
సమంత పేరు చెప్పగానే చాలామందికి ఆమె విడాకుల అంశమే గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేసింది. అప్పట్లో చైతూ కంటే సామ్ పై ఎక్కువ విమర్శలు వచ్చాయి. కాలక్రమేణా ఆ విషయం గురించి అందరూ మర్చిపోయారు.
తర్వాత కాలంలో అప్పుడప్పుడు సామ్.. బయట మాట్లాడినప్పుడు కావొచ్చు, ఇన్ స్టాలో పోస్ట్ చేసే స్టోరీల వల్ల కావొచ్చు చిన్నపాటి ట్రోలింగ్ ఫేస్ చేస్తూ ఉంటుంది. ఇదంతా సమంతకు తెలియంది ఏమి కాదు. ఇక విడాకుల తర్వాత మయోసైటిస్ వ్యాధి గురించి బయటపెట్టడం, దాని చికిత్స కారణంగా చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు 'శుభం' చిత్రాన్ని సిద్ధం చేసింది.
(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)
సమంత నిర్మాతగా మారి తీసిన మొదటి సినిమా ఇది. మే 09న థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా రీసెంట్ గానే వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇప్పుడు మంగళవారం హైదరాబాద్ లో విలేకరులతో సినిమా విశేషాలు మాట్లాడింది. అలానే తన వ్యక్తిగత జీవితం గురించి ఇకపై మాట్లాడనని, ఈ మేరకు తాను డిసైడ్ అయినట్లు చెప్పుకొచ్చింది.
ఎందుకంటే సమంత నుంచి విడాకులు తీసుకున్న నాగచైతన్య.. హీరోయిన్ శోభితని గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు సామ్ కూడా 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడమోరుతో రిలేషన్ లో ఉందనే కామెంట్స్ వినిపించాయి. పెళ్లి రూమర్స్ కూడా వస్తున్నాయి గానీ ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)