breaking news
-
వాడు దీపును చంపాడు.. మాకు అప్పగించండి
అనకాపల్లి, సాక్షి: జిల్లాలోని కశింకోట మండలం బయ్యవరంలో మర్డర్ మిస్టరీ వీడింది. ఓ ట్రాన్స్‌జెండర్‌ను ప్రియుడే అతికిరాతకంగా హతమార్చిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోతున్న హిజ్రాలు పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. తమ స్నేహితురాలిని ముక్కలు చేసిన నిందితుడిని అప్పగించాలంటూనాందోళన చేపట్టారు.దీపు అనే ట్రాన్స్‌జెండర్‌ను ఆమె ప్రియుడు బన్నీ దారుణంగా హతమార్చాడు. ఆ శరీర భాగాలను వేరు చేసి బెడ్‌షీట్‌లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేశాడు. ఈ ఘోరం స్థానికంగా కలకలం రేపింది. శరీర భాగాలను సేకరించిన పోలీసులు.. చివరకు మృతదేహం నాగులపల్లికి చెందిన దిలీప్ అలియాస్ దీపు అనే హిజ్రాగా గుర్తించారు. అనంతరం ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. బన్నీతో రీకన్స్ట్రక్షన్ చేయిస్తున్న పోలీసులు.. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. వాడిని అప్పగించండితమ స్నేహితురాలిని అతికిరాతకంగా చంపిన హంతకుడిని తమకు అప్పగించాలంటూ హిజ్రాలు పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.అయ్యో.. పాపంకశింకోట మండలం బయ్యవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రెండు మందుల మధ్య ఖాళీ స్థలం దొరికిన ఒక మూటలో మొల దిగువ భాగం కాళ్లు, ఒక చేయి ఉన్నాయి.. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మూట విప్పి.. ఆ దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. సుమారు 30 ఏళ్ల వయసు.. చేతికి గాజులు.. కాలికి మట్టెలు.. ఉండడంతో ఆమె వివాహిత అని తొలుత అంతా పొరపడ్డారు. అయితే విచారణలో ఆమె దీపు అనే ట్రాన్స్‌జెండర్‌గా తేలింది. 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు ఈ హత్య కేసును ఛేదించడానికి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. అనకాపల్లి ఎస్పీ సెలవులో ఉండటంతో.. విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. సంఘటన స్థలాన్ని, ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన శరీర భాగాలను కూడా ఆయన పరిశీలించారు. అనకాపల్లిలో మహిళ దారుణ హత్య -
కట్టుకున్నోడే.. కాలయముడు
ఇరవై రెండేళ్లు కాపురం చేశారు. ఇద్దరు బిడ్డలను పెంచి పెద్ద చేశారు. కూతురి పెళ్లిని కూడా ఘనంగా చేశారు. చేతికి దొరికిన పనిచేస్తూ బతుకును చక్కగా పండించుకున్నారు. కానీ మద్యం మత్తు మగవాడి ఆలోచనను మార్చేసింది. కష్టసుఖాల్లో ఇన్నేళ్లుగా తోడుగా ఉండి నీడలా నడిచిన జీవన సహచరిపై కోపం పెంచుకునేలా చేసింది. అతడి మనసులో అనుమానపు విషాన్ని కలిపింది. దాని ఫలితం భార్య మరణం.. భర్తకు ఖైదు. కొడుక్కి జీవితకాలపు విషాదం. ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురంలో భర్త చేతిలో భార్య హతమైంది. శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలంలోని సంత సీతారాంపురంలో గాలి నాగమ్మ(42) అనే మహిళను ఆమె భర్త అప్పలరెడ్డి సోమవారం రాత్రి దారుణంగా నరికి చంపేశాడు. ఈ హత్య స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలరెడ్డి, నాగమ్మ దంపతులకు ఇద్దరు బిడ్డలు. రెండేళ్ల కిందటే అమ్మాయికి పెళ్లి చేశారు. కొడుకు త్రినాథరావుతో కలిసి విశాఖలో ఉండేవారు. త్రినాథరావు తాపీమేస్త్రీ కాగా.. తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేవారు. కుటుంబం మొత్తం కష్టాన్నే నమ్ముకుని బతికేది. గత నెలే వీరు స్వగ్రామం సంతసీతారాంపురం వచ్చేశారు. ఇక్కడ సొంతిల్లు ఉండడంతో కుమారుడికి పెళ్లి చేసి మళ్లీ విశాఖ వెళ్లిపోవాలని అనుకునేవారు. స్థానికంగా ఉండటంతో సరుగుడు, నీలగిరి చెట్లు కొట్టటం, తొక్క తీయటం వంటి పనులు చేస్తున్నారు. సోమవారం కూడా రణస్థలంలో నీలగిరి తోట కొట్టేందుకు, తొక్క తీసే పనికి భార్యాభర్తలు వెళ్లారు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనం చేశారు. కుమారుడు ఇంటి బయట మంచం వేసుకొని పడుకున్నారు. రాత్రి దంపతుల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. అప్పలరెడ్డికి మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో మందు తాగి గొడవపడడం, భార్యను అనుమానించడం వంటి పనులు చేసేవాడు. రాత్రి కూడా ఇలాగే దంపతులిద్దరూ గొడవ పడ్డారు. అయితే రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారిగా సరుగుడు, నీలగిరి చెట్లు నరికే కత్తితో ఆమెపై దాడికి తెగబడ్డాడు. మద్యం మత్తులో అతి కిరాతకంగా కత్తితో మెడ, తలపై దాడి చేశాడు. నాగమ్మ పెద్దగా కేకలు వేయడంతో కుమారుడు, చుట్టుపక్కల వారు కంగారు పడి ఇంటిలోకి వెళ్లబోతుండగా.. అప్పలరెడ్డి తలుపులు తీసి బయటకు వెళ్లిపోయాడు. లోపల చూస్తే నాగమ్మ విగతజీవిగా పడి ఉంది. హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్ఐ వి.సందీప్‌కుమార్, క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని సందర్శించింది. కుమారుడు త్రినాథరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగమ్మ మృతదేహానికి శ్రీకాకుళం రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హత్యతో గ్రామమంతా విషాదం నెలకొంది. జేఆర్ పురం సీఐ అవతారం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణా జిల్లాలో దారుణం.. సామూహిక లైంగిక దాడి
సాక్షి, కృష్ణా: కృష్ణాజిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొందరు వ్యక్తులు మైనర్‌ను నాలుగు రోజుల పాటు నిర్భంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన మైనర్(14) ఈనెల తొమ్మిదో తేదీన గన్నవరం మండలం వీరపనేని గూడెంలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అనంతరం, ఈనెల 13 న స్నేహితురాaలి ఇంటి నుంచి బయటికి వచ్చింది. రాత్రి సమయంలో ఒంటరిగా కనిపించిన బాలికను ఇద్దరు యువకులు ట్రాప్ చేశారు. ఆమెను బైక్‌పై కొంత దూరం తీసుకెళ్లి మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం, మరో నలుగురు ఆమెను నాలుగు రోజులు పాటు నిర్బంధించిన లైంగిక దాడి చేశారు.అనంతరం, ఈనెల 17న రాత్రి సమయంలో విజయవాడలోని మైలవరంలో కామాంధులు ఆమెను వదిలిపెట్టి వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్‌కి జరిగిన విషయాన్ని ఆమె తెలిపింది. దీంతో, సదరు ఆటోడ్రైవర్.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన ఆత్కూరు పోలీసులు.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించింది. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. -
అనకాపల్లిలో మహిళ దారుణ హత్య
అనకాపల్లి: అనకాపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కళింకోట మండల బయ్యవరం కల్వర్టులో కొంతమంది దుండగులు.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆమె రెండు కాళ్లు, రెండు చేతులను నరికి చంపేశారు. ఆమెను హత్య చేసిన తర్వాత బెడ్ షీట్ లో రెండు చేతులు, రెండు కాళ్లను కట్టేసి పడేశారు. అయితే బెడ్ షీట్ అనుమానాస్పదంగా రక్తంతో ఉండటంతో స్థానికంగా దాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బెడ్ షీట్ ను ఓపెన్ చేసి చూడగా ఓ మహిళకు చెందిన రెండు కాళ్లు, రెండు చేతులు అందులో ఉండటం చూసి షాక్ అయ్యారు. దాంతో స్థానికంగా కలకలం రేగింది. అసలు హత్యకు గురైంది ఎవరు అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరు?, హత్య చేయడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. -
ఐదు నెలల చిన్నారిని తల్లే చిదిమేసింది..
ఆరిలోవ(విశాఖ): భార్యాభర్తల మధ్య గొడవలు, ఒకరిపై మరొకరి అనుమానాలకు ఓ చిన్నారి బలైపోయింది. భర్త అనుమానం వేధింపులను తట్టుకోలేని ఆ తల్లి బిడ్డ ప్రాణం తీసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆరిలోవ సీఐ కథనం ప్రకారం జీవీఎంసీ 12వ వార్డు పరి«ధి పెదగదిలి దరి సింహగిరి కాలనీకి చెందిన గొర్లె వెంకటరమణకు శిరీషతో 2013లో వివాహమైంది. వెంకటరమణ ఏయూలో సీనియర్ అసిస్టెంట్. శిరీష హౌస్‌వైఫ్. సుమారు 11 ఏళ్లు తర్వాత వారికి పాప పుట్టింది. ఆ తర్వాత వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. వెంకటరమణ భార్యపై అనుమానంతో బెడ్ రూమ్‌లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. ఈ నేపథ్యంలో శిరీష తన ఐదు నెలల కుమార్తెతో ఈనెల 13న జోడుగుళ్లుపాలెం బీచ్‌కు వెళ్లింది. అక్కడ తెన్నేటి పార్కు దిగువున బంగ్లాదేశ్ నౌక చాటుకు వెళ్లి కుమార్తెను సముద్రం నీటిలో ముంచేసింది. కొంతసేపటి తర్వాత భర్తకు ఫోన్ చేసి కుమార్తె నీటిలో మునిగిపోయి చనిపోయిందని.. తాను కూడా చనిపోతానంది. వెంటనే భర్త బీచ్‌కు చేరుకుని పాపను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. శిరీషనే బిడ్డను హత్య చేసి ఉంటుందన్న అనుమానంతో ఆరిలోవ పోలీ సులకు భర్త ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసి తమదైన శైలిలో విచారించారు. దీంతో పాపను తానే చంపినట్టు శిరీషా ఒప్పుకొంది. ఇంటి వద్దే తలదిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసి.. జోడుగుళ్లుపాలెం బీచ్‌లో నీటిలో ముంచేసింది. అనంతరం తాను కూడా సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఇంతలో అక్కడ సందర్శకులు కొందరు చూడటంతో ఆత్మహత్య వీలుపడలేదు. -
భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
పాయకాపురం(విజయవాడరూరల్): మహిళతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై నున్న పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పాయకాపురం ఎల్బీఎస్ నగర్‌కు చెందిన పల్లపు నాగదుర్గ ఐదేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పొలం పనులు చేసుకునే ఆమెకు సత్తెనపల్లికి చెందిన కొక్కిలిగడ్డ మోజెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి విజయవాడ వస్తూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నాగదుర్గ కోరగా ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆమె సత్తెనపల్లి వెళ్లి మోజెస్ తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. అతను రెండు నెలల్లో పెళ్లి చేసుకొంటానని చెప్పి గుంటూరు నెహ్రూనగర్ పాత బస్‌స్టాండ్ వద్ద రూమ్ తీసుకొని కొన్ని నెలలు కాపురం చేసి వెళ్లిపోయాడు. నాగదుర్గ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఒక్క ఫోన్ చేసినా.. ఇంత అనర్థం జరిగేది కాదు
కాకినాడ రూరల్: ‘‘జరిగిన ఘటనను జీర్ణించుకోలేకపోతున్నాం. మా కుటుంబంలో అందరూ విద్యావంతులు. పెదనాన్న కొడుకు చంద్రకిశోర్ (37)ఎంబీఏ, ఎంకామ్ చదివాడు. చాలా కష్టపడి పైకి వచ్చాడు. 2014లో ఓఎన్జీసీలో ఉద్యోగంలో చేరాడు. ఒకటో తరగతి చదువుతున్న జోషిత్(7), యూకేజీ చదువుతున్న నిఖిల్(6)ను ఇటీవలే స్కూల్ మార్చాడు. ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఉన్నట్టు చెప్పలేదు. ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు’’ అని కాకినాడలో ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్య చేసుకున్న చంద్రకిశోర్ సోదరుడు, తాడేపల్లిగూడెంకు చెందిన వానపల్లి ఆదిశేషు వాపోయారు. తాడేపల్లిగూడెంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. చంద్రకు 2017లో రాజమహేంద్రవరానికి చెందిన తనూజతో వివాహమైందని, ఆమె ఎంబీఏ చదివారని తెలిపారు. కాగా, తమ సంస్థలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న చంద్రకిశోర్ చాలా మంచి వ్యక్తి అని, ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని, పిల్లలతో పాటు అతడూ చనిపోవడం బాధాకరమని ఓఎన్జీసీ, కాకినాడ హెచ్ఆర్ హెడ్ సునీల్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కలకలం రేపిన ఘటన.. ఇద్దరు కుమారులను కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి వస్త్రం కట్టి నీటి బకెట్లో ముంచి ప్రాణం తీసి, ఆపై తానూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చంద్రకిశోర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. చంద్రకిశోర్ కాకినాడ రూరల్ వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. భార్య తనూజ, ఇద్దరు పిల్లలతో కాకినాడ తోట సుబ్బారావు నగర్లో ఉంటున్నాడు. హోలీ పండగ కోసం ఓఎన్జీసీ కార్యాలయానికి భార్య, పిల్లలను తీసుకెళ్లిన అతడు.. భార్యను అక్కడే ఉంచి బట్టలు కుట్టించేందుకు అంటూ పిల్లలను బయటకు తీసుకొచ్చాడు. కాగా, కాకినాడలో పేరున్న పాఠశాలలో ఇద్దరు పిల్లలను ఏటా రూ.1.50 లక్షల ఫీజుతో చేర్పించాడు. బాగా చదవడం లేదని తిరిగి తక్కువ ఫీజున్న స్కూల్‌కు మార్పించాడు. పిల్లల చదువుపై అతడ బెంగ పెట్టుకున్నట్టు సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. -
శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న దువ్వారి మీనమ్మ, భాస్కరరావు ,లక్మీపతి మృతి చెందగా దువ్వారి కాళిదాసు, కుసుమ తీవ్రంగా గాయపడ్డారు. పాత పట్నం మండలం లోగిడి గ్రామం నుంచి విశాఖపట్నం పుట్టినరోజు వేడుకల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
రన్యారావుతో నాకే సంబంధం లేదు: పిడుగురాళ్ల వ్యాపారి
పల్నాడు, సాక్షి: పిడుగురాళ్లలో తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ ఓ వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డాడన్న వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కన్నడ నటి, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు(Ranya Rao) పేరు తెర మీదకు రాగా.. పరారీలో ఉన్నాడని చెబుతున్న సదరు వ్యాపారి ఈ అంశంపై స్పందించాడు. ఏం జరిగిందంటే.. స్థానికంగా తాను మిర్చి ఎగుమతి, బంగారు దిగుమతి చేస్తున్నానని.. తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ సదరు వ్యాపారి ప్రచారం చేశాడు. అయితే అతని ఆర్భాటాలు, అప్పటికే అతను చేసిన దానధర్మాలు చూసిన కొందరు అది నిజమేనని నమ్మారు. దాచేపల్లి, కారంపూడి, సత్తెనపల్లి, నరసరావుపేటకు చెందిన కొందరు సదరు వ్యాపారికి డబ్బు ముట్టజెప్పారు. మార్చి మొదటి వారం నుంచి ఆ వ్యాపారి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో తాము మోసపోయామన్న ఆందోళనతో బాధితులు లబోదిబోమన్నారు. అయితే సదరు వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని భావిస్తుండగా.. అతని పేరిట ఓ వాట్సాప్ సందేశం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.తానేం దేశం విడిచి పారిపోలేదని.. ఇండియాలోనే ఉన్నానని.. తనకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయని, రెండు నెలల టైం ఇస్తే అందరి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ఆ ఆడియో మెసేజ్‌లో చెప్పాడు. వందల కోట్లు ఎగ్గొట్టాడని వార్తల్లో వస్తున్న కథనాలను ఆ వ్యాపారి తోసిపుచ్చాడు. అలాగే.. నటి రన్యా రావుతో లింకులు ఉన్నాయంటూ వస్తున్న కథనాలను ఆయన ఖండించాడు. ఆమెతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని ఆ ఆడియో మెసేజ్‌తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..
తాడేపల్లిగూడెం(ప.గో.జిల్లా): పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం కంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై పనులు చేస్తున్న వాహనాన్ని శాంట్రో కారు ఢీకొట్టింది. ఏలూరు నుంచి తణుకు వైపుకు వెళుతుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.భోగెళ్ల వెంకల సత్య సురేన్, భార్య నవ్య అక్కడక్కడే మృతి చెందగా, వారి కుమార్తె వాసవి(4) తన/కు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్న క్రమంలో మృత్యువాత పడింది. మరొకవైపు అదే కారులో ప్రయాణిస్తున్న ఉప్పులూరి శ్రీరమ్య పరిస్థితి విషమంగా ఉంది, ఆమెను రాజమండ్రి ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా హైదరాబాద్ నుండి మండపేటలోని ఏడిదకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. -
AP: జాతరలో మహిళా ఎస్ఐపై దాడి.. జుట్టు పట్టుకుని తిట్టుకుంటూ..
సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకే భద్రత కరువైంది. విజయనగరంలో జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జాతరలో అధికార పార్టీకి చెందిన కొందరు యువకులు వీరంగం సృష్టించారు. అసభ్య నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. దీంతో, సదరు ఎస్ఐ.. ఈ ఘటనపై సీఐకి ఫిర్యాదు చేశారు.వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీ వేణుగోపాల స్వామి తీర్థ మహోత్సవం జరిగింది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. గుడివాడ మోహన్ సహా అతడి స్నేహితులు మద్యం మత్తులో హంగామా సృష్టించారు. వేదికపై నృత్యం చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్ఐ బి.దేవి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన యువకులు.. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై దాడికి పాల్పడ్డారు. ఆమె జుట్టు పట్టుకొని కొట్టి, అత్యంత అసభ్యకరంగా దుర్భాషలాడారు. ఆమె ప్రాణభయంతో సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వెంటాడి అక్కడ రభస సృష్టించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఎస్ఐ సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్సై అప్పలనాయుడు, ఎల్ కోట, కొత్తవలస పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలుతో పాటు సుమారు 30 మంది సిబ్బంది వాహనాలపై రాత్రి ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఘర్షణలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ దేవీకి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఇక, ఈ ఘటనపై ఎస్ఐ దేవీ.. సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ దాడితో సంబంధం ఉన్న గుడివాడ మోహన్‌తో పాటు అతని స్నేహితులు గుడివాడ సంతోష్‌కుమార్, విష్ణుదుర్గ, హర్ష, ఎర్నిబాబు, గౌరినాయుడు తనపైకి వచ్చి దుర్భాషలాడారని, తనను కొట్టి, జట్టు పట్టుకొని లాగారని, తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనను వీడియో తీస్తుండగా తన సెల్‌ఫోన్ పట్టుకొని పారిపోయారని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
చిత్తూరు ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు
చిత్తూరు, సాక్షి: పట్టణంలో జరిగిన దొంగల కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. అప్పుల పాలైన ఓ ప్రముఖ వ్యాపారి.. మరో ప్రముఖ వ్యాపారి ఇంట్లో చోరీ కోసం చేసిన ప్రయత్నమేనని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. బుధవారం వేకువ జామున కాల్పుల కలకలంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గాంధీ రోడ్డులో ఉన్న ఓ భవనంలోకి ప్రవేశించిన దొంగల ముఠా.. ఆపై పోలీసులు రావడంతో తుపాకులతో హల్చల్ చేసింది. దీంతో ఆ ప్రాంతమంతా రెండు గంటలపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను పట్టుకోగలిగారు. అనంతరం నిందితుల నుంచి కీలక వివరాలు రాబట్టారు. ప్రముఖ ఎస్ఎల్వీ ఫర్నీచర్ యజమాని సుబ్రహ్మణ్యం వ్యాపారంలో నష్టాలతో బాగా అప్పులు చేశాడు. ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకునేందుకు.. పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో కర్ణాటక, ఉత్తర రాష్ట్రాలకు చెందిన మొత్తం ఆరుగురు దొంగలతో డీల్ కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం.. ఈ ఉదయం డమ్మీ గన్స్, రబ్బరు బుల్లెట్లతో ఆ ముఠా గాంధీ రోడ్డులోని చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడ్డారు. గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. సుబ్రహ్మణ్యం డమ్మీ గన్‌తో చంద్రశేఖర్‌ను బెదిరించాడు. అయితే.. చంద్రశేఖర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి దొంగలను లోపలే లాక్ చేయగలిగాడు. ఈ క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి.ఆపై బయటకు వచ్చిన ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నలుగురిని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అది గమనించిన స్థానికులు వాళ్లపై దాడికి దిగడంతో పోలీసులు చెదరగొట్టారు. ఆ దొంగల నుంచి మూడు తుపాకులను, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం..బిల్డింగ్‌లో ఉన్న మిగతా వాళ్ల కోసం ప్రత్యేక ఆపరేషన్ కొనసాగింది. డీఎస్సీ మణికంఠ నేతృత్వంలో డాగ్ స్క్వాడ్, అక్టోపస్ బలగాలు రంగంలోకి దిగాయి. చుట్టుపక్కల భవనాల నుంచి జనాలను ఖాళీ చేయించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆపై బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పోలీసులు బలగాలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. అది గమనించిన దొంగలు పారిపోయే యత్నం చేశారు. ఈ క్రమంలో శివారులో మరో దొంగను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలపై పోలీసులు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. -
కర్ణాటక బస్సు బీభత్సం.. నలుగురి మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ డే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.మృతి చెందిన వారిలో ఆదోని మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన భార్యా భర్తలు, కర్ణాటకలోని మాన్వికి చెందిన అక్కా తమ్ముళ్లు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
రోజా కేసులో రోజుకో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఎన్ఆర్ఐ మహిళ రోజా అనుమానాస్పద మృతి క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాలతో ఎట్టకేలకు మృతురాలి స్నేహితుడు, నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎన్ఆర్ఐ మహిళ రోజాకు.. డాక్టర్ శ్రీధర్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటి?.. రోజా హోటల్‌కు వచ్చిన రెండు గంటల్లో అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక ఏం జరిగిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 1.40 గంటలకు శ్రీధర్‌ను కలిసేందుకు మేఘాలయ హోటల్లోని రూం నంబర్ 229కి రోజా వెళ్లింది. 3.35 గంటల తరువాత ఆమె బాత్రూమ్లో అపస్మారక స్థితిలో ఉందని శ్రీధర్ హోటల్ సిబ్బందికి చెప్పాడు. హత్యా? ఆత్మహత్యా? రెండు గంటల వ్యవధిలో రోజా అనుమానాస్పదంగా మృతి చెందడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రెండు గంటలు ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. ఈ సమయంలో రోజా–శ్రీధర్‌కు మధ్య గొడవ జరిగిందా?.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడా? అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆపకుండా చూస్తూ ఉండిపోయాడా?.. మృతి చెందిందని నిర్ధారించుకున్న తరువాతే హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి రోజాను ఆత్మహత్య చేసుకునేలా అమెరికాలో ఉన్నప్పటి నుంచే శ్రీధర్ ప్రేరేపిస్తున్నాడని పోలీసులు విచారణలో తెలినట్లు తెలిసింది. ఒకవేళ రోజాది ఆత్మహత్య కాకపోతే అదే రూమ్‌లో ఉన్న శ్రీధర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజా పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప నిజనిజాలు బయట పడే అవకాశం లేదు. ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చలేదెందుకు? ఈ కేసులో మొదటి నుంచి పోలీసులు నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. డాక్టర్ శ్రీధర్‌ను కేసు నుంచి తప్పించేయత్నం జరుగుతోందని విస్తృతంగా ప్రచారం జరిగింది. కేసు తేలిపోయేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకే గదిలో రోజా–శ్రీధర్ ఉన్న సమయంలో.. రోజా అనుమానాస్పదంగా మృతి చెందితే ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చకపోవడం చర్చనీయాంశమైంది. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించారు? డాక్టర్ శ్రీధర్ వెనుక ఎవరున్నారు? పోలీసులపై ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలి. ఈ కేసు విషయంలో విమర్శలు రావడంతో ఎట్టకేలకు మూడో పట్టణ పోలీసులు శ్రీధర్‌ను అరెస్టు చేసినట్లు ఆదివారం ఆర్ధరాత్రి ప్రకటించారు. అన్ని వేళ్లూ పోలీసులవైపే.. ఎన్ఆర్ఐ మహిళా అనుమానాస్పద మృతిపై పోలీసులు చర్యలు విమర్శలకు తావిచ్చింది. సంఘటన జరిగిన వెంటనే శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే నిజనిజాలు బయటపడేవి. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు నుంచి విచారణ వరకు అన్ని వేళ్లు వారివైపే చూపించేలా వ్యవహరించారు. 6వ తేదీన రోజా మృతి చెందినప్పటికీ 8వ తేదీ వరకు అటువంటి ఘటన జరగలేదు అన్నట్లు వ్యవహరించారు. పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు తప్పు చేస్తే వెనకేసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఎవరైనా తప్పు చేస్తే మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రచారం చేసుకునే పోలీసులు ఈ కేసు విషయంలో పాటిస్తున్న గోప్యత అనుమానాలకు తావిస్తోంది. -
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
నకరికల్లు: టీడీపీ, జనసేన నాయకుల బెదిరింపులు భరించలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన షేక్ ఫాతిమాబేగం (35) అదే గ్రామంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించి, తమవారిని నియమించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు బెదిరిస్తున్నారని ఫాతిమాబేగం కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 9 నెలలుగా ఆమెను బెదిరిస్తూనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫాతిమాబేగాన్ని అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగిస్తారని టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఆదివారం తమ ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే బంధువులు నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఫాతిమాబేగం భర్త సైదావలి గుంటూరులో మెకానిక్‌గా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య మృతిపై సైదావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజీలో 10 మంది అరెస్టు
నగరంపాలెం: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పది మందిని అరెస్టుచేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. లీకేజీకి వినియోగించిన 13 మొబైల్ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉత్తర డీఎస్పీ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామితో కలిసి ఆయన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వినుకొండ కాలేజీలో లీక్.. ఏఎన్‌యూ పరిధిలో గత శుక్రవారం (ఈనెల 7న) మ.2 గంటలకు బీఈడీ పరీక్ష ప్రారంభం కావల్సి ఉండగా మ.1.22కు ప్రశ్నపత్రం లీకైంది. దీన్ని ఏఎన్‌యూ ఉప కులపతి (వీసీ), పరీక్ష కేంద్రం సమన్వయకర్త గుర్తించారు. లీకేజీ వ్యవహారంపై ఏఎన్‌యూ పీజీ, వృత్తి విద్య కోర్సుల పరీక్ష కేంద్రం సమన్వయకర్త మన్నవ సుబ్బారావు పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పల్నాడు జిల్లా వినుకొండ టౌన్‌లోని శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థలోని కంప్యూటర్ గది నుంచి లీకైనట్లు తేల్చారు. దీంతో కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ రఫిక్ అహ్మద్, ప్రిన్సిపాల్ దుపాటి సురేష్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ ధార స్వర్ణరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ నిర్వాకం ఇక పరీక్ష ప్రారంభమయ్యే నలభై నిమిషాల ముందు ఆయా పరీక్ష కేంద్రాలకు పాస్వర్డ్ పంపిస్తారు. తద్వారా పాస్వర్డ్ కొట్టి, ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. కానీ, ఈ పాస్‌వర్డ్‌ను కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, కంప్యూటర్ ఆపరేటర్లు దుర్వినియోగం చేసి, వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు. తద్వారా ఒడిశాకు చెందిన సంతోష్‌కుమార్ సాహు, బిష్ణుప్రసాద్ పాత్రో, సుకాంత్, విద్యార్థులు పురుషోత్తం ప్రధాన్, ధీరేన్కుమార్ సాహులకు చేరింది. వీరు ప్రియబత్రో గోడయ్, మిలాన్ తృష్టిలకు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ పదిమందినీ అరెస్టుచేసి వీరి నుంచి 13 మొబైల్ఫోన్లను స్వా«దీనం చేసుకుని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. ఒడిశా నిందితులు తమ రాష్ట్రంలో విద్యార్థులతో బీఈడీ పరీక్షలు రాయించి వారు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతయ్యేందుకు ఈ లీకేజీకి శ్రీకారం చుట్టారు. అలాగే, శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వాహకులు కూడా ఇదే పద్ధతి అవలంబించినట్లు దర్యాప్తులో తేలింది. ఇక కేసుని త్వరితగతిన ఛేదించిన ఉత్తర డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామిలను ఎస్పీ అభినందించారు. -
ఎన్ఆర్ఐ మహిళ మృతి కేసులో బిగ్ ట్విస్ట్
విశాఖ: ఇటీవల నగరంలో ఓ స్టార్ హోటల్ లో ఓ ఎన్ఆర్ఐ మహిళ మృతికి సంబంధించిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు, అనుమానితులు ఎవరూ లేరని తొలుత ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న పోలీసులు.. చివరకు ఆమె వెంటే ఉన్న డాక్టర్ శ్రీధర్ ను అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి అనుమానాలు ఎక్కువ కావడంతో పాటు ‘సాక్షి’ వరుస కథనాలతో పోలీసు యంత్రాంగం కదిలింది. ఆ ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య చేసుకునేలా డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రేరేపించాడని అభియోగాలు నమోదు చేసిన పోలీసులు.. డాక్టర్ శ్రీధర్ ను అరెస్ట్ చేశారుఈ నెల 8వ తేదీన ఓ స్టార్ హెటల్ లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ హోటల్ వాష్ రూమ్ లో ఎన్నారై మహిళ ఉరివేసుకుని ఉంది. అయితే ఆ సమయంలోనే కూడా ఉన్న డాక్టర్ పై అనుమానాలు రేకెత్తాయి. చివరకు డాక్టర్ శ్రీధర్ ను అరెస్ట్ చేయడంతో ఈ కేసు మరో అడుగు ముందుకు కదిలింది. బీఎన్ఎస్ 108 ప్రకారం కేసు నమోదు చేసి.. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. అయితే ఎన్నారై మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకునేలా చేశాడా?, లేక హత్య చేశాడా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. ఇక డాక్టర్ పిల్లా శ్రీధర్ ను పోలీసులు కస్టడీకి కోరతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
బ్యాంకింగ్ సంస్థల పేరిట బురిడీ!
సాక్షి, అమరావతి: బ్రాండింగ్ ముసుగులో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేర్లతోనే అత్యధికంగా నిధులు కొల్లగొడుతున్నారు. రిటైల్, టెక్నాలజీ రంగాల పేరిట మోసాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక సైబర్ నేరస్తులు నిధులు కొల్లగొట్టేందుకు ఫిషింగ్ యాప్‌లు, లింక్‌లనే ప్రధాన సాధనంగా చేసుకుంటున్నారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘క్లౌడ్ సేక్’ దేశంలో సైబర్ నేరాల తీవ్రతపై తాజా నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2025లో దేశంలో సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయే అవకాశాలున్నాయని కూడా అంచనా వేసింది. నివేదికలోని ప్రధాన అంశాలివి..» బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో 39.5 శాతం సైబర్ నేరాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిటæ బురిడీ కొట్టించి నిధులు కొల్లగొడుతున్నారు. » రెండు, మూడు స్థానాల్లో రిటైల్/ఈ–కామర్స్, టెక్నాలజీ సంస్థలున్నాయి. రిటైల్ సంస్థల పేరుతో 21.4 శాతం, టెక్నాలజీ సంస్థల పేరిట 12.5శాతం సైబర్ నేరస్తులు బురిడీ కొట్టిస్తున్నారు. ఇక టెలీ కమ్యూనికేషన్ల సంస్థలు(9.1శాతం), ట్రావెల్ సంస్థలు(8.6శాతం), రియల్ ఎస్టేట్ సంస్థలు(2.5శాతం), బీమా కంపెనీలు(1.9%) పేరిట కూడా సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు.» సైబర్ ముఠాలు అత్యధికంగా ఫిషింగ్ యాప్‌లు/లింకులనే తమ మోసాలకు సాధనంగా చేసుకుంటున్నాయి. ఫిషింగ్ యాప్‌లు/ లింకులు పంపి వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాల్లో నిధులు కొల్లగొడుతున్నాయి. మొత్తం సైబర్ నేరాల్లో ఈ తరహా మోసాలు ఏకంగా 58% ఉండటం గమనార్హం. » తర్వాత స్థానాల్లో సోషల్ మీడియా మాధ్యమాలున్నాయి. ఫేక్ ఫేస్బుక్ ఐడీల పేరిట 25.7శాతం, యూట్యూబ్ ద్వారా 5.8శాతం, ఎక్స్( ట్విట్టర్) ఖాతాల ద్వారా 3.2శాతం, ఇన్స్టాగామ్ ద్వారా 2.5శాతం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. » సైబర్ నేరస్తులు 2025లో దేశంలో ఏకంగా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని అంచనా. దేశంలో సైబర్ మోసాలపై ఏకంగా 25 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉంది. వాటిలో 41 శాతం వరకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే ఉంటాయని భావిస్తున్నారు. ఇక దేశంలో మోసపూరితమైన యాప్‌లు 83 శాతం, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు 65 శాతం పెరగొచ్చని అంచనా. -
విశాఖలో ఎన్నారై మహిళ అనుమానాస్పద మృతి!
విశాఖ: నగరంలోని ఓ స్టార్ హెటల్ లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ హోటల్ వాష్ రూమ్ లో ఎన్నారై మహిళ ఉరివేసున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నట్లు సీపీ తెలిపారు. దీనికి సంబంధించి ఆమె వెంట ఉన్న ఎన్ఆర్ఐ డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయ్యిందని, అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేసి ఆమె మెడకు ఉరితాడు బిగించి వాష్ రూమ్ లో పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చారు.. ఆమె కూడా ఉన్న డా క్టర్ ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’
తిరుపతి: మండల కేంద్రమైన సైదాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సైదాపురం–తిప్పవరపాడు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురానికి చెందిన దొడ్డగా మునెయ్య, భార్య జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె వైష్ణవి రక్తగాయాలతో బయటపడింది. ఈ క్రమంలో శుక్రవారం సైదాపురంలో మృతదేహాలకు అంతిమ వీడ్కోలు పలికారు.కంటతడి పెట్టించిన కుమార్తెల మాటలుకళ్లెదుటే తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడంతో ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’ అంటూ వారిపై పడి గుండెలు బాదుకోవడం అక్కడి వారిని కలచివేసింది. గాయపడిన వైష్ణవి చివరగా తల్లిదండ్రుల అంతిమయాత్రలో టాటా చెప్పడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది.గోకుల బృందావనంలో పుట్టి..మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోనే ఉన్న గోకుల బృందావనం గ్రామంలో దొడ్డగ మునెయ్య జన్మించారు. ఆయనకు అన్నలు భాస్కర్, చంద్రయ్య ఉన్నారు. వారంతా గోకులబృందావనం గ్రామం వీడి సైదాపురానికి చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. మునెయ్యకు పెళ్లి చేసి సైదాపురంలోనే ఇల్లు కటించి బాగోగులు చూసుకునే వారు. ఈ క్రమంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునెయ్యతోపాటు భార్య జ్యోతి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డలను వదిలివెళ్తున్నారా..! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! -
స్కూటీ అదుపు తప్పి.. మహిళా పోలీస్ దుర్మరణం
అనకాపల్లి: స్కూటీ (Scooty)అదుపు తప్పిన ఘటనలో మహిళా పోలీసు(Female police officer) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మల్కాపురం ఎస్ఐ శ్యామలరావు తెలిపిన వివరాలివి. అంగనపూడి ప్రాంతానికి చెందిన మీను భూషణ్(46) కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త స్టీల్‌ప్లాంట్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మీను భూషణ్ తన కుమార్తెతో కలిసి స్కూటీపై షీలానగర్ నుంచి పోర్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా నగరం వైపు వెళ్తున్నారు. బ్రిడ్జి ఎక్కుతుండగా, ఆమె వెళ్తున్న మార్గంలో ఇద్దరు వ్యక్తులు గడ్డి పట్టుకుని రోడ్డు దాటుతున్నారు. వారిని గుర్తించిన మీను భూషణ్ వెంటనే తన స్కూటీకి అకస్మాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో వాహనం అదుపు తప్పి పక్కనున్న డివైడర్‌ను ఆమె ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మీను భూషణ్‌కు తలకు, ఆమె కుమార్తెకు శరీరంపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మీను భూషణ్ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను.. -
పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను..
ఏలూరు : ‘బండి చోరీ కేసు అంటూ.. మూడు రోజుల క్రితం మా అబ్బాయిని పోలీసులు(Police) తీసుకువెళ్లారు.. నిన్న స్టేషన్‌కు వెళ్లాను.. ఒక్కసారైనా మా అబ్బాయి ముఖం చూపించండయ్యా అని పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను.. ఏమీ లేదమ్మా.. రేపు ఇంటికి వచ్చేస్తాడు అన్నారు.. వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, హనుమాన్ జంక్షన్ పోలీస్స్టేషన్లల్లో ఉన్నాడని తలో మాట చెప్పారు.. ఈరోజు చూస్తే జీజీహెచ్‌లో శవమై కనిపించాడు’ అంటూ బాలుడి తల్లి వనిత బోరున విలపించింది. పదో తరగతి విద్యార్థి(Tenth grade student) (16) ఒంటిపై, అరికాళ్లపై దెబ్బలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఏలూరులో తీవ్ర సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఏలూరులోని చేపలతూము ప్రాంతానికి చెందిన బంగారు శివ చింతలపూడిలోని విద్యాశాఖలో అ టెండర్‌గా పనిచేస్తున్నారు. శివ చిన్న కుమారుడు యశ్వంత్‌కుమార్ (16) ఏలూరులోని ప్రభుత్వ హై సూ్కల్లో పదో తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఏలూరు సీసీఎస్ పోలీసులు బండి చోరీ కేసులో రికవరీల కోసమని యశ్వంత్‌తో పాటు మరో ఆరుగురు పిల్లలను తీసుకువెళ్లారు. అయితే వారిని సీసీఎస్ స్టేషన్లో కాకుండా వేరే ప్రాంతంలో ఉంచి విచారించారు. ఈ నేపథ్యంలో తన కుమారు డి కోసం యశ్వంత్ తల్లి వనిత రెండు రోజులుగా పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఈ క్రమంలో గురువారం వేకువజామున 5 గంటల సమయంలో పెదవేగి మండలం మొండూ రు ప్రాంతంలో గోదావరి కుడికాల్వ గట్టుపై య శ్వంత్ అపస్మారక స్థితిలో పడి ఉండగా.. గుర్తించి ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే బా లుడు అప్పటికే మృతి చెందడంతో మార్చురీలో పెట్టి కనీసం కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదు. మార్చురీ వద్ద ఆందోళన మార్చురీ సిబ్బంది ద్వారా యశ్వంత్ మృతి వార్త తెలిసిన తల్లిదండ్రులు శివ, వనిత, సోదరుడు కృష్ణవర్ధన్ బంధువులతో కలిసి జీజీహెచ్‌కు వచ్చారు. యశ్వంత్ మృతదేహాన్ని చూసి బోరున విలపించా రు. అరికాళ్ల నుంచి చాతీ వరకూ తీవ్ర గాయాలయ్యేలా నిర్దాక్షిణ్యంగా పోలీసులే కొట్టి చంపేసి, శవాన్ని ఎక్కడో పడేశారంటూ విలపించారు. తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలంటూ మార్చురీ వద్ద బైఠాయించి దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని ఆందోళనకు దిగారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చొదిమెళ్లలో జరిగిన బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడానికి కలెక్టర్ వెట్రిసెల్వి జీజీహెచ్‌కు రాగా ఆమెను కలిసి యశ్వంత్ మృతిపై ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించి న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. భిన్నంగా పెదవేగిలో ఫిర్యాదు ఇదిలా ఉండగా పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో భిన్నంగా ఫిర్యాదు నమోదైంది. పోలీసులు, చోటా నేతల ఒత్తి ళ్లతో యశ్వంత్ సోదరుడు కృష్ణవర్ధన్‌తో పెదవేగి పో లీసులు ఫిర్యాదు తీసుకున్నారు. ఈనెల 5న తన సో దరుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, 6న మొండూరు కాల్వ గట్టుపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెదవేగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతిచెందాడని, మార్చురీకి తరలించి తమకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నాన్న కాదు.. నరహంతకుడు..
దారుణాతి దారుణం.. ఘోరాతి ఘోరం.. కన్నతండ్రే కూతురికి స్వయంగా మరణశాసనం రాశాడు. దగ్గరుండి మరీ కన్నబిడ్డను కాటికి పంపాడు. కళ్లెదుట కన్నకూతురు ప్రాణాలు పోతున్నా ఆ పాషణ హృదయం కరగలేదు. ప్రేమించిన వాడిని మరిచిపోలేనని చెప్పిన పాపానికి కూతురిని కర్కశంగా బలితీసుకున్నాడో నరహంతక తండ్రి. ఈ అవమానవీయ ఘటన గురించి తెలిసిన వారందరూ భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నారు.గుంతకల్లు రూరల్: కుమార్తె ప్రేమ వ్యవహారం (love affair) కారణంగా కుటుంబ పరువు, మర్యాద మంటగలసి పోతున్నాయనే ఉద్దేశంతో కన్న కూతురినే కడతేర్చాడో తండ్రి. అనంతపురం జిల్లా (Anantapur District) గుంతకల్లులో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్లో నివాసం ఉంటున్న తుపాకుల రామాంజనేయులు, సావిత్రి దంపతులకు నలుగురు కుమార్తెలు. హోటల్ నిర్వహణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు ఇదివరకే వివాహం చేశారు. చివరి కుమార్తె భారతి (20) కర్నూలులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈమె ఇంటికి సమీపంలోనే ఉంటున్న యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిస్తూ వచ్చారు. ఎంతకూ వారి మాట వినని భారతి ‘చావనైనా చస్తాను గానీ ప్రేమించిన యువకుడిని మరచిపోలేన’ని తెగేసి చెప్పింది. నిర్మానుష్య ప్రాంతంలో ఘాతుకం..తండ్రి రామాంజనేయులు ఈ నెల ఒకటో తేదీన కుమార్తెతో మరోమారు మాట్లాడి.. ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశాడు. అయినా వినకపోవడంతో తనతో పాటు ఒక తాడును తీసుకొని కుమార్తెను స్కూటర్‌పై తీసుకొని కసాపురం గ్రామ శివారులోని తిక్కస్వామి తోట సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. తాడుతో అక్కడి చెట్టుకు ఉరితాడు సిద్ధం చేశాడు. ఇప్పటికైనా మాట వింటావా లేక చస్తావా అని అడిగాడు. తాను చావడానికైనా సిద్ధమని స్పష్టం చేయడంతో ‘సరే చావు’ అంటూ ఆమెను ఎత్తి పట్టుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి చెట్టుకు వేలాడుతున్న ఉరితాడును తన మెడకు వేసుకుంది.కుమార్తెను మరోసారి బతిమాలిన రామాంజనేయులు ఆమె మాట వినకపోవడంతో ఉరికి వదిలేసి.. వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు కదిలాడు. కొంత దూరం వచ్చాక తిరిగి వెనక్కు వెళ్లి చూడగా అప్పటికే భారతి విగతజీవిగా ఉరికి వేలాడుతోంది. దీంతో మృతదేహాన్ని కిందకు దింపి తన స్కూటర్లోని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజుల తర్వాత ఈ నెల నాల్గో తేదీన గుంతకల్లు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. కుమార్తెను చంపేశానని చెప్పి లొంగిపోయాడు.చదవండి: పాపం శిరీష.. ఆడపడుచు కపట ప్రేమకాటుకు బలైందికసాపురం శివారులో ఘటన జరిగినట్లుగా తెలపడంతో రామాంజనేయులుతో కలిసి రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ టీపీ వెంకటస్వామి, పోలీసులు మంగళవారం రాత్రి 9.30 గంటల వరకూ గాలింపు చేపట్టినా ఘటనా స్థలాన్ని గుర్తించలేకపోయారు. దీంతో బుధవారం ఉదయం మరోమారు గాలించి సంఘటన స్థలాన్ని గుర్తించారు. కాలిన మృతదేహాన్ని కొంతమేర కుక్కలు పీక్కు తిన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
Kuppam : ప్రేమ వివాహం చేసుకుందని..!
కుప్పం: అల్లారుముద్దుగా పెంచిన ఒక్కగానొక్క కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని తండ్రి జీరి్ణంచుకోలేకపోయాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి, రాజీ కుదుర్చుతుండగా అమ్మాయి తండ్రి ప్రేమికులపై దాడి చేశాడు. దీంతో ప్రేమికులతో పాటు మధ్యవర్తులకూ గాయాలయ్యాయి. ఈ సంఘటన కుప్పం పట్టణం ఆర్అండ్బీ అతిథిగృహంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. గుడుపల్లె మండలం అగరం కొత్తూరు గ్రామానికి చెందిన శివశంకర్, కోదండప్ప అనే వ్యక్తులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో కోదండప్ప కుమారుడు చంద్రశేఖర్, శివశంకర్ కుమార్తె కౌసల్య ఇరువురు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కౌసల్య ఒక్కగానొక్క కూతురు కావడంతో శివశంకర్ కూతుర్ని గారాబంగా పెంచి డిగ్రీ చదివిస్తున్నాడు. కౌసల్య, చంద్రశేఖర్‌ల ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో శివశంకర్ తన కూతురు కౌసల్యను పలుమార్లు మందలించాడు. డిగ్రీ వరకు చదువుకున్న అమ్మాయిని వ్యవసాయ కూలీకి ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేదంటూ కూతురికి పలుసార్లు నచ్చజెప్పాడు.కానీ కౌసల్య ససేమిరా అనడంతో పాటు గత రెండు రోజుల క్రితం చంద్రశేఖర్‌తో పరారై తమిళనాడులోని ఓ దేవస్థానంలో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అగరం కొత్తూరు గ్రామస్తులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగా గురువారం ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద పంచాయితీ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న శివశంకర్ కత్తులతో ఒంటరిగా ఉన్న ప్రేమికులపై దాడి చేశాడు. ఈ దాడిలో కౌసల్య చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి అడ్డువచ్చిన గ్రామస్తులు రమేష్, సీతారామప్పలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరిని పక్కనే ఉన్న కుప్పం వంద పడకల ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏలూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్‌ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.లారీ లోయలో పడి ముగ్గురి మృతిమరో ఘటనలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ పైన బుధవారం మధ్యాహ్నం లారీ లోయలోకి పడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళ్తున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి 50 అడుగులున్న లోయలోకి పడిపోయింది.లారీలోని డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె.వివేకానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా లారీ మూడు ముక్కలుగా విడిపోయి కేబిన్ నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రక్షక్ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందిని, 108 అంబులెన్స్‌ను పిలిపించి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు.