుందరావు, వెల్ఫేర్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులు దివ్య, కామేశ్వరిపేటకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు వాకముళ్లు చక్రధర్, జోగినాయుడులు సంతాపం వ్యక్తం చేశారు. -
dangerous snake: పాముకాటుతో యువకుడి మృతి
సరుబుజ్జిలి: మండలంలోని బురిడివలస కాలనీకి చెందిన కొల్ల దుర్గారావు(25) సోమవారం అర్థరాత్రి నాగు పాముకాటుకు గురై మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. దుర్గారావు సవళాపురం జంక్షన్ బ్రిడ్జి వద్ద చల్లగాలికి కూర్చొని, నిద్రించేందుకు తన ఇంటికి వెళుతుండగా చీకట్లో నాగు పాముకాటు వేసింది. వైద్యుల వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడు. దుర్గారావుకు తండ్రి కొల్ల సింహాచలం, వీరమ్మ ఉన్నారు. -
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
గుంతకల్లు రూరల్: ఆ ఇద్దరూ ప్రాణస్నేహితులు.. ప్రతి పనినీ కలిసే చేసేవారు.. ఎక్కడికై నా కలిసే వెళ్లేవారు. చివరికి మృత్యువులోనూ వారు స్నేహం వీడలేదు. వివరాలు... గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన ఉరుకుందప్ప, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వీరన్న (26), అదే గ్రామానికి చెందిన రాము, మహాలక్ష్మి దంపతుల కుమారుడు రవీంద్ర (25) ఇటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వీరన్నకు కృపాకుమారితో వివాహం కాగా, 6, 4 సంవత్సరాల వయసున్న ఇద్దరు బిడ్డలున్నారు. ఆరు నెలల క్రితం లక్ష్మి అనే యువతితో రవీంద్రకు వివాహమైంది. వీరన్న, రవీంద్ర ఒకే గ్రామానికి చెందిన వారే అయినా.. ఆటోడ్రైవింగ్ ద్వారానే ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారారు. కొంత కాలం క్రితం ఇద్దరూ అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య పరీక్షల అనంతరం గుండె సంబంధిత వ్యాధితో వీరన్న, షుగర్, బీపీతో రవీంద్ర బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఇద్దరూ మద్యానికి బానిసయ్యారు. దీంతో వారి ఆరోగ్యం మరింత క్షీణించింది. పది రోజుల క్రితం ఆయాసం ఎక్కువ కావడంతో వీరన్నను కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. రవీంద్ర ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడంతో కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో మంగళవారం తెల్లవారుజాము 5 గంటలకు రవీంద్ర, 5.30 గంటలకు వీరన్న మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలను కుటుంబసభ్యులు గ్రామానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
బాత్రూమ్ సింక్‌లో మత్తు ఇంజక్షన్లు.. మిస్టరీగా యువతి మృతి!
సాక్షి,విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా అచ్యుతపురంలో దారుణం చోటు చేసుకుంది. లాడ్జిలో మహాలక్ష్మి అనే యువతి అనుమానాస్పద మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. మహాలక్ష్మి శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు ఉండడం, ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల బట్టి ఈ మృతి పలు అనుమానాలకు తావు తీస్తోంది. వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌కుమార్ అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో రూం తీసుకుని అక్కడికి మహాలక్ష్మిని రప్పించారు. ఈ క్రమంలో ఇద్దరూ కత్తితో కోసుకున్న గాయాలతో కనిపించేసరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అనుకున్న లాడ్జి సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. అయితే, పథకం ప్రకారమే మహాలక్ష్మిని శ్రీనివాస్ హత్య చేశాడని, కేసు నుంచి తప్పించుకోవడానికే ఈ డ్రామా ఆడాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో యువతి మృతి మిస్టరీగా మారింది. పోలీసులు ఈ కేసును హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ ఇంటర్ నుంచి ప్రేమించుకుని కొద్ది నెలల క్రితం వరకు రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో వీరువురూ దూరంగా ఉంటున్నారు. శ్రీనివాస్ మహాలక్ష్మితో మాట్లాడాలని చెప్పి లాడ్జికి రప్పించాడు. ఆ తర్వాత వారి మధ్య ఏం జరిగిందో గానీ యువతి మృతి చెందగా.. శ్రీనివాస్ కత్తి గాయలతో ఉన్నాడు. పోలీసులు జరిపిన తనిఖీలో లాడ్జి గదిలోని బాత్రూం సింక్‌లో మత్తు ఇంజక్షన్లు ఉండగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది! -
కోడి దొంగతనంపై గొడవ..హత్యాయత్నం.. అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు
అమలాపురం టౌన్: భార్యాభర్తలపై హత్యాయత్నం చేయడమే కాకుండా భార్యపై అత్యాచారం చేసిన నేరం రుజువు కావడంతో పి.గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేటకు చెందిన పచ్చిమాల శ్రీనివాసరావుకు రాజమహేంద్రవరంలోని జిల్లా 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పీఆర్ రాజీవ్ పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. ముద్దాయికి రూ.5 వేల జరిమానా కూడా విధించారు. అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం జనవరి నెలలో ఊడిమూడి శివారు చింతావారిపేటలో తమ సొంత ఇంట్లో భార్యాభర్తలు నివసిస్తున్నారు. అదే ఇంట్లో ఓ పోర్షన్లో ఉంటున్న పచ్చిమాల శ్రీనివాసరావు హత్యాయత్నం, అత్యాచారం కేసుల్లో నిందితుడు. కోడి దొంగతనంపై జరిగిన విషయమై ఆరా తీసిన భర్తపై కోపంతో పచ్చిమాల శ్రీనివాసరావు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. తొలుత భర్త తలపై సన్నికల్లు పొత్రంతో కొట్టి తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా భార్యను కూడా తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. ఇదే సందర్భంగా ఆమైపె అత్యాచారం కూడా చేశాడన్నది ముద్దాయి శ్రీనివాసరావుపై అభియోగం. అప్పట్లో ఈ కేసులకు సంబంధించి శ్రీనివాసరావుపై పి.గన్నవరం పోలీసు స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అప్పటి డీఎస్పీ వై.మాధవరెడ్డి సమగ్ర దర్యాప్తు చేసి బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా చార్జి షీటు నమోదు చేశారు. కోర్టులో సోమవారం జరిగిన తుది విచారణలో ముద్దాయి శ్రీనివాసరావుపై మోపిన నేరాలు రుజువు కావడంతో న్యాయమూర్తి రాజీవ్ పై విధంగా తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. ప్రత్యేక పర్యవేక్షణ వల్ల ఘటన జరిగిన నాలుగు నెలల్లోనే ముద్దాయికి శిక్షలు పడ్డాయని ఎస్పీ సుసరాపు శ్రీధర్ తెలిపారు. -
బడుగు జీవితాలపై మృత్యువు పంజా .. మృతులందరూ వరుసకు బావ బావ మరుదులు
యర్రగొండపాలెం(ప్రకాశం): బడుగు జీవితాలపై మృత్యువు పంజా విసిరింది. చేతి వృత్తుల్లో కాయకష్టం చేసుకొని ఏ పూటకు ఆ పూట కుటుంబాలను నెట్టుకొస్తున్న ఐదుగురిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తాము పడిన కష్టానికి ఫలితాన్ని తీసుకొస్తామని ఇంట్లో చెప్పి సుదూర ప్రాంతానికి వెళ్లిన ఆ యువకులు విగతజీవులుగా మారిన ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెల్లవారు జామునే ఇంటికి వస్తామని చెప్పిన వారి జీవితాలు తెల్లారిపోయాయి. మేదర పనులు చేసుకొని జీవించే ఐదుగురు యువకులు మృతి చెందడం విజయవాడలోని ప్రకాష్‌నగర్ కన్నీటి పర్యంతమైంది. మృతులందరూ వరుసకు బావ బావ మరుదులు. వారు కొబ్బరి ఆకులతో డెకరేషన్ మెటీరియల్ సప్లయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో డెకరేషన్ మెటీరియల్‌కు సంబంధించి తమకు రావాల్సిన డబ్బుల కోసం విజయవాడకు చెందిన తంబి రాజు, పిల్లి చంద్రశేఖర్, పిల్లి శ్రీను, గ్రంధి వెంకటసాయి, కొయన రాజు, భవాని శంకర్ ఈ నెల 27వ తేదీన కారులో అనంతపురం వెళ్లారు. మరుసటి రోజు ఆదివారం మధ్యాహ్నం కారులో విజయవాడకు తిరుగు పయనమయ్యారు. రాత్రి 10.30 గంటల సమయంలో త్రిపురాంతకం ఊరి వెలుపల ఉన్న జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుంచి దిగుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. వాస్తవంగా హిందూపురం వెళ్లే ఈ బస్సు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చి అక్కడి నుంచి నేరుగా వెళ్లాల్సి ఉంది. అయితే త్రిపురాంతకానికి సంబంధించిన ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో గమ్యానికి తొందరగా చేరుకోవటానికి డ్రైవర్ ఆ బస్సును ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైకి మళ్లించాడు. అనుకోకుండా ఎదురైన ఈ బస్సును కారు ఢీకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో తంబి రాజు, పిల్లి చంద్రశేఖర్, పిల్లి శ్రీను, గ్రంధి వెంకటసాయి, కొయన రాజు మృతి చెందగా, భవానీశంకర్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో తన అన్న వెంకటసాయి ఫోన్‌చేసి తెల్లారేలోపు ఇంటికి చేరుతామని చెప్పాడని, గంటన్నర తరువాత వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలిసిందని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశాడు. శివనాగేంద్ర, సింహాచలం కూడా ఆ కారులో ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే వేరే పనుల నిమిత్తం వారు అనంతపురం వెళ్లలేదు. దీంతో వారు ప్రమాదం బారినపడలేదు. వీధిన పడిన చిన్న కుటుంబాలు తంబి రాజు, పిల్లి చంద్రశేఖర్, పిల్లి శ్రీను, గ్రంధి వెంకటసాయి, కొయన రాజు మృతితో వారి కుటుంబాలు వీధినపడ్డాయి. తంబి రాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అన్నతోపాటు కాయకష్టం చేసుకొని జీవనం సాగిస్తు న్నాడు. అతనికి భార్య మంగ ఉంది. రాజు మృతితో మంగ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పల్లి చంద్రశేఖర్‌కు వివాహం కాలేదు. అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు జానకిరాం, శారద అతనిపై ఆధారపడి జీవిస్తున్నారు. చేతికి అందొచ్చిన కుమారుడు ఇకలేడని తెలుసుకున్న జానకిరాం, శారద తల్లడిల్లిపోతున్నారు. పిల్లి శ్రీనుకు భార్య సత్య, ఎనిమిదేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అతని తల్లిదండ్రులు మహేష్, లక్ష్మిలు సైతం వైర్ కుర్చీలు అల్లుకుంటూ వచ్చిన అరకొర డబ్బులతో కుమారుడి సంపాదనను తోడు చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. శ్రీను మృతితో కుటుంబ సభ్యులు భోరు మంటున్నారు. గ్రంధి వెంకటసాయికి భార్య విజయ, తల్లిదండ్రులు మహాలక్ష్మి, దాలయ్య ఉన్నారు. అల్లకం పనులు చేసుకుంటూ అతని కుటుంబం జీవనం సాగిస్తోంది. విజయవాడలోని ఆస్పత్రిలో మృతి చెందిన కొయన రాజుకు భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. తన భర్త ఇక రాడని తెలిసిన మృతుడి భార్య కన్నీటి పర్యంతమైంది. అతని రెండేళ్ల కుమారుడు కూడా నాన్న.. నాన్న అంటూ గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. వినుకొండ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న ఆరి భవానీ శంకర్‌కు వివాహం కాలేదు. -
కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది!
సాక్షి, పత్తికొండ రూరల్ (కర్నూలు): అనారోగ్యంతో చనిపోయిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన ఉదంతమిది. ఈ హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ మురళీమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పత్తికొండలోని తేరు బజారులో మెడికల్ షాపు నిర్వహిస్తున్న హరికృష్ణప్రసాద్ (63)కు భార్య లలితమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కన్నబిడ్డలకు ఎలాంటి లోటులేకుండా పెంచిపెద్ద చేసి ఉన్నత చదువులు చదివించారు. ఇద్దరికీ పెళ్లిళ్లు కూడా చేశారు. పెద్ద కుమారుడు దినేష్ ఎంబీబీఎస్ పూర్తి చేసి కర్నూలులోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ అక్కడే భార్యతో కాపురం ఉంటున్నారు. రెండో కుమారుడు ముఖేష్ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల కిందట హరికృష్ణ ప్రసాద్‌కు పార్కిన్సస్ ప్లస్ వ్యాధి సోకింది. మరికొన్ని రోజులకు పక్షవాతంతో కాళ్లు చేతులు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమయ్యాడు. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని దయనీయ స్థితిలో ఉన్న అతనికి భార్య లలితమ్మ సపర్యలు చేస్తూ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మూడేళ్ల నుంచి కర్నూలులో కుమారుడు దినేష్ వద్దే దంపతులిద్దరూ ఉన్నారు. రెండు వారాల క్రితం ఇద్దరూ పత్తికొండకు చేరుకున్నారు. కాగితాలు.. చీరలు వేసి నిప్పు కాగా, సోమవారం వేకువజామున భర్త హరికృష్ణప్రసాద్‌కు భార్య లలితమ్మ కాలకృత్యాలు తీర్చింది. ఆ తరువాత కొద్దిసేపటికి విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి గుండె పగిలేలా రోదించింది. ఆ తరువాత తేరుకుని టెంకాయ కొట్టి.. మృతదేహంపై ఇంట్లోని పుస్తకాలు చింపి కాగితాలు, చీరలు వేసి నిప్పు పెట్టింది. ఆ తరువాత పెద్దకుమారుడు దినేష్‌కు వీడియో కాల్ చేసి విషయం చెప్పింది. ఆ ఇంట్లోంచి పొగలు రావడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ మురళీమోహన్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకోగా.. అప్పటికే మృతదేహం పూర్తిగా కాలిపోయింది. లలితమ్మ మానసిక పరిస్థితి సరిగా లేదని సీఐ తెలిపారు. ఇంట్లోనే మృతదేహం కాల్చిన ఘటన దావానలంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల కాలనీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కంటికిరెప్పలా కాపాడుకుంటూ ఇన్నేళ్లు సపర్యలు చేసిన ఆమె భర్త మృతదేహాన్ని ఇంట్లోనే కాలి్చవేసిందంటే నమ్మలేకపోయారు. లలితమ్మ నిత్యం దైవారాధనలో ఎక్కువగా గడిపేదని కాలనీవాసులు తెలిపారు. నోట మాట రాలేదు అమ్మ ఉదయం 9.30 గంటలకు ఫోన్ చేసింది. ‘నాన్న చనిపోయాడు. ఇంట్లోనే దహన సంస్కారాలన్నీ పూర్తి చేశాను. మీరేం రాకండి’ అని చెప్పింది. ఆ మాట విని షాక్‌కు గురయ్యాను. వెంటనే పోలీసులకు సమాచారం అందజేసి పత్తికొండ చేరుకున్నాను. ఇంట్లోకి వెళ్లగా కాలిన నాన్న మృతదేహం చూసి నా నోట మాట రాలేదు. అమ్మ పూర్తిగా డిప్రెషన్‌కు గురైంది. అమ్మ దగ్గరకు వెళ్లి ఓదార్చాను. కెనడాలో ఉన్న తమ్ముడు ముఖేష్‌కు ఫోన్ చేశాను. వెంటనే బయల్దేరి వస్తున్నానని చెప్పాడు. – దినేష్, పెద్ద కుమారుడు చదవండి: Delhi: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
ప్రకాశం: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్త్క్షి, త్రిపురాంతకం: జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలోని హైవేపై ఆదివారం రాత్రి 10.15 సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీ బస్సు వినుకొండ వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన సాయి(26), పిల్లి శ్రీనివాస్(23), చంద్రశేఖర్ (25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హైవే అంబులెన్స్, 108లో వినుకొండకు తరలించారు. మార్గంమధ్యలో శకంర్ (24) మృతిచెందాడు. అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్ కోసం వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఎస్సై జీవీ సైదులు తెలిపారు. ఇది కూడా చదవండి: కోటిపల్లి రైల్వేలైన్‌కు కదలిక -
AP: జాబ్ పేరుతో నిరుద్యోగులకు టోకరా.. వీఆర్వో రేఖ అరెస్ట్
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులను టార్గెట్ చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన మహిళా వీఆర్వోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన విజయవాడ పరిధిలో చోటుచేసుకుంది. నిరుద్యోగులకు ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సదరు మహిళ డబ్బులు వసూలు చేసింది. వివరాల ప్రకారం.. వీఆర్వో రేఖ కొంత మందితో కలిసి నిరుద్యోగులకు టోకరా వేసింది. ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడింది. ఈ క్రమంలో నిరుద్యోగుల నుంచి రూ.3లక్షల నుంచి రూ.8లక్షల చొప్పున వసూలు చేసింది. దీంతో, ఉద్యోగాల విషయమై ఆమెను ప్రశ్నించడంతో ముఖం చాటేసింది. ఈ నేపథ్యంలో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. సూర్యారావుపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక, బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: పెళ్లింట తీవ్ర విషాదం.. వరుడు సహా అక్కాచెల్లి మంటల్లో సజీవ దహనం -
మళ్లీ ఆడపిల్ల పుట్టిందని.. అమ్మేశారు !
పశ్చిమ గోదావరి: మూడో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టడంతో ఏం చేయాలో తెలియక ఆడ శిశువును వేరొకరికి మధ్యవర్తి ద్వారా విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం ఓగిరాల తండాకు చెందిన వడిత్యా మూర్తి, వసుంధర దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూర్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతేడాది నవంబరులో వసుంధరకు మూడో కాన్పులో కూడా స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆడపిల్ల జన్మించింది. మూడు రోజుల అనంతరం మధ్యవర్తి ద్వారా తణుకు సమీపంలోని దువ్వకు చెందిన పిల్లలు లేని దంపతులకు ఆడపిల్లను తండ్రి మూర్తి ఇచ్చేశాడు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన కుమార్తె కోసం తల్లి వసుంధర మనోవ్యధకు గురై భర్తను మన కూతురును తీసుకురమ్మంటూ రోజూ అడుగుతోంది. ఈ క్రమంలో ఈ విషయం ఆనోటా ఈనోటా పడి చైల్డ్‌లైన్ వారి దృష్టికి చేరింది. దీంతో వారు ఐసీడీఎస్ అధికారులకు ఈ నెల 17న సమాచారమిచ్చి విచారించమని చెప్పగా, నూజివీడు సీడీపీఓ ఎస్‌వై నూరాణి విచారించి నివేదికను చైల్డ్‌లైన్ నిర్వాహకులకు ఈ నెల 18న పంపారు. ఈ విషయంపై అదేరోజు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చైల్డ్‌లైన్ వారు ఏలూరులోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలపగా, వారు శిశువుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పెంచుకుంటున్న తల్లిదండ్రులను పిలిపించి విచారించారు. అనంతరం శిశువును నాలుగు రోజుల క్రితమే స్వాధీనం చేసుకొని శిశుగృహంలో ఉంచారు. పూర్తిస్థాయిలో విచారించిన తరువాత శిశువును ఎవరికి ఇవ్వాలి, లేదా ప్రభుత్వ సంరక్షణలో ఉంచాలా అనే విషయాన్ని నిర్ణయించనున్నారు. ఇటు పోలీసుల విచారణలో గాని, అటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్వహించిన విచారణలో గాని తాము బిడ్డను విక్రయించలేదని, పిల్లలు లేరని పెంచుకుంటామంటే ఇచ్చామని చెబుతున్నారు. అమ్మినవారిపైన, కొన్నవారిపైన చర్యలు తీసుకుంటాం శిశువులను అమ్మడం, కొనడం చట్టప్రకారం నేరం. ఈ కేసును సమగ్రంగా విచారిస్తున్నాం. విచారణలో తేలిన అంశాలను బట్టి అమ్మినవారిపైన, కొన్నవారిపైన చర్యలు తీసుకుంటాం. – ఈడే అశోక్‌కుమార్ గౌడ్, డీఎస్పీ, నూజివీడు -
దారుణం: ఒక ఇంట్లో రెండేళ్లపాప నాన్నను ఇంకెపుడు చూడలేదు.. మరో ఇంట్లో
సాక్షి, మందస/పర్లాకిమిడి (శ్రీకాకుళం): ఒక ఇంటిలో తండ్రి కోసం ఎదురుచూస్తు న్న రెండేళ్ల పసిపాప ఇంకెప్పుడూ నాన్నను చూడ లేదు. అమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాన్న చేయి పట్టుకునే భాగ్యం ఇక లేదు. మరో ఇంటిలో కుటుంబానికి దిక్కుగా ఉండాల్సిన యువకుడు ఊపిరి వదిలేశాడు. ఇంకో ఇంటిలో పెళ్లి నవ్వుల బదులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఒక్క ప్రమాదం.. ఇన్ని కుటుంబాల్లో విషాదానికి కారణమైంది. ఒడిశాలోని గారబంద పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుకల హరీష్ (32), బొడ్డపాటి తులసీదాసు(25)లు మృతి చెంద గా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరికి 17వ తేదీన పెళ్లి నిశ్చయమైంది. వివరాల్లోకి వెళితే.. మందస మండలంలో ని మూలిపాడు గ్రామానికి చెందిన పి.శివకుమార్ ఆర్మీ లో పని చేస్తున్నారు. ఆయనకు ఒడిశాలోని బీఎస్ పు రం గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 17న వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో శివకు మార్ వధువు ఇంటికి వెళ్లడానికి తన స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన వలంటీర్ హరీష్‌తో బైక్‌పై బయల్దేరాడు. ఒడిశాలోని గారబంద పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ వీరి బండిని బలంగా ఢీకొట్టింది. ఘటనలో హరీష్ అక్కడికక్కడే మృతి చెందారు. శివకుమార్‌కు తీవ్ర గాయా లయ్యాయి. వీరి బండిని ఢీకొట్టిన బైక్‌పై ఉన్న బొడ్డపాటి తులసీదాసు కూడా ప్రమాద స్థలంలోనే ఊపిరి వదిలేశాడు. ఆయన వెనుక ఉన్న గోకర్ణపు రం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గారబంద పోలీసులకు సమాచారం అందించారు.చదవండి: (నాగసులోచనా నన్ను క్షమించు..!.. నేను బాధపడుతూ నిన్ను మరింత..) క్షతగాత్రులను పర్లాఖిముండి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గోకర్ణపురం గ్రామానికి చెందిన వ్యక్తిని అక్కడి నుంచి శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శివకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం మెడికల్ కాలేజీకి తరలించారు. మూలిపాడు సర్పంచ్ గుసిరి వెంకటరావు, మృతుడు హరీష్ సోదరుడు తెలుకల డొంబురు, తెలుకల సురేష్‌తో పాటు పలువురు సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. హరీష్‌కు దీవెన అనే రెండేళ్ల కుమార్తె ఉండగా, ఆయన భార్య బబిత ప్రస్తుతం ఏడునెలల గర్భిణి. ఈ సంఘటనతో మూలిపాడు గ్రామంలో విషా దం చోటు చేసుకుంది. -
సైకిల్‌ను తప్పించబోయి..
సాక్షి, శ్రీకాకుళం : మండలంలోని సందూరు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గిరిజన యువకుడు మరణించిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..మండలంలోని కొండలోగాం పంచాయతీ, బంసుగాం గ్రామానికి చెందిన సవర రాజేష్(24) అదే గ్రామానికి చెందిన తన స్నేహితులు రామారావు, చిన్నలతో కలిసి పలాస మండలంలోని గొప్పిలి గ్రామానికి వెళ్లి ఆదివారం రాత్రి తిరిగి వస్తున్నారు.వీరు మందస మండలంలోని సందూరు వద్దకు చేరుకోగా ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి బైక్ అదుపు తప్పడంతో రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో రాజేష్‌కు తీవ్ర గాయాలవ్వగా, మిగతా ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురునీ పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేష్ మరణించాడు. దీంతో ఒక్కగానొక్క కుమారుడు మరణిండంతో రాజేష్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని బంసుగాం తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మందస ఎస్ఐ చిట్టిపోలు ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.